ETV Bharat / sports

'కమాన్, ఇప్పుడు అరవండి రా!'- కొన్​స్టాస్​ను క్లీన్​ బౌల్డ్ చేసిన బుమ్రా సంబరాలు - IND VS AUS 4TH TEST 2024

తొలి ఇన్నింగ్స్‌లో దూకుడు- రెండో ఇన్నింగ్స్​లో విఫలం- ఆసీస్ యంగ్ ప్లేయర్ కొన్‌స్టాస్‌

Ind vs Aus 4th Test 2024
Ind vs Aus 4th Test 2024 (AP)
author img

By ETV Bharat Sports Team

Published : 17 hours ago

Updated : 13 hours ago

Bumrah vs Sam Konstas : మెల్‌బోర్న్‌ వేదికగా ఆస్ట్రేలియా - భారత్ జట్ల మధ్య నాలుగో టెస్టు రసవత్తరంగా సాగుతోంది. నాలుగో రోజు ఆసీస్‌ రెండో ఇన్నింగ్స్‌ ప్రారభించింది. అయితే తొలి ఇన్నింగ్స్‌లో దూకుడుగా ఆడుతూ బుమ్రా బౌలింగ్​లో సిక్స్​లు బాదిన యువ ఆటగాడు కొన్‌స్టాస్‌, రెండో ఇన్నింగ్స్​లో మాత్రం సీనియర్‌ పేసర్‌ ఎదుట నిలవలేకపోయాడు. ఇన్నింగ్స్‌ ఏడో ఓవర్‌లో అద్భుతమైన బంతితో కొన్‌స్టాస్‌ను బుమ్రా క్లీన్‌బౌల్డ్ చేశాడు.

దీంతో బుమ్రాతోపాటు భారత ఆటగాళ్లు సంబరాలు చేసుకున్నారు. అయితే తొలి ఇన్నింగ్స్​లో భారత్‌ బ్యాటింగ్‌ చేస్తున్నప్పుడు ఇంకా అరవాలంటూ కొన్‌స్టాస్ ఫ్యాన్స్‌ను ప్రోత్సహించాడు. అదే తరహాలో కొన్‌స్టాస్‌ ఔటైనప్పుడు బుమ్రా కూడా అభిమానులకు సైగలు చేయడం గమనార్హం. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యింది. మరి మీరు వీడియో చూశారా?

తొలి ఇన్నింగ్స్​లో ఇలా
తొలి ఇన్నింగ్స్​లో కొన్​స్టాస్ దూకుడుగా ఆడి (60 పరుగులు, 65 బంతుల్లో) హఫ్ సెంచరీ సాధించాడు. అయితే ముఖ్యంగా కొన్​స్టాస్ బుమ్రా బౌలింగ్​లో సిక్స్​లు బాది అందర్నీ ఆశ్చర్యపరిచాడు. టెస్టుల్లో బూమ్రా బౌలింగ్​లో సిక్స్ రావడం​ 4483 బంతుల తర్వాత అదే తొలిసారి. కెరీర్​లో ఆడుతున్న తొలి ఇన్నింగ్స్​లోనే కొన్​స్టాస్ బుమ్రా బౌలింగ్​లో సిక్స్​ బాదడం టీమ్ఇండియా ఫ్యాన్స్​ను నిరాశ పర్చింది.

ఇక భారత్ తొలి ఇన్నింగ్స్​లో బ్యాటింగ్ చేస్తుండగా ఓ దశలో ఆడియెన్స్​ను ఇంకా అరవాలంటూ కొన్‌స్టాస్ ఫ్యాన్స్‌ను ప్రోత్సహించాడు. కాగా, తాజాగా బుమ్రా కూడా అదే రీతిలో కొన్​స్టాస్​కు రిప్లై ఇవ్వడంతో ఫ్యాన్స్ హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ​

82-2 నుంచి 91-6
బుమ్రా, సిరాజ్ దెబ్బకు ఆసీస్ బ్యాటింగ్ ఆర్డర్ కుదేలైంది. 82-2తో ఆసీస్​ 4 ఓవర్ల వ్యవధిలోనే 91-6 కు చేరింది. బుమ్రా ఒక్కసారిగా రెచ్చిపోయాడు. స్టార్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ (1 పరుగులు), మిచెల్ మార్ష్ (0) ను ఒకే ఓవర్​లో పెవిలియన్ చేర్చి భారత్​కు మరోసారి బ్రేక్ ఇచ్చాడు. ఆ తర్వాచ వచ్చిన కెప్టెన్ కమిన్స్ పోరాడుతున్నాడు. టీ బ్రేక్ సమయానికి ఆసీస్ రెండో ఇన్నింగ్స్​లో 139-6తో ఉంది.

బుమ్రా@ 200- తొలి భారత బౌలర్​గా రికార్డ్- కెరీర్​లో మరో ఘనత

ఒక్క సెంచరీతో ఐదు రికార్డులు- తొలి భారత బ్యాటర్​గా అరుదైన ఘనత

Last Updated : 13 hours ago
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.