ETV Bharat / state

ఫోన్​ పోయిందా? - ఈ వెబ్​సైట్లో రిజిస్టర్​ చేస్తే ఈజీగా దొరికేస్తుంది - HOW TO GET A LOST PHONE IN EASY WAY

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో చోరీకి గురైన సెల్ ఫోన్లు రికవరీ చేసిన పోలీసులు - 1,190 ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేత - ఫోన్ పోతే సీఈఐఆర్ వెబ్​సైట్ రిజిస్టర్ చేసుకోవాలని విజ్ఞప్తి

CEIR Website to Get Lost Phone
CEIR Website to Get Lost Phone (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 31, 2025, 7:06 PM IST

Updated : Jan 31, 2025, 7:42 PM IST

CEIR Website to Recover a Lost Phone : సెల్​ఫోన్ పోగొట్టుకున్న వారికి ఎలా రికవరి చేయాలో తెలియదు. ఫోన్​ పోయిన వెంటనే పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేస్తారు. సహజంగా సెల్​ఫోన్ పోగానే CEIR వెబ్​సైట్​లో మొబైల్ పోయిందని చేస్తే ఈజీగా కనిపెట్టవచ్చు అంటున్నారు పోలీసులు. హైదరాబాద్​లోని సైబరాబాద్​ కమిషనరేట్​ పరిధిలో పోగొట్టుకున్న సెల్​ఫోన్లను పోలీసులు రికవరీ చేసి బాధితులకు అందజేశారు. కమిషనరేట్​ పరిధిలో ఇప్పటివరకు 5 విడతలుగా రికవరీ చేసిన ఫోన్ల పంపిణీ చేపట్టారు. 5వ విడతలో భాగంగా నెలన్నర రోజుల్లో 1,190 ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేశారు. ఎవరైనా ఫోన్లు పోగొట్టుకుంటే వెంటనే ఫిర్యాదు చేసి CEIR పోర్టల్​లో నమోదు చేసుకోవాలని సూచించారు. ​

విలువ రూ.2.55 కోట్లు : సైబరాబాద్ కమిషనరేట్‌ పరిధిలో చోరీకి గురైన ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేశారు. ఇప్పటివరకు 5 విడతల్లో 4,030 ఫోన్లు రికవరీ చేసి పంపిణీ చేయగా శుక్రవారం 5వ విడతగా 1,190 ఫోన్లను బాధితులకు పంపిణీ చేశారు. వీటిలో 10 వేల నుంచి లక్ష రూపాయల విలువగల ఫోన్లు ఉన్నాయి. వీటి మొత్తం విలువ సుమారు రూ.2.55 కోట్ల వరకు ఉంటుందని క్రైం డీసీపీ నర్సింహ తెలిపారు.

"ఫోన్లు పోగొట్టుకున్నవారు వెంటనే సీఈఐఆర్​ వెబ్​సైట్​లో నమోదు చేయాలి. అలా చేస్తే నిందితుడు మీ ఫోన్​ వాడాలి అన్నా, కొత్త సిమ్​ వేసి యూజ్​ చేయాలి అనుకున్నా రాదు. వేరేవాళ్లకి ఇచ్చినా తెలిసిపోతుంది. పోయిన ఫోన్లు ఇతర రాష్ట్రాలకు పంపించేస్తున్నారు. ఈ వెబ్​సైట్లో రిజిస్టర్ చేయడం వల్ల ఫోన్లను ఈజీగా కనిపెట్టగలుగుతున్నాం." - నర్సింహ, క్రైం డీసీపీ

మీ ఫోన్​ పోయిందా? డోంట్ వర్రీ - స్విఛ్ ఆఫ్​లో ఉన్నా ఈజీగా కనిపెట్టేయండిలా! - Missing Mobile Tracking

చట్టవ్యతిరేక కార్యకలాపాలకు వాడితే ప్రమాదం : చోరీకి గురైన ఫోన్లను నిందితులు ఆర్థిక మోసాలు, సైబర్‌ నేరలు సహా ఇతర చట్టవ్యతిరేక కార్యకలాపాలకు ఉపయోగించే ఆస్కారం ఉంటుంది. ఆ ప్రభావం ఫోన్లు పోగొట్టుకున్నవారిపై కచ్చితంగా పడుతుంది. ఫోన్ పోతే వెంటనే సీఈఐఆర్​లో నమోదు చేసుకోవాలి. తద్వారా ఫోన్‌ దొంగలించివారు ఉపయోగించలేడు. వేరే వాళ్లకు అమ్మినా, ఇంకొక సిమ్ వేసినా పోలీసులకు సమాచారం అందుతుంది.

ఆలస్యం చేస్తే నష్టం : ఈ క్రమంలోనే రాష్ట్రాలు దాటిన ఫోన్లను సైతం సీఈఐఆర్​ పోర్టల్‌ ద్వారా ట్రేస్ చేసి పోలీసులు ఫోన్లు రికవరీ చేస్తున్నారు. పంపిణీ చేస్తున్న ఫోన్లన్నీ నెలన్నరలో రికవరీ చేశామని క్రైం డీసీపీ నర్సింహ అన్నారు. భవిష్యత్‌లో ఫోన్లు దొంగతనం చేయాలంటే దొంగ కూడా భయపడే పరిస్థితి రావాలన్నారు.

మొబైల్స్ రికవరీలో హైదరాబాద్‌ టాప్‌ - ఫోన్‌ పోయిందా ఇలా చేస్తే ఈజీగా దొరికేస్తుంది

మీ సెల్​ఫోన్ పోయిందా ఐతే గోవిందా - క్షణాల్లో మీ ఖాతాల్లో డబ్బు మాయం - MOBILE THEFT CASES IN HYDERABAD

Last Updated : Jan 31, 2025, 7:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.