ETV Bharat / state

దిల్‌ రాజు, మైత్రి మూవీ మేకర్స్ కార్యాలయాల్లో రెండోరోజు ఐటీ సోదాలు - కీలక ఆధారాల సేకరణ - IT RAIDS ON DIL RAJU OFFICE

దిల్‌ రాజు, మైత్రి మూవీ మేకర్స్ కార్యాలయాల్లో ఐటీ దాడులు - గత రెండు రోజుల నుంచి కొనసాగుతున్న సోదాలు - పలు సంస్థల వ్యాపార లావాదేవీలు, పత్రాలు స్వాధీనం

IT Raids on Film Producer Dil Raju House
IT Raids on Film Producer Dil Raju House (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 22, 2025, 12:43 PM IST

IT Raids on Film Producer Dil Raju Office : హైదరాబాద్‌ నగరంలో సినీ ప్రముఖుల ఇళ్లలో రెండో రోజు ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. మంగళవారం తెల్లవారుజామున ఏకకాలంలో 55 ఐటీ బృందాలతో మొదలైన ఈ తనిఖీలు బుధవారం కూడా కొనసాగుతున్నట్లు ఐటీ వర్గాలు వెల్లడించాయి. 'సంక్రాంతికి వస్తున్నాం', 'గేమ్‌ ఛేంజర్‌' చిత్రాల నిర్మాత, తెలంగాణ ఫిల్మ్‌ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ దిల్‌ రాజు ఇళ్లు, కార్యాలయాల్లో తనిఖీలు చేస్తున్నారు. అదేవిధంగా పుష్ప-2 సినిమా నిర్మించిన మైత్రీ మూవీస్‌ నిర్వాహకులు యలమంచిలి రవిశంకర్‌, యన్నేని నవీన్‌, ఆ సంస్థ సీఈవో చెర్రి ఇళ్లలో ఆ సంస్థ కార్యాలయాల్లోనూ సోదాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు మ్యాంగో మీడియా సంస్థ యజమానులు ఇల్లు, కార్యాలయాల్లో కూడా తనిఖీలు చేస్తున్నట్లు ఐటీ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే ఆయా సంస్థలకు చెందిన వ్యాపార లావాదేవీలను పరిశీలించిన ఐటీ బృందాలు బ్యాంకుల లావాదేవీలను కూడా పరిశీలిస్తున్నారు.

ప్రాథమిక ఆధారాలతో కేసులు నమోదు : మరోవైపు ఆయా సంస్థలకు చెందిన బ్యాంకు లాకర్లను కూడా తెరిపించి అందులో ఏమున్నాయో పరిశీలిస్తున్నారు. మంగళవారం దిల్‌ రాజ్‌ భార్యను బ్యాంకుకు తీసుకెళ్లి లాకర్లు తెరిపించి పరిశీలించారు. సినిమాల్లో భారీగా పెట్టుబడులు పెట్టడం, వాటికి రిటర్న్‌లు కూడా ఆశించిన స్థాయిలో వస్తుండడంతో ఆ స్థాయిలో ఐటీ చెల్లింపులు లేవని భావించి ప్రాథమిక ఆధారాలతో కేసులు నమోదు చేసిన తర్వాతే సోదాలు మొదలు పెట్టినట్లు ఐటీ వర్గాలు పేర్కొన్నాయి. బుధవారం సాయంత్రానికి కొన్ని చోట్ల ఐటీ సోదాలు ముగిసే అవకాశం ఉందని ఐటీ అధికారులు తెలిపారు. ఒకసారి సోదాలు మొదలైతే పూర్తియ్యే వరకు అక్కడ నుంచి ఐటీ బృందాలు కదలవు. అందుకే మంగళవారం నుంచి తనిఖీలు కొనసాగుతున్నాయి.

దిల్‌రాజు, పుష్ప-2 నిర్మాతల ఇళ్లపై ఐటీ దాడులు - కీలకపత్రాలు స్వాధీనం

మాదాపూర్​లోని గ్రీన్ ​కో కార్యాలయంలో ఏసీబీ సోదాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.