Panjagutta Car Incident : హైదరాబాద్‌లోని పంజాగుట్ట నాగార్జున సర్కిల్లో నాలుగు రోజుల క్రితం ఓ కారు డ్రైవర్ చేసిన బీభత్సం తాజాగా వెలుగులోకి వచ్చింది. నాగార్జున సర్కిల్ వద్ద వాహనాల బ్లాక్ ఫిల్మ్ చెకింగ్ జరుగుతోంది. ఇందులో భాగంగా హోంగార్డు రమేశ్ ఓ కారును ఆపేందుకు ప్రయత్నించాడు. అయితే డ్రైవర్ సయ్యద్ నజీర్ కారు ఆపకుండా ముందుకెళ్లబోయాడు. దీంతో రమేశ్ కారుకు అడ్డుగా వచ్చి ఆపబోయాడు. డ్రైవర్ మరింత వేగంగా కారును పోనిచ్చి రమేశ్‌పైకి దూసుకెళ్లాడు. హోంగార్డును కారుతో కొంత దూరం ఈడ్చుకెళ్లాడు. ఈ ప్రమాదంలో రమేష్‌కు తృటిలో ప్రమాదం తప్పింది.
Viral Video : కారు ఆపమన్నందుకు ఏకంగా హోంగార్డ్ పైకి ఎక్కించాడు! - CAR DRVER DRAGGED THE POLICE MAN
పంజాగుట్ట పరిధిలో కారు బీభత్సం - తనిఖీల సమయంలో కారు ఆపకుండా దూసుకెళ్లిన డ్రైవర్ - అడ్డుకోబోయిన హోంగార్డ్ పైకి ఎక్కించిన డ్రైవర్
Published : Nov 8, 2024, 3:19 PM IST
పోలీసులు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని ట్రాఫిక్ ఎస్‌ఐ ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. పోలీసులపై రోజురోజుకు ఇలాంటి వికృత చర్యలు జరుగుతూనే ఉన్నాయి. ప్రజలకు రక్షణ కల్పించే పోలీసులపైనే ఇలా చేయడం సరైనది కాదని నెటిజన్లు సోషల్ మీడియాలో వారి అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. వాహనాల తనిఖీలకు సహకరించాలని పలువురు కోరుతున్నారు. హోంగార్డుని చూసి కూడా అతనిపైకి దూసుకెళ్లడం దారుణమని, కనీసం వారి పట్ల మానవత్వం చూపించరా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.