తెలంగాణ

telangana

ETV Bharat / state

నిర్మాత దిల్‌రాజుకు షాక్‌ల మీద షాక్‌లు - 'గేమ్‌ఛేంజర్‌ సినిమాను లీక్‌ చేస్తామని బెదిరింపులు' - LEAK THREATS TO GAMECHANGER

గేమ్‌ ఛేంజర్‌ సినిమాని లీక్‌ చేస్తామంటూ చిత్ర బృందానికి బెదిరింపులు - అడిగినంత డబ్బులు ఇవ్వాలని డిమాండ్‌ - సైబర్‌ క్రైమ్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన మూవీ టీం

THREATS TO GAMECHANGER  MOVIE
RAM CHARAN GAMECHANGER (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jan 13, 2025, 7:12 PM IST

Leak Threats to Game Changer Movie Team : తాము అడిగినంత డబ్బులు ఇవ్వకపోతే గేమ్‌ ఛేంజర్‌ సినిమాను లీక్‌ చేస్తామంటూ మూవీ టీంను బెదిరింపులకు గురిచేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వారిపై గేమ్‌ ఛేంజర్‌ మూవీ టీం హైదరాబాద్‌లోని సైబర్‌ క్రైమ్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసి సైబర్‌ క్రైమ్‌ పోలీసులు ముమ్మర దర్యాప్తు చేపట్టారు.

గేమ్‌ ఛేంజర్‌ సినిమా రిలీజ్‌కు ముందు నిర్మాతలతో పాటు టీమ్‌లోకి కొందరు కీలక వ్యక్తులకు వాట్సాప్‌, సోషల్‌ మీడియా వేదికగా డబ్బు ఇవ్వాలంటూ బెదిరింపు కాల్స్, మెసేజ్‌లు వచ్చాయి. అడిగిన మొత్తాన్ని ఇవ్వకపోతే మూవీని ఆన్‌లైన్‌ వేదికగా లీక్‌ చేస్తామంటూ కొందరు నిర్మాతలను బ్లాక్‌ మెయిల్‌ చేశారు.

రెండ్రోజుల ముందు కొన్ని సీన్స్‌ లీక్‌ : మూవీ రిలీజ్‌కు రెండు రోజుల ముందు (జనవరి 08న) కీలక సన్నివేశాలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు కూడా. మరోవైపు, సినిమా రిలీజైన రోజే క్లియర్‌ ప్రింట్‌ను ఆన్‌లైన్‌లో సైతం లీక్‌ చేశారు. ఆధారాలు సేకరించిన మూవీ టీం 45 మందితో కూడిన ముఠాపై తాజాగా పోలీసులకు కంప్లైంట్‌ చేసింది. ఈ గ్యాంగ్‌ వెనుక ఉన్నదెవరు? అనే కోణంలో పోలీసులు వేగంగా దర్యాప్తు చేస్తున్నట్టు సమాచారం.

మరోవైపు, సామాజిక మాద్యమం వేదికగా సినిమాపై నెగెటివిటీ(దుష్ప్రచారం) సృష్టిస్తున్న కొన్ని ఖాతాలపైనా ‘గేమ్ ఛేంజర్‌’ టీమ్‌ ఫిర్యాదు ఇచ్చింది. రామ్‌ చరణ్‌ హీరోగా తమిళ దర్శకుడు శంకర్‌ తెరకెక్కించిన ఈ చిత్రం భారీ బడ్జెట్‌తో తీశారు. సంక్రాంతి పండుగ కానుకగా 2025 జనవరి నెల 10న భారీ ఎత్తున విడుదలైంది.

గేమ్‌ఛేంజర్ సినిమాపై హైకోర్టులో పిటిషన్

నిర్మాత దిల్‌రాజుకు షాక్‌ - గేమ్ ఛేంజర్ టికెట్‌ ధరల పెంపు ఉత్తర్వులు ఉపసంహరించుకున్న ప్రభుత్వం

ABOUT THE AUTHOR

...view details