ETV Bharat / offbeat

మీరు కొనబోయే ఆస్తి జాతకం మొత్తం చెప్పేస్తారు! - ఈ సంస్థల గురించి తెలుసా? - REAL ESTATE SERVICE COMPANIES

- స్థలం పత్రాల నుంచి తాగునీళ్ల దాకా అన్నీ చెక్ చేస్తారు! - గత 30 ఏళ్ల వివరాలన్నీ మీ ముందు పెడతారు!

Precautions in Property Purchase
Precautions in Property Purchase (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 13, 2025, 4:42 PM IST

Precautions in Property Purchase : భారీగా పెరిగిపోయిన ధరల నేపథ్యంలో హైదరాబాద్ లాంటి నగరాల్లో ఇల్లు, భూమి కొనడం ఒకెత్తైతే, అవి లిటిగేషన్లో ఉన్నాయా? క్లీన్​ హిస్టరీ ఉందా? అనేది తెలుసుకోవడం మరో ఎత్తు. ఒకే ఆస్తిని ఇద్దరు ముగ్గురికి అమ్మడం మొదలు, ప్రభుత్వ అనుమతులు లేకుండానే నిర్మించడం వరకు ఎన్నో లిటిగేషన్లు ఉండే ప్రమాదం ఉంటుంది. ఇవన్నీ తెలుసుకోవడం సామాన్యులకు సాధ్యం కాదు. ఇలాంటి వారు మధ్య వర్తుల మాటలు విని మోసపోతున్న సందర్భాలు ఎన్నో కనిపిస్తూనే ఉంటాయి. అందుకే, కొత్తగా ఇల్లు, స్థలం కొనాలకునేవారు భయపడుతూ ఉంటారు.

ఒక ఇల్లు కొనుగోలు చేయాలంటే ఎన్నో విషయాలు చూడాల్సి ఉంటుంది. ఇంటి స్థలం పత్రాలన్నీ సరిగానే ఉన్నాయా? ప్రభుత్వ అనుమతులు ఉన్నాయా? బిల్డర్​ క్వాలిటీ మెయింటెయిన్ చేశాడా? ఇలా ఎన్నో సందేహాలు వెంటాడుతూ ఉంటాయి. సదరు ఆస్తిమీద ఎలాంటి లిటిగేషన్లూ లేవని తెలియాలంటే లాయర్ల వద్దకు వెళ్లాలి. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాలి. ఇందుకోసం ఎంతో సమయం వెచ్చించాల్సి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో మీకు మేము సహాయం చేస్తాం అంటున్నాయి పలు సంస్థలు! అవును, ప్రతి విషయాన్నీ క్షుణ్ణంగా పరిశీలించి, ఆ స్థలం, ఇల్లు జాతకం మొత్తం మీ ముందు ఉంచుతాయి. ఇంటి క్వాలిటీ మొదలు రిజిస్ట్రేషన్‌ వరకూ అన్నీ దగ్గరుండా తామే చేసి పెడతమాని అంటున్నాయి.

మ్యాజిక్‌బ్రిక్స్, నోబ్రోకర్, సెక్యూర్‌ప్రాప్‌ వంటి ఎన్నో సంస్థలు ఈ వెరిఫికేషన్‌ సేవల్ని అందిస్తున్నాయి. ఢిల్లీ, బెంగళూరు, పుణెతోపాటూ హైదరాబాద్‌లోనూ ఈ సర్వీసులు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి.

పని విధానం ఇలా ఉంటుంది :

ఈ సంస్థలను సంప్రదించి, మీరు కొనుగోలు చేయాలని భావిస్తున్న ఇల్లు, స్థలం పత్రాలు అందిస్తే చాలు. మిగిలిన పని మొత్తం వాళ్లు చూసుకుంటారు. ముందుగా ఒక లాయర్, లీగల్‌ రిలేషన్‌షిప్‌ మేనేజర్, ఫీల్డ్‌ ఆఫీసర్​ను మీ పనికోసం కేటాయిస్తారు. వారు వివరాలన్నీ సేకరించి ఆ స్థలం ఎవరి పేరున ఉంది? సర్కారు అనుమతులన్నీ ఉన్నాయా? ఆ ల్యాండ్‌ ఏ పరిధిలోకి వస్తుంది? గడిచిన 30 ఏళ్లలో ఎన్ని సార్లు అమ్మకాలూ, కొనుగోళ్లూ జరిగాయి? వాటి తాలూకు లింక్‌ డాక్యుమెంట్లు ఇలా సమస్త సమాచారం మీ ముందు పెడతారు.

ఇంతేకాదు ఆస్తి మీద లోన్లు ఏమైనా ఉన్నాయా? ప్రాపర్టీ ట్యాక్స్ ఎంత చెల్లిస్తున్నారు? ఆ స్థలానికి దగ్గరగా ప్రభుత్వ, ప్రైవేట్‌ ప్రాజెక్టులు ఏమైనా ఉన్నాయా? చివరకు కరెంట్‌ బిల్స్‌ కూడా సరిగా చెల్లిస్తున్నారా? లేదా? అంటూ పూర్తి వివరాలు చెక్‌ చేస్తారు. ఆ తర్వాత రిజిస్ట్రేషన్‌ పనులు కూడా వాళ్లే చూస్తారు. చివరగా మీరు వెళ్లి మీ పేరున రిజిస్ట్రేషన్ చేయించుకుంటే సరిపోతుంది.

మంచి అవకాశమే :

ఇల్లు, ఆస్తి కొనుగోలు చేయడానికి ఎన్నో కష్టాలు పడి డబ్బు పోగు చేసుకుంటారు జనం. తీరా కొనుగోలు చేసిన తర్వాత అందులోని లుకలుకలు బయటపడితే ఆ వేదన వర్ణనాతీతం. అందుకే ముందుగానే ఆయా ఆస్తుల జాతకాలు తెలుసుకోవాలంటే ఇలాంటి సంస్థలను సంప్రదించడం మంచిదేనని అంటున్నారు రియల్​ ఎస్టేట్ నిపుణులు. మరి, మీరు కూడా ఏవైనా ఆస్తులు కొనుగోలు చేయడానికి ప్లాన్ చేస్తుంటే, ఏవైనా సందేహాలు ఉంటే ఈ దిశగా ఓ సారి ఆలోచించండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.