తెలంగాణ

telangana

ETV Bharat / state

'విద్యార్థినులు అనుమతి లేకుండా నెలకు పైగా బడికి రావట్లేదా - అయితే అప్రమత్తం కండి' - CHILD MARRIAGES IN TELANGANA

తెలంగాణలో పెరిగిపోతున్న బాల్యవివాహాలు - రోజుకు మూడు కేసులు - గతేడాది వెయ్యికి పైగా అడ్డుకున్న అధికారులు - 30 రోజులకు పైగా హాజరుకాకపోతే అప్రమత్తం కావాలన్న జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్

CHILD MARRIAGE AWARENESS PROGRAM
Child Marriages In Telangana (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jan 8, 2025, 2:50 PM IST

Updated : Jan 8, 2025, 3:00 PM IST

Child Marriages In Telangana : రాష్ట్రంలో బాలికలు మూడుముళ్ల బంధంలో బందీలవుతున్నారు. వివాహ వయస్సు 18 సంవత్సరాలు రాకముందే పెళ్లిళ్లు చేస్తున్నారు. ఇలా బాల్యవివాహాలపై క్షేత్రస్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేస్తున్నా తల్లిదండ్రులు సామాజిక దురాచారం నుంచి బయటపటలేకపోతున్నారు. ఆర్థిక ఇబ్బందులు, త్వరగా పెళ్లిచేసి బాధ్యతలు తీర్చుకోవాలని చిన్నారులను చదువుకోవాలన్న కోరికల నుంచి దూరం చేస్తున్నారు. తెలంగాణవ్యాప్తంగా గత సంవత్సరం దాదాపు వెయ్యికి పైగా బాల్యవివాహాల్ని అధికారులు అడ్డుకున్నారు. ప్రస్తుతం రోజుకు మూడు చొప్పున కేసులు నమోదవుతున్నాయి. బాల్యవివాహాల నిరోధక చట్టం, చైల్డ్​లైన్​పై అవగాహనతో ఎవరైనా ముందుకు వచ్చి ఫిర్యాదులు చేస్తేనే ఈ కేసులు వెలుగులోకి వస్తున్నాయి.

తెలంగాణలో బాల్యవివాహాలు :బాల్యవివాహాలు జరగకుండా ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తున్నా సామాజిక దురాచారానికి అడ్డుకట్ట పడటం లేదు. బాల్యవివాహాలు ఎక్కువగా రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో జరుగుతున్నాయి. ఈ జిల్లాలు అభివృద్ధిలోనే కాదు సామాజిక వెనుకబాటులోనూ ఉన్నాయి. తెలంగాణలో వికారాబాద్ జిల్లాలో అత్యధికంగా బాల్యవివాహాలు జరుగుతున్నాయి. ఉమ్మడి మహబూబ్​నగర్, మెదక్, నల్గొండ, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాలో ఈ కేసులు ఎక్కువగా వచ్చాయి. కొత్త జిల్లాల వారీగా అత్యంత తక్కువ కేసులు పదిలోపు ములుగు, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాలో నమోదయ్యాయి.

బాల్యవివాహాలను అడ్డుకునే బాధ్యతలు : రాష్ట్రవ్యాప్తంగా 14,562 మంది అధికారులు బాల్యవివాహాలను అడ్డుకునే బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే అవగాహన కార్యక్రమాల సంఖ్య తక్కువగా ఉంటుంది. ఏడాదిలో కేవలం 2500 కార్యక్రమాలే నిర్వహించారు. చిన్న వయసులో గర్భం దాల్చడంతో నెలలు నిండకముందే శిశువులు జన్మించడం, అనారోగ్య సమస్యల బారిన పడుతున్నట్లు ఇప్పుటికే జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ - ఎన్​సీపీసీఆర్ తన నివేదిలో పేర్కొంది. ఇటీవలె రాష్ట్రంలో 7717 పాఠశాల్లో బాలికల హాజరు పరిశీలించి ఆయా పాఠశాల్లో చదువుతున్న 9వేల మందికి పైగా బాలికలు ప్రమాదంలో ఉన్నారని హెచ్చరించింది. పాఠశాలల్లో విద్యార్థినులు ముందస్తు అనుమతి లేకుండా 30 రోజులకు పైగా హాజరుకాకపోతే అప్రమత్తం కావాలని అన్ని రాష్ట్రాలకు సూచించింది.

బాల్య వివాహాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు- ఇకపై చట్టం అమలు ఇలా!

వరంగల్​లో బాల్యవివాహం - 30 సంవత్సరాల వ్యక్తితో 15ఏళ్ల బాలిక పెళ్లి

Last Updated : Jan 8, 2025, 3:00 PM IST

ABOUT THE AUTHOR

...view details