What Happens to Body Without Water: మనలో చాలా మంది పనిలో పడి సమయానికి నీళ్లు తాగడం మరిచిపోతుంటారు. ముఖ్యంగా కొంతమందికి ఈ చలికి నీళ్లు కూడా తాగబుద్ధి కాదు. కానీ, శరీరం తన విధుల్ని తాను సక్రమంగా నిర్వర్తించడాలంటే మాత్రం తగినన్ని నీళ్లు తాగాల్సిందేనని వైద్యులు చెబుతున్నారు. శరీరంలో సరైన మోతాదులో నీళ్లు లేకపోతే అనేక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అవేంటి? నీరు లేకపోతే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
మనం ఉదయం లేచిన దగ్గర నుంచి ఆఫీసుకి వెళ్లేవరకూ పరుగులు తీస్తూ... గుక్కెడు మంచినీళ్లు తాగడం మర్చిపోతుంటాం. అయితే, ఇలా చేయడం వల్ల అలసటకు దారితీస్తుందని మీకు తెలుసా? అంతేకాకుండా, శరీరంలో నీరు లేక తేమ తగ్గి.. అలసట, తలనొప్పి, ఇంకా శక్తిని కోల్పోవాల్సి వస్తుందని నిపుణులు అంటున్నారు. అందుకే, లేచిన వెంటనే ఓ అరగ్లాసైనా మంచినీళ్లు తాగాలని సూచిస్తున్నారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ప్రకారం.. తలనొప్పి తగ్గేందుకు నీరు తాగడం మంచిదని సూచించారు. (రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి).
మనం సాధారణంగా ఏ చిన్న శ్రమ చేసినా శరీరంలోని నీరు చెమట రూపంలో బయటకు వెళ్లిపోతుంది. బయటి వాతావరణానికి తగ్గట్లుగా శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధం చేస్తుందని నిపుణులు అంటున్నారు. అంతేనా మూత్రపిండాలు నీటిని ఉపయోగించి శరీంలోని విష వ్యర్థాలను బయటకు పంపిస్తాయని చెబుతున్నారు. అందుకే తప్పకుండా శరీరంలో నీటి మోతాదులు ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు.
ఇంకా మసాలా దట్టించిన ఆహారం తీసుకున్నా, ఆలస్యంగా తిన్నా కూడా ఒక్కోసారి కడుపు ఉబ్బరంగా ఉంటుంది. ఇలాంటి సమయంలో గోరువెచ్చగా గ్లాసు నీళ్లు తాగితే సమస్య తీరిపోతుందని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే, జీర్ణప్రక్రియలో నీళ్లు కీలకపాత్ర పోషిస్తాయని వివరిస్తున్నారు. ఇది ఆహారాన్ని కరిగించడంలో, శరీరానికి అవసరమైన పోషకాలను త్వరితగతిన శోషించుకునేలా చేయడంలో చాలా ముఖ్యమని వెల్లడిస్తున్నారు.
మనలో చాలా మందికి ముఖ్యంగా పెద్ద వాళ్లకు కీళ్లనొప్పులు వేధిస్తుంటాయి. ఇంకా కండరాల బలహీనతతో ఏ పనీ చేయలేకపోతుంటారు. ఇలాంటి సమస్యలకు డీహైడ్రేషన్ కారణ కావొచ్చని నిపుణులు చెబుతున్నారు. అందుకే ఇలాంటి సమయంలో ఓ గ్లాసు నీళ్లు తాగాలని సూచిస్తున్నారు. నీరు తాగడం వల్ల నొప్పులను తగ్గించడంతో పాటు మెదడు పనితీరుని కూడా మెరుగుపరుస్తుందని వివరిస్తున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
బబుల్ గమ్ నమిలితే ఎన్ని లాభాలో మీకు తెలుసా? నిజంగానే బరువు తగ్గుతారా?
తరచూ మూడ్ మారుతుందా? ఏకాగ్రత లోపిస్తుందా? అయితే మీకు థైరాయిడ్ వచ్చే ఛాన్స్ ఉందట!