ETV Bharat / state

'అధికారికమైనా, అనధికారికమైనా గతంలో నిర్మించిన ఇళ్ల జోలికి హైడ్రా వెళ్లదు - ఆ భవనాలను మాత్రం వదలం' - HYDRA COMMISSIONER PRESS MEET

8 చెరువులు, 12 పార్కులను కాపాడిన హైడ్రా - 200 ఎకరాలను కాపాడిన హైడ్రా - హైడ్రా కూల్చివేతల వల్ల ప్రజల్లో అవగాహన - హైదరాబాద్​లో మీడియా సమావేశంలో హైడ్రా కమిషనర్​ వెల్లడి

HYDRA Commissioner Press Meet
HYDRA Commissioner Press Meet (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : 15 hours ago

Updated : 11 hours ago

HYDRA Commissioner Press Meet : అనధికారిక నిర్మాణాల విషయంలో సానుభూతి చూపించాల్సిన అవసరం లేదన్న సుప్రీంకోర్టు తీర్పునకు లోబడే హైదరాబాద్ లో హైడ్రా పనిచేస్తుందని కమిషనర్ రంగనాథ్ తెలిపారు. హైడ్రాపై తప్పుడు ప్రచారం చేస్తున్న భూకబ్జాదారులకు కూడా హైడ్రా అంటే ఏంటో త్వరలోనే అర్థమవుతుందన్నారు. హైడ్రా ఏర్పడిన 6 నెలల్లోనే 200 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జాదారుల నుంచి కాపాడినట్లు రంగనాథ్ వెల్లడించారు.

హైదరాబాద్ మహానగరంలో ప్రభుత్వ స్థలాలు, చెరువుల పరిరక్షణ, విపత్తు నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా వచ్చే ఏడాది మరింత దూకుడుగా వ్యవహరించబోతుందని ఆ ఏజెన్సీ కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. హైడ్రా ఏర్పడి 6 నెలలు పూర్తైన సందర్భంగా 2024లో చేసిన పనులను ఆయన వెల్లడించారు. హైడ్రా లక్ష్యం నెరవేరిందన్నారు. భూముల కబ్జాలను అడ్డుకోవడంతోపాటు లేక్ వ్యూ పేరుతో ఇళ్లను నిర్మించుకునే వారికి ఎఫ్​టీఎల్, బఫర్ జోన్​ల విషయంపై అవగాహన పెరిగిందన్నారు. అలాగే స్థిరాస్తి రంగం కూడా క్రమపద్దతిలో వెళ్లేందుకు హైడ్రా దోహదపడుతుందన్నారు. గడిచిన 6 నెలల్లో నగరంలో 27 ప్రాంతాల్లో 314 అనధికారిక నిర్మాణాలను కూల్చివేసి 200 ఎకరాల ప్రభుత్వ భూములను రక్షించినట్లు రంగనాథ్ వివరించారు.

అంతకు ముందు నిర్మించిన వాటి జోలికి వెళ్లం : అందులో 12 చెరువులు, 8 పార్కులను అన్యక్రాంతం కాకుండా కాపాడినట్లు హైడ్రా కమిషనర్​ పేర్కొన్నారు. వచ్చే ఏడాది హైడ్రా పక్కాగా రూట్ మ్యాప్ సిద్ధం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. 1095 చెరువుల్లో శాటిలైట్ ఇమేజ్, ఏరియల్ డ్రోన్స్​తో తీసిన ఫొటోల ఆధారంగా ఎఫ్​టీఎల్ మార్కింగ్ చేస్తున్నట్లు వెల్లడించారు. 2024 జులై 19 తర్వాత కట్టే అనధికారిక, అక్రమ నిర్మాణాలను ఉపేక్షించేది లేదని పునరుద్ఘాటించారు. అంతకుముందు నిర్మించిన వాటి జోలికి వెళ్లమని హైడ్రా కమిషనర్​ మరోసారి స్పష్టం చేశారు.

హైడ్రా సామాన్యులను ఇబ్బందిపెట్టే వ్యవస్థ కాదని రంగనాథ్​ అన్నారు. ఉన్నత న్యాయస్థానాలు కూడా అనధికారిక నిర్మాణాల పట్ల కఠినంగానే వ్యవహారించాలని ఆదేశిస్తున్నాయన్నారు. ఆ దిశగానే హైడ్రా పనిచేస్తుందని వివరించారు. హైడ్రాపై కొందరు భూకబ్జాదారులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, చెరువుల భూములను కబ్జా చేసి వ్యవస్థను మ్యానేజ్ చేయాలనుకునే వారిని హైడ్రా ఖచ్చితంగా అడ్డుకుంటుందని హెచ్చరించారు. చెరువుల సమీపంలో భూములు కొనుగోలు చేసే వారు, ఇళ్లను నిర్మించుకునేవారు ఒకటికి రెండు సార్లు తనిఖీలు చేసుకోవాలని సూచించారు.

"మున్సిపాలిటీలలో అనధికార నిర్మాణాలపై ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయి. ప్రభుత్వ భూములకు జియో ఫెన్సింగ్‌ చేసేందుకు చర్యలు చేపట్టాము. హైడ్రా మీద దుష్ప్రచారం జరుగుతోంది. హైడ్రా అంటే.. కేవలం కూల్చేందుకే.. అన్నట్లు దుష్ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వ భూములు, చెరువులు, పార్కులు కాపాడటమే హైడ్రా ప్రధాన కర్తవ్యం. హైడ్రాకు డాఫ్లర్‌ రాడార్‌ను సమకూర్చాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాం. డాఫ్లర్‌ రాడార్‌ ఉంటే కచ్చితమైన వాతావరణ అంచనాలు సేకరిస్తాం." - రంగనాథ్​, హైడ్రా కమిషనర్​

హైడ్రా పనితీరు అర్థం చేసుకోవాలి : హైడ్రాకు ఇప్పటి వరకు 5800 ఫిర్యాదులు అందాయని, ఫిర్యాదుల సంఖ్యను బట్టి హైడ్రా పనితీరును అర్థం చేసుకోవాలని కోరారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులకు హైడ్రా ప్రాధాన్యత ఇస్తుందన్నారు. గ్రేటర్ తోపాటు అనధికారిక నిర్మాణాలకు సంబంధించి సమీపంలోని 27 పురపాలక సంఘాల నుంచి కూడా ఫిర్యాదులు అందుతున్నాయని, ఇటీవల జీహెచ్ఎంసీ చట్టం ప్రకారం సంక్రమించిన అధికారాలను ఉపయోగించి వాటిని పరిష్కరిస్తామని రంగనాథ్ తెలిపారు.

హైడ్రా కోసం త్వరలో డాప్లర్​ వెదర్​ రాడర్​ : 12 చెరువుల పునరుద్దరణకు సంబంధించి డీపీఆర్​లు తయారు చేసి ప్రభుత్వానికి పంపించామని, త్వరలోనే వాటికి అనుమతి వస్తుందన్నారు. అలాగే విపత్తుల నిర్వహణకు సంబంధించి హైడ్రా వద్ద 30 బృందాలు ఉన్నాయని, త్వరలోనే 72 డీఆర్ఎఫ్ బృందాలు అందుబాటులోకి వస్తాయన్నారు. నాగోల్ ఉన్న డీఆర్ఎఫ్ కేంద్రాన్ని కూడా బలోపేతం చేస్తున్నట్లు రంగనాథ్ వివరించారు. నగరంలోని వాతావరణ పరిస్థితులు ఎప్పటికప్పుడు అంచనా వేయడానికి కొత్తగా హైడ్రా కోసం డాప్లర్ వేదర్ రాడర్ రాబోతుందన్నారు. ప్రజలను విపత్తుల నుంచి అప్రమత్తం చేసేందుకు ఒక ఎఫ్​ఎం ఛానల్ ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు రంగనాథ్ వివరించారు.

అక్రమ నిర్మాణాలను కూల్చుతూనే ఉంటాం : రంగనాథ్

"ఆ ఇళ్లను కూల్చం - వీటిని వదలం" : హైడ్రా కమిషనర్ కీలక వ్యాఖ్యలు

Last Updated : 11 hours ago
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.