ETV Bharat / health

ఒంటరిగా కూర్చోవడం, అతి ఆలోచన, అనవసర భయాలు - ఇలా చేస్తే అన్నీ పటాపంచలే! - HOW TO PREVENT WORRY BURNOUT

- పదే పదే ఆలోచిస్తూ "వర్రీ బర్నౌట్​"కు గురవుతున్న జనం - పురుషల కంటే.. మహిళల్లోనే ఈ సమస్య ఎక్కువంటున్న నిపుణులు -ఈ జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు

How to Prevent Worry Burnout
How to Prevent Worry Burnout (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : 15 hours ago

How to Prevent Worry Burnout: విషయం ఏదైనా సరే కొంతమంది లోతుగా ఆలోచిస్తుంటారు. దీంతో పదే పదే అవే ఆలోచనల్లో మునిగిపోయి బాధపడుతుంటారు. ఒకానొక దశలో ఈ ఆలోచనలు మనల్ని ఒత్తిడి, ఆందోళనల్లోకి నెట్టేస్తాయి. ఈ సమస్యనే "వర్రీ బర్నౌట్‌"గా పిలుస్తున్నారు నిపుణులు. ఈ మానసిక సమస్య బారిన పడుతోన్న వారిలో పురుషుల కంటే మహిళలే ఎక్కువని పలు అధ్యయనాలు చెబుతున్నట్లు వివరిస్తున్నారు. ముఖ్యంగా మహిళల్లో ఎదురయ్యే ఆరోగ్య​ సమస్యలు, వర్క్‌అండ్​ లైఫ్‌ బ్యాలన్స్‌ చేసుకోలేకపోవడం, సామాజిక ఒత్తిళ్లు, హింస, వివక్ష, పని ప్రదేశాల్లో ఎదురయ్యే సమస్యలు.. వంటివి ఇందుకు ప్రధాన కారణాలవుతున్నట్లు పేర్కొంటున్నారు. మరి, దీనివల్ల భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు వస్తాయి? అవి రాకుండా మన ఎమోషన్స్​ను ఎలా కంట్రోల్​ చేసుకోవాలి? అనే దానిపై నిపుణులు ఏమంటున్నారో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

ఇవీ కారణాలే: కొంతమంది మహిళలు అవసరం ఉన్నా, లేకున్నా పదే పదే ఆలోచిస్తూ బాధపడుతుంటారు. నెగెటివ్​ ఆలోచనలు చేస్తుంటారు. ఈ పరిస్థితి కొన్నాళ్లకు కట్టలు తెంచుకొని.. మన భావోద్వేగాలు అదుపు తప్పేలా చేస్తుంది. వర్రీ బర్నౌట్​గా పిలిచే ఈ పరిస్థితికి.. మనలోని అనవసర భయాలు, చుట్టూ ఉన్న ప్రతికూల పరిస్థితులు, హార్మోన్లలో మార్పులు, శారీరక అలసట.. వంటివీ కారణాలే అంటున్నారు నిపుణులు.

వర్రీ బర్నౌట్​ లక్షణాలు: మానసిక సమస్యలు ఏవైనా తీవ్ర రూపం దాల్చే దాకా బయటపడవు. వర్రీ బర్నౌట్‌ కూడా ఇదే కోవకు చెందిందంటున్నారు నిపుణులు. అయితే శారీరక, మానసిక ప్రవర్తన ద్వారా ఈ సమస్యకు సంబంధించిన ప్రాథమిక లక్షణాల్ని గుర్తించచ్చని చెబుతున్నారు. అవేంటంటే..

  • చిన్న విషయాలకే ఒత్తిడికి గురవడంతో పాటు ఒక రకమైన ఆతృత మనలో కనిపిస్తుందని అంటున్నారు.
  • అది సామాజిక అంశమైనా.. తమకు ఒక్కరికే సమస్య వచ్చినట్లుగా అధైర్య పడుతుంటారని.. ఒంటరిగా ఫీలవుతుంటారని.. ఈ క్రమంలో నలుగురితో కలవడానికి, ఆయా కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఇష్టపడరని అంటున్నారు. యునైటెడ్​ కింగ్​డమ్​లో మెంటల్​ హెల్త్​ యూకే(Mental Health -UK) సంస్థ తమ అధికారిక వెబ్​సైట్​లో ఇదే విషయం​ గురించి వివరాలు ప్రచురించింది(రిపోర్ట్​ కోసం ఇక్కడ క్లిక్​ చేయండి).
  • వార్తలు, వాటికి సంబంధించిన విశ్లేషణ.. తదితర కార్యక్రమాలు చూడడానికి ఆసక్తి చూపరని.. వాళ్ల సమక్షంలో ఎవరైనా వీటి గురించి మాట్లాడినా, చూసినా.. చిరాకు పడడం, కోపగించుకోవడం.. వంటి లక్షణాలు కనిపిస్తాయని అంటున్నారు.
  • ఆత్మ విశ్వాసాన్ని కోల్పోతుంటారని.. తద్వారా వారి జీవనశైలిలో మార్పులొస్తుంటాయని అంటున్నారు. అంటే నిద్ర లేవడం దగ్గర్నుంచి.. ఇంటి పనులు, ఆఫీసు పనులు.. ఇలా ప్రతిదీ భారంగా పూర్తి చేస్తుంటారని చెబుతున్నారు.
  • చిన్న విషయానికే చిరాకు పడడం వర్రీ బర్నౌట్‌ ఉన్న వారిలో కనిపిస్తుందని.. ఈ క్రమంలో ఇంటా, బయట అనే తేడా లేకుండా తమను మాట్లాడించిన వారిపై చీటికీ మాటికీ చిరాకు పడుతుంటారని వివరిస్తున్నారు.
  • ఇలా ప్రతి విషయానికీ అతిగా ఆలోచిస్తూ, బాధపడడం వల్ల వారి మనసు సున్నితంగా మారిపోతుందని.. తద్వారా అనవసర విషయాలకే భయపడడం, ఏడవడం.. వంటి లక్షణాలు వీరిలో గుర్తించచ్చని నిపుణులు చెబుతున్నారు.

ఎలా బయటపడాలి: మానసికంగానే కాదు.. శారీరక ఆరోగ్యంపైనా ప్రతికూల ప్రభావం చూపే ఈ పరిస్థితి నుంచి బయటపడాలంటే.. మన జీవనశైలిలో పలు మార్పులు-చేర్పులు చేసుకోవడంతో పాటు కొన్ని అలవాట్లు పాటించడం మంచిదంటున్నారు నిపుణులు. అవేంటంటే..

  • యోగా, ధ్యానానికి ఎలాంటి సమస్యనైనా దూరం చేసే శక్తి ఉంది. వర్రీ బర్నౌట్‌కూ ఈ వ్యాయామాలు దివ్యౌషధం అంటున్నారు నిపుణులు. ఇవి చేయడం వల్ల ఒత్తిడి హార్మోన్లు సమతులమై.. ప్రశాంతత దరిచేరుతుందని.. బ్లడ్​ ప్రెషర్​ అదుపులోకి వస్తుందని.. తద్వారా గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందంటున్నారు.
  • ఈ సమస్యను దూరం చేసుకోవాలంటే.. మనలోని ఆలోచనల్ని పేపర్‌పై పెట్టడం, వాటిని విశ్లేషించుకోవడం చక్కటి మార్గం అంటున్నారు నిపుణులు. ఫలితంగా ఒత్తిళ్లు, ఆందోళనలు, యాంగ్జైటీ.. వంటి మానసిక సమస్యలు దూరమై సానుకూల ఆలోచనలు పెరిగినట్లు ఓ అధ్యయనంలో తేలిందని వివరిస్తున్నారు.
  • శ్వాస సంబంధిత వ్యాయామాలు, కార్డియో ఎక్సర్‌సైజ్‌లు సుఖనిద్రకు ప్రేరేపిస్తాయి. అలాగే హ్యాపీ హార్మోన్లైన ఎండార్ఫిన్లను విడుదల చేస్తాయి. తద్వారా మనసులోని ప్రతికూల ఆలోచనలు దూరమై ప్రశాంతత చేకూరుతుందని చెబుతున్నారు.
  • మనసులోని బాధ మరొకరితో పంచుకుంటేనే తగ్గుతుందంటారు చాలామంది. వర్రీ బర్నౌట్‌తో బాధపడే వారికీ ఇది మేలు చేస్తుందంటున్నారు. కాబట్టి మీ ఆందోళన చిన్నదైనా, పెద్దదైనా.. మీకు నచ్చిన వారితో పంచుకుంటే.. మనసుకు ఉపశమనం కలుగుతుందని సూచిస్తున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

ఇకపై ఒత్తిడి, ఆందోళనకు చెక్! ఈ 3-3-3 రూల్ పాటిస్తే స్ట్రెస్ రిలీఫ్ పక్కా!

జాబ్​ ఒత్తిడితో ఉద్యోగిని మృతి - వర్క్​ప్లేస్​లో​ ఇలా చేస్తే.. స్ట్రెస్​ను గెటౌట్ అనొచ్చట!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.