ETV Bharat / state

21 ఏళ్లుగా ఊపిరితిత్తుల్లో ఇరుక్కుపోయిన పెన్ క్యాప్‌ - విజయవంతంగా తొల‌గించిన కిమ్స్ వైద్యులు - PEN CAP STUCK IN MAN LUNGS

5 ఏళ్ల వయసున్నప్పుడు పెన్​క్యాప్​ మింగేసిన యువకుడు - 21 ఏళ్లపాటు ఊపిరితిత్తుల్లోనే ఉన్న వైనం - యువకుడికి అరుదైన శస్త్ర చికిత్స చేసి విజయవంతగా పెన్​క్యాప్​ బయటకు తీసిన కిమ్స్​ హాస్పిటల్ వైద్యులు

Doctors Remove Plastic Pen Cap Stuck In Man Lungs
Doctors Remove Plastic Pen Cap Stuck In Man Lungs (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 19, 2025, 5:35 PM IST

Doctors Remove Plastic Pen Cap Stuck In Man Lungs : కరీంన‌గ‌ర్ ప్రాంతానికి చెందిన 26 ఏళ్ల యువ‌కుడు త‌న‌కు ఐదేళ్ల వ‌య‌సు ఉన్న‌ప్పుడు ఆడుకుంటూ పెన్ క్యాప్‌ మింగేశాడు. గత నెల రోజుల నుంచి ద‌గ్గు రావ‌డం, బ‌రువు త‌గ్గిపోవ‌డం లాంటి ల‌క్ష‌ణాల‌తో బాధ‌ప‌డుతున్నాడు. ప‌ది రోజులుగా ద‌గ్గు విప‌రీతంగా పెరిగిపోయి, నిద్ర‌పోవ‌డానికి కూడా ఏమాత్రం వీలు కాక‌పోవ‌డంతో వైద్యుల‌కు చూపించ‌గా సీటీ స్కాన్ తీయించారు. అప్పుడు ఎడ‌మ‌వైపు కిందిభాగంలో ఇన్ఫెక్ష‌న్ ఉన్న‌ట్లు తెలిసింది. దాంతో వాళ్లు హైద‌రాబాద్ పంపారు. ఇక్క‌డ కొండాపూర్ కిమ్స్ ఆస్ప‌త్రిలో ఆ యువ‌కుడికి సీటీ స్కాన్ చేశారు. పెన్​క్యాప్​ ఊపిరితిత్తుల్లో ఇరుక్కున్న విష‌యం తెలుసుకుని దానికి చికిత్స చేసిన క‌న్స‌ల్టెంట్ క్లినిక‌ల్, ఇంట‌ర్వెన్ష‌న‌ల్ ప‌ల్మ‌నాల‌జిస్ట్ డాక్ట‌ర్ శుభ‌క‌ర్ నాదెళ్ల ఇందుకు సంబంధించిన వివ‌రాలు తెలిపారు.

యువకుడి ఊపిరితిత్తుల్లో పెన్​క్యాప్​ : తీవ్రమైన దగ్గుతో బాధపడుతున్న యువ‌కుడు తమ హాస్పిటల్​కు వ‌చ్చిన‌ప్పుడు ముందుగా సీటీ స్కాన్ చేశామని డాక్టర్​ శుభకర్​ నాదేళ్ల తెలిపారు. అప్పుడు లోప‌ల ఏదో ఒక గ‌డ్డ‌లా క‌నిపించిందని వివరించారు. ఆ గ‌డ్డ వ‌ల్లే ఊపిరితిత్తుల వ‌ద్ద ఆటంకం ఏర్ప‌డి ద‌గ్గు వ‌స్తోంద‌ని భావించామని అన్నారు. దాన్ని తీసేందుకు ప్ర‌య‌త్నిస్తూ లోప‌ల చూసేస‌రికి పెన్ క్యాప్‌ క‌నిపించిందని, దాంతో ప్రొసీజ‌ర్ మ‌ధ్య‌లోనే ఆ యువ‌కుడి అన్న‌ను లోప‌ల‌కు పిలిచి, గ‌తంలో ఏమైనా మింగాడా అని అడిగామని ఆయన వివరించారు.

3 గంటల పాటు శ్రమించి విజయవంతంగా శస్త్రచికిత్స : 5 ఏళ్ల వ‌య‌సులో ఉండ‌గా పెన్ క్యాప్‌ మింగేశాడ‌ని, అప్ప‌ట్లో తానే వైద్యుడి వ‌ద్ద‌కు తీసుకెళ్తే అక్క‌డ ప‌రీక్షించి లోప‌ల ఏమీ లేద‌ని, బ‌హుశా మ‌లంతో పాటు వెళ్లిపోయి ఉండొచ్చ‌ని అతని సోదరుడు చెప్పాడని డాక్టర్​ శుభకర్​ వివరించారు. దాంతో దాదాపు మూడు గంట‌ల పాటు క‌ష్ట‌ప‌డి, ఫ్లెక్సిబుల్ బ్రాంకోస్కొపీ సాయంతో ముందుగా దాని చుట్టూ పేరుకుపోయిన క‌ణ‌జాలాలు, లింఫ్‌నోడ్, కండ‌ల‌ను కొద్దికొద్దిగా తొల‌గించామని డాక్టర్​ శుభకర్​ నాదెళ్ల తెలిపారు. క్ర‌మంగా అదంతా క్లియ‌ర్ అయిన త‌ర్వాత అప్పుడు ఆ పెన్ క్యాప్‌ను కూడా బ‌య‌ట‌కు తీసేశామని వివరించారు.

"ఇన్నేళ్ల పాటు అలా ఒక ఫారిన్ బాడీ(పెన్​క్యాప్​) లోప‌ల ఉండిపోవ‌డం వ‌ల్ల ఊపిరితిత్తులు కూడా కొంత దెబ్బ‌తిన్నాయి. అయితే, అక్క‌డ దెబ్బ‌తిన్న ఇత‌ర భాగాల‌ను స‌రిచేసేందుకు యాంటీబ‌యాటిక్స్ వాడాం. దాంతో అత‌ను కోలుకున్నాడు. ఇలాంటివి అలా ఎక్కువ కాలం ఉండిపోవ‌డం మంచిది కాదు. ఇత‌ను ఇప్పుడు కూడా రాక‌పోయి ఉండి, అలాగే వ‌దిలేస్తే దాని చుట్టూ క‌ణ‌జాలం పేరుకుపోతుంది. ఊపిరితిత్తి మొత్తం పాడైపోతుంది. అప్పుడు దాన్ని శ‌స్త్రచికిత్స‌తో పాడైన భాగాన్ని కోసేయాల్సి ఉంటుంది. అదృష్ట‌వ‌శాత్తు ముందే గుర్తించ‌డంతో మందుల‌తోనే దాన్ని స‌రిచేయ‌గ‌లిగాం"- - డాక్టర్.శుభకర్​ నాదేళ్ల, ఇంట‌ర్వెన్ష‌న‌ల్ ప‌ల్మ‌నాల‌జిస్ట్

చిన్నపిల్ల‌లు ఆడుకునేట‌ప్పుడు వాళ్లు ఏం చేస్తున్నారో, నోట్లో ఏం పెట్టుకుంటున్నారో గ‌మ‌నించుకోవాలి డాక్టర్​ శుభకర్​ నాదెళ్ల తెలిపారు. అలాంటివి ఏవైనా ఉంటే వెంట‌నే వైద్యుల వ‌ద్ద‌కు తీసుకెళ్లి, దాన్ని తీయించాలన్నారు. లేక‌పోతే ఇలాంటి తీవ్ర‌మైన స‌మ‌స్య‌లు వ‌స్తాయని ఆయన వివరించారు.

బెంగళూరు డాక్టర్లు చేతులెత్తేస్తే - అనంతపురం డాక్టర్లు ప్రాణం నిలిపారు - Rare Surgery to Pancreas

12 ఏళ్ల ఛ‌త్తీస్‌గ‌ఢ్‌ బాలుడికి అరుదైన ఇన్ఫెక్ష‌న్ - విమానంలో తీసుకొచ్చి ప్రాణాలు కాపాడిన కిమ్స్ వైద్యులు - chhattisgarh boy saved kims doctors

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.