ETV Bharat / business

తక్కువ ఫీజ్​తో ఎక్కువ బెనిఫిట్స్- ఈ టాప్ కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్స్ గురించి తెలుసా? - BEST CO BRANDED CREDIT CARDS

ఎన్నో రాయితీలు, రివార్డు పాయింట్లు- వార్షిక ఫీజు సైతం నామమాత్రమే- టాప్-6 కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డులు ఇవే

Best Co Branded Credit Cards
Best Co Branded Credit Cards (Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 22, 2025, 1:29 PM IST

Best Co Branded Credit Cards : మీరు కొన్ని ప్రముఖ బ్రాండ్ల ఉత్పత్తులను ఎక్కువగా షాపింగ్ చేస్తుంటారా? ఆ కొనుగోళ్లపై ఆకర్షణీయమైన రాయితీలను కోరుకుంటున్నారా? అయితే కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డులు మీ అవసరాలను పూర్తిస్థాయిలో తీరుస్తాయి. తగినన్ని ప్రయోజనాలను అందిస్తాయి. ఎందుకంటే ఈ రకం క్రెడిట్ కార్డులను ఆయా బ్రాండెడ్ ఉత్పత్తుల కంపెనీలు, బ్యాంకులు కలిసి జారీ చేస్తుంటాయి. 2025 సంవత్సరంలో మీరు పరిశీలించదగిన టాప్-6 కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డుల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.

టాప్-6 కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్స్

1. 'ఫిన్ బూస్టర్' (Fin Booster) క్రెడిట్ కార్డు ఫీచర్లు

  • ఫిన్ బూస్టర్ అనే కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డును యస్ బ్యాంకు, బ్యాంక్ బజార్ సంయుక్తంగా జారీ చేస్తున్నాయి. దీనికి మొదటి సంవత్సరంలో ఎలాంటి ఫీజూ లేదు.
  • యస్ బ్యాంకు, బ్యాంక్ బజార్ సంయుక్తంగా జారీ చేసే క్రెడిట్ కార్డు ఇది. దీనితో షాపింగ్ చేయగా వచ్చే రివార్డు పాయింట్లపై ఎక్స్‌పరీ తేదీ అనేది ఉండదు.
  • ఆన్‌లైన్‌లో నిత్యావసరాలు, దుస్తుల షాపింగ్ చేసి, ఈ కార్డుతో చెల్లింపులు చేస్తే 3 రెట్లు ఎక్కువ రివార్డు పాయింట్లు వస్తాయి.
  • డైనింగ్ చేసి ఈ కార్డుతో పేమెంట్ చేసినా, ఆన్‌లైన్‌లో దీని ద్వారా డైనింగ్ ఆర్డర్లు ఇచ్చినా 5 రెట్లు ఎక్కువ రివార్డు పాయింట్లు లభిస్తాయి.
  • ఇంధనం కాకుండా ఇతరత్రా రిటైల్ కొనుగోళ్లకు ఈ కార్డుతో చెల్లింపులు చేస్తే ప్రతీ రూ.200 చెల్లింపునకు 2 పాయింట్లు వస్తాయి.
  • రివార్డు పాయింట్లను మీరు స్నేహితులు, కుటుంబీకులతో షేర్ కూడా చేసుకోవచ్చు. లేదంటే వాటిని క్రెడిట్ కార్డ్ బ్యాలెన్స్‌లా వాడుకోవచ్చు.
  • రూ.400 నుంచి రూ.5వేలలోపు ఇంధన చెల్లింపులలో 1 శాతం వరకు సర్​ఛార్జ్ మాఫీ అవుతుంది. ప్రతీ నెలలో గరిష్ఠంగా రూ.125 వరకు ఈవిధంగా సర్‌ఛార్జ్ మాఫీని పొందొచ్చు.
  • కార్డుదారుడికి రూ.2.50 లక్షల ప్రమాద బీమా వసతి ఉంటుంది.
  • క్రెడిట్ ఫిట్‌నెస్ ట్రాకర్‌ను కార్డుదారుడికి ఇస్తారు. ఇందులో నెలవారీ క్రెడిట్ ఫిట్‌నెస్ రిపోర్ట్‌ను చూసుకోవచ్చు. క్రెడిట్ ఫిట్‌నెస్ ట్రాకర్‌ సంవత్సరం ఫీజు రూ.400. కార్డు ద్వారా ఏటా రూ.1 లక్షకుపైగా లావాదేవీలు చేస్తే ఈ ఫీజును మినహాయిస్తారు.

2. RBL Bank BankBazaar SaveMax Credit Card

  • 'ఆర్‌బీఎల్ బ్యాంక్ బ్యాంక్‌బజార్ సేవ్‌మ్యాక్స్' క్రెడిట్ కార్డుకు కూడా మొదటి సంవత్సరంలో ఎలాంటి ఫీజూ లేదు.
  • ఈజీ ఈఎంఐలు : క్రెడిట్ కార్డు ద్వారా రూ.2,500కుపైగా ఖర్చులు చేస్తే వాటిని ఈఎంఐలుగా మార్చుకోవచ్చు.
  • ఇన్‌‌స్టా ఫండ్స్ : క్రెడిట్ కార్డు నుంచి నేరుగా బ్యాంకు ఖాతాలోకి నగదును పంపుకునే సౌకర్యం ఉంటుంది.
  • రివార్డు పాయింట్లు : నిత్యావసరాల ఖర్చులపై 5 రెట్లు ఎక్కువ పాయింట్లను పొందొచ్చు. (ప్రతినెలా 1000 పాయింట్ల వరకు)
  • క్యాష్ బ్యాక్ ఆఫర్లు : బుక్ మై షో, జొమాటోలలో చేసే లావాదేవీలపై 10 శాతం క్యాష్ బ్యాక్ లభిస్తుంది (ఒక్కో మర్చంట్ వద్ద ప్రతినెలా రూ.100)
  • ఈఎంఐ ఇన్ఫినిటీ పాస్ : ఈఎంఐలను మరింత చిన్న మొత్తంగా విభజించుకునే క్రమంలో విధించే ఛార్జీలపై 100 శాతం రాయితీ లభిస్తుంది.
  • ఆర్‌బీఎల్ బ్యాంక్ మైకార్డ్ యాప్ : ఈ యాప్‌లోకి వెళ్లి కార్డుకు సంబంధించిన అన్ని వివరాలు చూడొచ్చు.
  • కాంటాక్ట్ లెస్ పేమెంట్స్ : ఈ కార్డుతో రిటైల్ దుకాణాల్లో రూ.5వేల దాకా కాంటాక్ట్ లెస్ పేమెంట్లు చేయొచ్చు.

3. Standard Chartered EaseMyTrip Credit Card Key Features

  • 'స్టాండర్డ్ ఛార్టర్డ్ ఈజ్ మై ట్రిప్' క్రెడిట్ కార్డుకు మొదటి సంవత్సరంలో ఫీజు రూ.350.
  • మనదేశంలో, విదేశాల్లో ఉన్న హోటళ్లు బుక్ చేసుకుంటే 20 శాతం రాయితీ వస్తుంది. దేశంలోని హోటళ్ల బుకింగ్‌పై గరిష్ఠంగా రూ.5వేలు, విదేశాల్లోని హోటళ్ల బుకింగ్‌పై గరిష్ఠంగా రూ.10వేలు రాయితీ ఇస్తారు.
  • దేశీయ, విదేశీ విమానాల బుకింగ్స్‌పై 10 శాతం రాయితీ వస్తుంది. దేశీయ విమానాలపై గరిష్ఠంగా రూ.1,000, విదేశీ విమానాలపై గరిష్ఠంగా రూ.5,000 రాయితీ ఇస్తారు.
  • బస్సుల బుకింగ్‌ల విలువ రూ.500కు మించితే రూ.125 రాయితీ లభిస్తుంది.
  • మూడు నెలలకోసారి విమానాశ్రయాలలో 1 కాంప్లిమెంటరీ డొమెస్టిక్ లాంజ్ ఇస్తారు.
  • ఏటా 2సార్లు అంతర్జాతీయ విమానాశ్రయ లాంజ్‌లలోకి అనుమతిస్తారు. ప్రయారిటీ పాస్ లభిస్తుంది.
  • రివార్డుపాయింట్లపై ఎలాంటి పరిమితీ లేదు. ఏటా గరిష్ఠంగా రూ.32వేల దాకా ప్రయోజనాలను అందుకోవచ్చు.
  • డిస్కౌంట్లను పొందేందుకు "EMTSCB" అనే కోడ్‌ను వినియోగించాలి.

4. Yatra SBI Card Benefits

  • 'యాత్రా ఎస్‌బీఐ కార్డ్‌'కు మొదటి సంవత్సరంలో ఫీజు రూ.499.
  • దేశీయ విమాన సర్వీసుల టికెట్లపై రూ.1,000 రాయితీ వస్తుంది. అయితే లావాదేవీ కనీస విలువ రూ.5వేలు ఉండాలి.
  • అంతర్జాతీయ విమాన సర్వీసుల టికెట్లపై రూ.4వేలు రాయితీ లభిస్తుంది. లావాదేవీ కనీస విలువ రూ.40వేలు ఉండాలి.
  • దేశంలో హోటళ్ల బుకింగ్స్‌పై 20 శాతం రాయితీ లభిస్తుంది. కనీస లావాదేవీ విలువ రూ.3వేలు ఉండాలి. గరిష్ఠంగా రూ.2వేల రాయితీ లభిస్తుంది.
  • ఈ కార్డుతో మొదటి సంవత్సరంలో ప్రతినెలా సగటున రూ.8,334 మేర ఖర్చు చేస్తే రెండో ఏడాదిలో వార్షిక ఫీజు మాఫీ అవుతుంది.
  • ఇంధన కొనుగోలుకు రూ.500 నుంచి రూ.3వేలలోపు లావాదేవీని చేస్తే 1 శాతం సర్​ఛార్జీని మాఫీ చేస్తారు. ప్రతి స్టేట్‌మెంట్ సైకిల్ గడువులోగా రూ.1,00 వరకు ఈవిధంగా ప్రయోజనం పొందొచ్చు.
  • ఈ కార్డుతో యాత్రా.కామ్ పోర్టల్‌లో విమాన టికెట్లను బుక్ చేసుకుంటే ఎయిర్ యాక్సిడెంట్ కవరేజీని అందించే బీమా పాలసీ ఇస్తారు. దాని విలువ రూ.50 లక్షలు.

5. IRCTC SBI Platinum Card

  • 'ఐఆర్‌సీటీసీ ఎస్‌బీఐ ప్లాటినమ్' కార్డుకు తొలి సంవత్సరంలో ఫీజు రూ.500.
  • ఐఆర్‌సీటీసీ ద్వారా AC1, AC2, AC3, AC CC ట్రైన్ టికెట్లను బుక్ చేసుకుంటే 10 శాతం వ్యాల్యూ బ్యాక్ రివార్డు పాయింట్లు వస్తాయి. 1 పాయింట్ విలువ 1 రూపాయి.
  • ఐఆర్‌సీటీసీ ద్వారా రైలు టికెట్ల బుకింగ్ ఛార్జీలలో 1 శాతం మాఫీ అవుతాయి.
  • ఇంధనం కొనుగోలుకు రూ.500 నుంచి రూ.3వేలలోపు లావాదేవీ చేస్తే 1 శాతం మాఫీ చేస్తారు. ప్రతీ స్టేట్‌మెంట్ సైకిల్ గడువులోగా గరిష్ఠంగా రూ.100 దాకా ఇలా లబ్ధి పొందొచ్చు.
  • ఈ కార్డు కోసం రూ.500 రెన్యూవల్ ఫీజును చెల్లిస్తే 500 రివార్డు పాయింట్లు ఇస్తారు.

6. Air India SBI Platinum Card

  • 'ఎయిర్ ఇండియా ఎస్‌బీఐ ప్లాటినమ్' కార్డుకు తొలి సంవత్సరంలో ఫీజు రూ.1,499.
  • ఎయిర్ ఇండియా టికెట్ల బుకింగ్ కోసం ఖర్చు చేసే ప్రతీ రూ.100 లావాదేవీపై 15 రివార్డు పాయింట్లు వస్తాయి. అయితే టికెట్లను ఎయిర్ ఇండియా వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారానే బుక్ చేయాలి.
  • దేశంలోని విమానాశ్రయాల్లో ఉండే వీసా లాంజ్‌లలో ఏటా 8 సార్లు ఉచితంగా వసతి పొందే అవకాశం కల్పిస్తారు.
  • ఈ కార్డు ద్వారా ఏటా చేసే ఖర్చుల ఆధారంగా గిఫ్టుగా 2వేల పాయింట్లు, బోనస్‌గా 15వేల పాయింట్లు లభిస్తాయి.
  • దేశంలోని పెట్రోల్ బంక్‌లలో ఇంధనం కోసం చేసే లావాదేవీపై 1 శాతం ఇంధన సర్ ఛార్జీని మాఫీ చేస్తారు.

మీ క్రెడిట్ కార్డు రివార్డు పాయింట్లు త్వరలో ఎక్స్‌పైర్ అవున్నాయా? - ఇలా వాడితే ఫుల్​ బెనిఫిట్స్​!

క్రెడిట్ కార్డుతో కార్​ కొంటున్నారా? ఈ విషయాలు తెలుసుకోవడం మస్ట్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.