Vipassana Dhyanam :విపశ్యన అనేది భారతదేశపు అతి పురాతన ధ్యాన పద్ధతి. దేశంలో కనుమరుగైన ఆ పద్ధతిని 2 వేల 600 ఏళ్ల క్రితం గౌతమ బుద్ధుడు వెలికితీసినట్లు ప్రాచుర్యంలో ఉంది. విపశ్యన అంటే ఉన్నది ఉన్నట్లుగా చూడగలగటం. సంగారెడ్డి జిల్లా కొండాపూర్‌లో 2005లో "దమ్మ కొండన్న విపశ్యన అంతర్జాతీయ ధ్యాన కేంద్రం" ఏర్పాటైంది. 2007నుంచి కోర్సులు ప్రారంభం కాగా ఇక్కడ శిక్షణ పొందే వారిని సాధకులుగా పిలుస్తున్నారు. అధికారిక వెబ్‌సైట్ ద్వారా నమోదు చేసుకున్న వారినే శిక్షణకు అనుమతిస్తారు. ప్రస్తుతం కోర్సు 10 రోజుల పాటు సాగుతుండగా ప్రవేశం పొందిన వారికి ఉచిత భోజనం, వసతి కల్పిస్తున్నారు.
ఇమ్యూనిటీని పెంచుకోవాలా? ఈ 5 యోగాసనాలు చేయండి
Vipassana International Meditation Centre: అక్కడ ఉన్నన్ని రోజులు కనీసం ఒకరినొకరు చూసుకోకుండా నియమ, నిబంధనలతో విపశ్యన ధ్యానం సాగుతోంది. అక్కడ నేర్చుకొని వెళ్లిన సాధకులిచ్చే విరాళాలతోనే ధ్యాన కేంద్రం నడుస్తోంది. శిక్షణా కాలంలో కల్పించిన సౌకర్యాలకు ప్రతిగా తమ వంతు సాయం చేస్తున్నట్లు సాధకులు చెబుతున్నారు. ప్రస్తుతం ఏర్పాటైన ధ్యాన కేంద్ర స్థలం పూర్వ సాధకులిచ్చిందే. అక్కడ పండిస్తున్న పండ్లు, పూలు,కూరగాయలనే భోజనాలకు వినియోగిస్తున్నారు. విపశ్యన ధ్యానంతోనే ఎన్నో ప్రయోజనాలున్నాయని నిర్వాహకులు చెబుతున్నారు.
"పది రోజుల శిబిరం వల్ల లాభం ఏంటంటే సైంటిఫిక్గా మనుషులకు ఇతరుల పట్ల ఉన్న రాగ ద్వేషాలు వేర్ల నుంచి తొలగించవచ్చు. దీన్ని సైంటిఫిక్ ఎందుకంటాం అంటే ఒకరు చెప్తే మనం నమ్మడం కాదు. మన అనుభూతి ద్వారా మనం తెలుసుకుంటాం. అలా మనల్ని మనం మంచి మార్గంలో వెళ్లేలా తీర్చిదిద్దుకుంటాం."- హరీశ్ నాథ్, ధ్యాన కేంద్ర ఇంఛార్జీ