తెలంగాణ

telangana

ETV Bharat / state

శ్రీవారి భక్తులకు గుడ్​ న్యూస్​ - వైకుంఠ ద్వార దర్శన తేదీలు వచ్చేశాయ్​

తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త - జనవరి నెల 10 నుంచి 19 వరకు వైకుంఠ ద్వార దర్శనం - వివిధ రకాల ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నట్లు వెల్లడించిన టీటీడీ పాలకమండలి నిర్ణయం

TIRUMALA TIRUPATHI DEVASTANAM
తిరుమల తిరుపతి దేవస్థానం (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : 4 hours ago

Srivari Vaikunta Dwara Darshanam 2025 : వచ్చే ఏడాది(2025) వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానంలో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. 2025లో జనవరి 10 నుంచి 19వ తేదీ వరకు దాదాపు పది రోజులపాటు స్వామి వారి వైకుంఠ ద్వార దర్శనానికి అవకాశం కల్పిస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. ఈ సమయంలో వీఐపీ ప్రొటోకాల్‌ దర్శనాలు మినహా చంటిపిల్లలు, వృద్ధులు, దివ్యాంగులు, ఆర్మీ, ఎన్‌ఆర్‌ఐల దర్శనాలు, ఇతర ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. స్థానిక అన్నమయ్య భవనంలో టీటీడీ వివిధ శాఖల ఉన్నతాధికారులతో సోమవారం సమావేశమైన అదనపు ఈవో వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు.

ఉదయాస్తమానంలో సేవకు భక్తుల మార్పు లేదు :శ్రీవారి ఉదయాస్తమాన సేవా టికెట్‌ పొందినవారికి ప్రతి సేవకు భక్తులను మార్పు చేసుకునే అవకాశం లేదని టీటీడీ ధర్మకర్తల మండలి స్పష్టం చేసింది. గతంలో వైఎస్సార్​సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మాజీ టీటీడీ ఛైర్మన్‌ భూమన కరుణాకరరెడ్డి నేతృత్వంలోని పాలకమండలి భక్తుల మార్పునకు అవకాశమిస్తూ నిర్ణయం తీసుకుంది. కానీ అప్పట్లో వచ్చిన వ్యతిరేకత వల్ల దీని అమలు సాధ్యం కాలేదు.

టికెట్​ రూ. కోటి : సాధారణ రోజుల్లో రూ.కోటి, శుక్రవారం అయితే రూ.కోటిన్నర విలువైన ఈ టికెట్‌ను పొందిన భక్తుడు తన సంబంధీకులు ఐదుగురితో కలిసి శ్రీవారి సేవలను రోజంతా ప్రత్యక్షంగా సమీపం నుంచే వీక్షించి పాల్గొనే భాగ్యం కలుగుతుంది. ముందుగా పేర్లు నమోదు చేసుకుంటేనే ఈ సేవకు అనుమతించేవారు. తర్వాత పలువురి అభ్యర్థనల మేరకు ముందుగా అనుకున్నవారు కాకుండా వారి స్థానంలో ఇతరులూ పాల్గొనే అవకాశం కల్పించారు.

అయితే వారి పేర్లనూ రెండు నెలల ముందే తెలపాల్సి ఉంటుందని 2013లో సమావేశమైన పాలకమండలి తీర్మానించింది. దీన్ని అనుకూలంగా మార్చుకునేందుకు గత ఛైర్మన్​ భూమన కరుణాకర రెడ్డి నేతృత్వంలోని పాలకమండలి ప్రయత్నించింది. ఉదయాస్తమాన సేవలో పాల్గొనే దాత తనతో వచ్చే ఐదుగురి పేర్లను ప్రతి సేవకు మార్చుకునేలా 2024 జనవరిలో తీర్మానించింది. ఇది సేవాటికెట్ల బ్లాక్‌ మార్కెట్‌కు అవకాశమిస్తుందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. విమర్శలతో పాటు పాలనాపరమైన కొన్ని కారణాలతో తీర్మానాన్ని అమలు చేయలేదు. ఇప్పుడు ఈ తీర్మానాన్ని ధర్మకర్తల మండలి పక్కన పెట్టింది.

రూ.300 దర్శనం టికెట్లకు రూ.1500 నుంచి రూ.2000 వసూలు - అందుకే రద్దు నిర్ణయం

శ్రీవారి భక్తులకు గుడ్‌ న్యూస్‌ - ఇకనుంచి 2 గంటల్లోనే సర్వదర్శనం!

ABOUT THE AUTHOR

...view details