wives who killed their husbands In Suryapet : వావివరుసలు మరచి, కన్న కుమార్తెనే లైంగికంగా వేధిస్తున్న కామాంధుడిని ఇద్దరు భార్యలు ఒక్కటై కడతేర్చారు. కుమార్తె పట్ల వక్రబుద్ది చేష్టలతో ఆవేదనతో ఆత్మహత్యకు సిద్ధపడి, చివరి క్షణంలో అతడినే అంతమొందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
స్థానికుల వివరాల ప్రకారం : సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలంలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు భార్యలు భర్తను రోకలి బండతో కొట్టి చంపారు. మండలంలోని ఓ తండాకు చెందిన వ్యక్తి (43) డ్రైవర్గా పని చేస్తున్నాడు. ఆయన ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరిని (అక్క, చెల్లి) ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్నాడు. వారికి ఇద్దరు కూమార్తెలు, ఓ కుమారుడు సంతానం. కొన్ని రోజుల నుంచి పరాయి స్త్రీల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు సమాచారం.
కుమార్తెతో అసభ్యంగా : దీనితో ఆగకుండా సొంత కుమార్తెపైనే కన్నేసిన ఆ వ్యక్తి, తనను లైంగికంగా వేధించాడు. తప్ప తాగి భార్యల పట్ల పిల్లల ముందే అసభ్యంగా వ్యవహరించే వాడని తెలిపారు. భర్త వేధిస్తున్నా భరించిన భార్యలు, కన్న కుమార్తె పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో తట్టుకోలేకపోయారు. భర్తపై కోపంతో బిడ్డతో కలిసి ఇద్దరు భార్యలు ఆత్మహత్య చేసుకోవాలని మొదట నిర్ణయించుకున్నారు. తాము చనిపోతే మిగిలిన పదేళ్ల కుమారుడు ఒంటరి వాడవుతాడని ఆలోచించి భర్తనే రోకలి బండతో కొట్టి హత్య చేశారు. అక్కడే ఉన్న స్థానికులు చూసి డయల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అడిగితే రూ.300 ఇవ్వలేదని - ముగ్గురు కలిసి ఫ్రెండ్ను చంపేశారు
20 ఏళ్ల క్రితం ప్రేమ పెళ్లి - నచ్చక 2 నెలల క్రితం కోడలి హత్య