తెలంగాణ

telangana

ETV Bharat / state

విద్యార్థినులకు సూపర్‌ న్యూస్ - వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో మహిళా వర్సిటీ బిల్లు!

రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో మహిళా విశ్వవిద్యాలయం బిల్లు ప్రవేశపెట్టే అవకాశం - సమాయత్తమవుతున్న సర్కార్‌

The Women's University Bill will Introduced in Coming Assembly Sessions
The Women's University Bill will Introduced in Coming Assembly Sessions (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Dec 3, 2024, 12:41 PM IST

The Women's University Bill will Introduced in Coming Assembly Sessions : త్వరలో నిర్వహించనున్న తెలంగాణ శాసనసభ సమావేశాల్లో ప్రభుత్వం వీరనారి చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీ బిల్లును ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. మహిళా విశ్వవిద్యాలయమని చెప్పి ఇప్పుడు ఓయూ పేరిట సర్టిఫికెట్లు ఇస్తున్నారని, యూజీసీ గుర్తింపు పొందిన మహిళా వర్సిటీ పేరుపైనే సర్టిఫికెట్లు ఇవ్వాలని ఇటీవలే విద్యార్థినులు ఆందోళన నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో త్వరలో ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ఆచార్య బాలకిష్టారెడ్డి సైతం వర్సిటీపై నివేదికను ప్రభుత్వ ఆదేశాల మేరకు పంపించినట్లు తెలుస్తోంది.

కోర్సు పూర్తి చేయడంతో :మహిళా కళాశాలను విశ్వవిద్యాలయంగా మారుస్తున్నామని 2021లోనే నిర్ణయించిన కేసీఆర్‌ ప్రభుత్వం, 2022 ఏప్రిల్‌ 22న జీవో 12ను జారీ చేసింది. ఆ వెంటనే ఇన్‌ఛార్జి వీసీని నియమించింది. అయితే వర్సిటీగా మారుస్తూ అసెంబ్లీలో బిల్లును మాత్రం ప్రవేశపెట్టలేదు. అధికారంలోకి వచ్చిన కొత్త ప్రభుత్వం గత అసెంబ్లీ సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టి చట్టం చేసేందుకు సన్నద్ధమైనా, చివరి నిమిషంలో దాన్ని పక్కన పెట్టింది. మహిళా యూనివర్సిటీలో 2022-23 విద్యా సంవత్సరంలో పలు పీజీ కోర్సుల్లో చేరిన విద్యార్థినులు కోర్సును గత ఆగస్టులో పూర్తి చేశారు.

బంధాలు నేర్పే బడి వచ్చేసింది - ఇక ఆన్​లైన్​ విధానంలోనూ షురూ - Family and Marriage Counseling

యూజీసీ ఆమోదిస్తేనే వర్సిటీ పేరిట పట్టాలు : ఇప్పుడు వారికి పట్టాలు ఇవ్వాల్సి ఉండటంతో వివాదం తెరపైకి వచ్చింది. మహిళా వర్సిటీ పేరిట పట్టాలు ఇవ్వాలంటే తొలుత వర్సిటీకి చట్టం రావాలి. అది కావాలంటే అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టాలి. బిల్లు చట్టం రూపం దాల్చిన తర్వాత దాన్ని యూజీసీకి పంపించాలి. ఆ చట్టాన్ని యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ ఆమోదిస్తేనే మహిళా వర్సిటీ పేరిట పట్టాలు ఇవ్వడానికి ఉంటుంది.

పాస్ అయిన వారు ఫెయిలైనట్లు, ఫెయిల్ అయిన వారు పాసైనట్లు జాబితా - కాలేజీ గుర్తింపు రద్దు

హాస్టల్​ భోజనంలో మధ్యాహ్నం కప్ప - రాత్రి అన్నం తింటుండగా పురుగులు - విద్యార్థినుల మెరుపు ధర్నా

ABOUT THE AUTHOR

...view details