తెలంగాణ

telangana

ETV Bharat / state

బైక్​పై లిఫ్ట్‌ ఇస్తే.. నకిలీ పోలీసుతో గంజాయి కేసులో ఇరికిస్తామని బెదిరింపు - FAKE POLICE THREATEN TO GANJA CASE

బైక్‌పై లిఫ్ట్‌ అడిగి గంజాయి కేసులో ఇరికిస్తామని నకిలీ పోలీసుతో బెదిరింపు - బాధితుడు నుంచి రూ.26 వేలు దోచుకుని జారుకున్న ఇద్దరు నిందితులు - మోసపోయాయని గ్రహించి పీఎస్​లో ఫిర్యాదు చేసిన బాధితుడు

FAKE POLICE CHEATED MAN IN HYD
Threatened to be Booked in Ganja Case for Giving a Lift on a Bike (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Dec 13, 2024, 2:52 PM IST

Updated : Dec 13, 2024, 3:59 PM IST

Threatened to be Booked in Ganja Case for Giving a Lift on a Bike :బైక్‌పై లిఫ్ట్‌ ఇచ్చినందుకు గంజాయి కేసులో ఇరికిస్తామని బెదిరించి దొరికిన కాడికి దోచుకున్న ఘటన కీసర పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాలు ప్రకారం ఉప్పల్‌కు చెందిన భరత్‌ ప్రైవేటు ఉద్యోగి. బుధవారం రాత్రి తన బైక్‌పై నాగారం నుంచి ఉప్పల్‌కు వెళ్తున్నాడు. ఆ సమయంలో విజయ సేల్స్‌ సమీపంలో ఓ వ్యక్తి రాంపల్లి వరకు లిఫ్ట్ ఇవ్వమని అడిగాడు. సరే అనుకుని భరత్‌ అతన్ని ఎక్కించుకొని వస్తుండగా రాంపల్లి చౌరస్తాలో మరో వ్యక్తి వీరి బైక్‌ను ఆపాడు.

తాను పోలీస్‌నని చెప్పి, బండి దిగండి.. ఎక్కడికి వెళ్తున్నారంటూ ఇద్దరినీ తనిఖీ చేశాడు. లిఫ్ట్‌ అడిగి ఎక్కిన వ్యక్తి తన వద్ద ఉన్న కవర్‌ ఇచ్చి, ఇద్దరం కలిసి గంజాయి సరఫరా చేస్తామని నకిలీ పోలీస్‌కు చెప్పాడు. దీంతో ఒక్కసారిగా భరత్‌ నిర్ఘాంతపోయి తనకు ఏ సంబంధం లేదని ఎంత చెప్పినా నమ్మలేదు. ఈ నేపథ్యంలో గంజాయి కేసులో ఇరికిస్తానని భరత్‌ను సదరు నకిలీ పోలీస్‌ బెదిరించి, కొట్టి అతని దగ్గరి నుంచి రూ.26 వేలు లాక్కున్నారు. అతని బైక్‌పైనే చిర్యాల బస్టాప్​ వద్ద నిందితులిద్దరూ దిగి వెళ్లిపోయారు. కొద్దిసేపటి తర్వాత మోసపోయాయని గ్రహించిన భరత్‌, గురువారం కీసర పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసిన కీసర సీఐ వెంకటయ్య దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.

Last Updated : Dec 13, 2024, 3:59 PM IST

ABOUT THE AUTHOR

...view details