Women Loan cheating case in Khammam :మహిళలకు లోన్ ఇప్పిస్తామని చెప్పిన అక్రమార్కులు వారిపేరిట ఓ బ్యాంకు నుంచి లక్షల్లో సొమ్మును అందులో పోగేసిన ఘటన ఖమ్మంలోని ఇల్లందులో చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం ఇల్లందు మండలం ఇందిరానగర్‌కు చెందిన ఓ యువకుడు ఖమ్మంకు చెందిన ఇద్దరు వ్యక్తులు కలిసి గత డిసెంబరులో అయిదుగురు మహిళలను కలిశారు. ప్రతిఒక్కరికి రూ.15వేలరుణం ఇప్పిస్తామని నమ్మబలికారు. సగం డబ్బులు కడితే చాలు సగం వాళ్లే కట్టుకుంటారు, నెలకు వడ్డి కూడా రూ.550 అనే సరికి మహిళలు ఆశపడ్డారు. లోన్ కోసం బ్యాంకులో సమర్పించేందుకు కావాల్సిన పాన్‌కార్డు, ఆధార్, ఫొటోలు కావాలని వారి దగ్గర నుంచి తీసున్నారు. జనవరిలో మహిళల వద్దకు వచ్చి బ్యాంకుకు సంబంధించిన పత్రాలు, చెక్కులపై మహిళలు సంతకాలు తీసుకున్నారు. త్వరలో రుణాలు వస్తాయని చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోయారు.
చోరీలు పాతకథ, ఇప్పుడంతా సైబర్ నేరాలే - గణనీయంగా పెరుగుతున్న కేసులు
కొన్ని రోజుల తర్వాత మీకు లోన్ అప్రూవ్ అయ్యింది రూ.15వేల రుణం వచ్చిందని చెప్పారు. ఖర్చులు పోనూ రూ.14వేలు చొప్పున అకౌంట్లో పడ్డాయని తెలిపారు. ఆ నగదును ఇదివరకే ఉన్న స్థానిక ఖాతాలోకి ఫోన్‌పే ద్వారా డబ్బులు పంపించారు. రుణం తీరే వరకు నెలకు రూ.550 చెల్లించాలని సూచించారు. ఫిబ్రవరి నెల మధ్యలో రుణ చెల్లింపు గడువు రావటంతో డబ్బులు చెల్లించారు.
Man Cheats Women In Name of Loan : మరోవైపు వారి దగ్గర నుంచి తీసుకున్న పత్రాలతో ఖమ్మం నగరంలోని గాంధీనగర్ పరిధిలో ఉన్న బ్యాంకులో అయిదుగురు మహిళల పేరిట అక్రమార్కులు కరెంట్ ఖాతా తెరిచారు. చిరునామాతో సహా అన్ని వివరాలు మహిళలవి రాసి ఫోన్‌నంబర్లు మాత్రం వారివి రాసుకున్నారు. కాగా చిరునామా ఇతర వెరిఫికేషన్ కోసం బ్యాంకు ఉద్యోగులు మహిళలు ఇళ్లకు వెళ్లడంతో అక్రమంగా తెరిచిన బ్యాంకు ఖాతా గురించి బయటపడింది. మహిళలను దీనిపై అడగ్గా ఖమ్మంలో తమకు బ్యాంకు ఖాతా ఉందన్న విషయమే తెలియదని చెప్పారు. దీంతో పూర్తి వివరాలు ఖమ్మం వెళ్లి తెలుసుకోవాలని బ్యాంకు సిబ్బంది సూచించారు. కుటుంబ సభ్యులతో కలిసి మహిళలను ఖమ్మంలోని సదరు బ్యాంకుకు వెళ్లి విచారించగా విస్తూపోయే విషయాలు బయటపడ్డాయి.
లాటరీ పేరుతో సైబర్ నేరగాళ్ల టోకరా - పదిహేను లక్షలకు పైగా పోగొట్టుకున్న ఆటోడ్రైవర్