తెలంగాణ

telangana

ETV Bharat / state

సినిమాను తలపించేలా హత్య - భర్తను చంపించిన భార్య - Wife Killed Husband In Nalgonda - WIFE KILLED HUSBAND IN NALGONDA

Wife Killed Husband In Nalgonda : వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడనే కారణంతో కట్టుకున్న భర్తనే అంతమొందించింది ఓ మహిళ. లక్షరూపాయల ఒప్పందంతో తన ప్రియుడితో పాటు మరో ముగ్గురు కిరాయి వ్యక్తులతో కలిసి తన భర్తనే చంపించింది ఓ మహిళ. ఓ సినిమా స్టోరీని తలపిస్తున్న ఈ ఘటన నల్గొండ జిల్లాలో జరిగింది. ఈ హత్య మార్చి 17 న జరగ్గా పోలీసులు కేసును చేధించారు. వారి విచారణలో విస్తుపోయే వివరాలు బయటకు వచ్చాయి.

Wife Killed Husband In Nalgonda
Wife Killed Husband In Nalgonda

By ETV Bharat Telangana Team

Published : Mar 24, 2024, 10:55 PM IST

Wife Killed Husband In Nalgonda :తిప్పర్తి మండలంలోని అనిశెట్టి దుప్పలపల్లిలో ఈ నెల 17 న జరిగిన వ్యక్తి హత్య కేసును పోలీసులు ఛేదించారు. పోలీసులు వివరాల ప్రకారం తన భర్త వివాహేతర సంబంధానికి అడ్డు వస్తునాడని ప్రియుడుతో పాటు మరో ముగ్గురు కిరాయి వ్యక్తులతో కలిసి తన భర్తనే హత్య చేయించింది ఓ మహిళ. ఈ ఘటన నల్గొండలో జరిగింది. ఈ మేరకు కేసుకు సంబంధించిన వివరాలను డీఎస్పీ వివరించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం
తన ఇంటి పక్కనే ఉన్న వైన్​షాప్​లో పనిచేసే సతీశ్​తో నవ్య అనే వివాహితకు పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారి అక్రమ సంబంధానికి దారితీసింది. ఈ విషయం ఆమె భర్త వనం ఈశ్వర్​కు తెలియడంతో భార్యను మందలించాడు. దీంతో వారిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే పెద్దమనుష్యుల సమక్షంలో సతీశ్​ను నవ్య భర్త అయిన వనం ఈశ్వర్​ మందలించాడు. అయినా సతీశ్​ ప్రవర్తన మార్చుకోకుండా అమెతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. దీంతో విసుగు చెందిన వనం ఈశ్వర్​ తన భార్య అయిన నవ్యపై చేయిచేసుకున్నారు.

Woman Killed Her Husband :భర్త తనను కొడుతున్నాడని అతడిని ఎలాగైనా వదిలించుకోవాలని చెప్పి ఏదో ఒకటి చేయాలని సతీశ్​కు సూచించింది. ఈ క్రమంలోనే ఏం చేద్దామని నవ్యకు సతీశ్​ అడగ్గా చంపేద్దామని ఇద్దరూ ఏకాభిప్రాయానికి వచ్చారు. చంపాలంటే ఖర్చు అవుతుందని నవ్యతో సతీశ్​ చెప్పగా తన వద్ద ఉన్న పుస్తెలతాడును ఇచ్చింది. ఒక పథకం రచించి దీనిని అమలు చేసేందుకు మిర్యాల గూడకు చెందిన నక్కా వీరాస్వామిని సంప్రదించాడు సతీశ్​. ముగ్గురు మాట్లాడుకుని నవ్య భర్తను చంపేందుకు ప్రణాళిక రచించారు. దనావత్​ హనుమ, దనావత్ సాయిలను సంప్రదించి ఈశ్వర్​ను చంపేందుకు పథకం రచించారు.

నవ్య భర్త ఈశ్వర్​తో వీరాస్వామి పరిచయం పెంచుకున్నాడు. ప్లాన్​లో భాగంగా సూర్యపేటలో కారు తీసుకుని నల్గొండ వెళ్దామని తీసుకువెళ్లారు. అప్పటికే అనుకున్న ప్రకారంతో దనావత్ హనుమ, సాయి అక్కడకు వచ్చి బీరు బాటిల్​ తీసుకుని కారులోనే అక్కడ తాగారు. వెనక కూర్చుని ఉన్న దనావత్ హనుమ, సాయిలు ఇద్దరు కలిసి ఈశ్వర్​ మెడకు తాడుతో మెడకు చుట్టి చంపేశారు. వీరాస్వామి, హనుమ, సాయిలు కలిసి ఆ ప్రదేశానికి దగ్గర్లోనే ఉన్న ఒక బావిలో పడవేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి తమదైన శైలిలో విచారించారు.

"హత్యకు పాల్పడిన ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించాం. నిందితుల నుండి 2 ద్విచక్ర వాహనాలు, ఐదు మొబైల్​లు, రెండు తులాల పుస్తెల తాళి, ఒక కారు , కొంత నగదు స్వాధీనం చేసుకున్నాం" - శివరాం రెడ్డి, డీఎస్పీ, నల్గొండ

సినిమాను తలపించేలా హత్య- భర్తను చంపించిన భార్య

ఇబ్రహీంపట్నంలో పరువు హత్య - ప్రేమ వ్యవహారం నచ్చక కుమార్తెను కొట్టి చంపిన తల్లి

Wife Killed Husband Using Snake : వివాహేతర సంబంధం పెట్టుకున్న భర్త.. ఊపిరాడకుండ చేసి.. ఆపై పాముకాటుతో హత్య చేయించిన భార్య

సెల్​ఫోన్​ కోసం నానమ్మను హత్య చేసిన మనవడు - మృతదేహాన్ని ఇంట్లోనే పూడ్చేశాడు

ABOUT THE AUTHOR

...view details