Weather Latest Update :దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు తిరోగమిస్తున్నాయని ఏపీకి చెందిన అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, అసోం, మేఘాలయ, అరుణాచల్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, మహారాష్ట్ర సహా ఉత్తర బంగాళాఖాతం నుంచి రుతుపవనాలు క్రమంగా వైదొలగుతున్నాయని వెల్లడించింది. మరో రెండు రోజుల్లో నైరుతి రుతుపవనాలు బలహీనపడే పరిస్థితులు మారుతున్నాయని పేర్కొంది. అదే సమయంలో సౌత్ ఇండియా ద్వీపకల్పం మీదుగా తూర్పు, ఈశాన్య గాలులు ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయని, వీటి ప్రభావంతో దక్షిణాది రాష్ట్రాలతో పాటు మధ్య బంగాళాఖాతంలో భారీ వర్షపాతం నమోదు అయ్యే అవకాశం ఉందని పేర్కొంది.
బంగాళాఖాతంలో అల్పపీడనం - 24 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం - WEATHER LATEST UPDATE
ఏపీకి భారీ వర్ష సూచన - ఈ నెల 14 నాటికి అల్పపీడనంగా మారే అవకాశం
Published : Oct 13, 2024, 6:53 PM IST
నైరుతి బంగాళాఖాతంలో శనివారం ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, ఈ నెల 14 నాటికి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. మరో 48 గంటల్లో ఇది మరింతగా బలపడే సూచనలు ఉన్నాయని తెలిపింది. ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ ఏపీ సముద్ర తీరాల వైపు కదిలే అవకాశం ఉందని, వీటి ప్రభావంతో రాగల 24 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. పలు చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది.