తెలంగాణ

telangana

ETV Bharat / state

ఒక వారం చలి, మరో వారం వేడి - వచ్చేనెలలో రాష్ట్రంలో మారనున్న వాతావరణం - TEMPERATURE INCREASING IN TELANGANA

రాష్ట్రంలో మొదలైన ఎండ తీవ్రత - జనవరి చివరి నుంచే మొదలైన ఎండలు - ఫిబ్రవరి మొదటి వారం నుంచి క్రమేపీ పెరగనున్న ఉష్ణోగ్రతలు

Temperature Increasing in Telangana
Temperature Increasing in Telangana (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jan 30, 2025, 5:54 PM IST

Temperature Increasing in Telangana :వచ్చే నెల నుంచి ఉష్ణోగ్రతలు క్రమేపీ పెరుగుతాయని వాతావరణ అధికారులు తెలిపారు. ప్రస్తుతం తూర్పు, ఈశాన్య, వాయువ్య గాలుల వల్ల నాలుగు రోజుల పాటు పొగ మంచు కురిసే అవకాశముందన్నారు. జనవరి చివరి వారం నుంచి ఎండ తీవ్రత మొదలైంది. ఇప్పటికే పలు జిల్లాల్లో సాధారణం, మరికొన్ని జిల్లాల్లో సాధారణం కంటే ఒక డిగ్రీ అధికంగా ఉష్ణోగ్రతలు నమోదుతున్నాయి. గాలుల దిశల మార్పుల వల్ల ఫిబ్రవరిలో ఒక వారం చల్లగా, మరో వారం వేడిగా ఉండే అవకాశముందని వాతావరణ కేంద్రం తెలిపింది. మార్చి నెల నుంచి అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది.

ప్రస్తుతం రాష్ట్రంలోకి తూర్పు, ఆగ్నేయ గాలులు వీస్తున్న కారణంగా ఒక వారం పాటు చలి ఉంటుందని వాతావరణ కేంద్రం తెలిపింది. కాగా వచ్చే నెల నుంచే క్రమేపీ పెరగనున్న ఉష్ణోగ్రతలు, ఉదయం 17 డిగ్రీల మేర నమోదు అవుతుందని, మధ్యాహ్నం 31 నుంచి 35 డిగ్రీల వరకు నమోదు అవుతుందని వివరించింది. తూర్పూ, ఆగ్నేయ గాలుల వల్ల ఉదయం చల్లగా, మధ్యాహ్నం పూట ఎండగా ఉంటుందని తెలిపింది. ఫిబ్రవరి రెండో వారం వరకు కొన్ని సార్లు వెేడి, చల్ల గాలులు వీస్తాయని మూడో వారం నుంచి ఉష్ణోగ్రతల పెరుగుదల కనిపిస్తుందని వివరించింది.

వచ్చేనెలలో రాష్ట్రంలో మారనున్న వాతావరణం (ETV Bharat)

"ఫిబ్రవరి నెలలో ఒకవారం వేడిగా మరోవారం చల్లగా ఉంటుంది. వచ్చే నెల చివరి నుంచి లేదా మార్చి మొదటి వారం నుంచి ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. రానున్న నాలుగైదు రోజులు పొగమంచు కురిసే అవకాశముంది. వాతావరణం చల్లగా కావడం, వేడెక్కడానికి ప్రధాన కారణాలు గాలులే. అవి దిశలు మారుతున్న వేళ వాతావరణం అనేది మారుతూ ఉంటుంది." - నాగరత్న, వాతావరణ సంచాలకులు

గాలులు దిశ మారితే ఉష్ణోగ్రతలు పెరుగుతాయి : రాష్ట్రంలో రానున్న రోజులు కూడా పొడి వాతావరణమే ఉంటుందని తెలిపారు. అలాగే గాలుల దిశలు మారే అవకాశం ఉన్నందున ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశముందన్నారు. ముఖ్యంగా పగటి పూడ వేడి ఎక్కువగా ఉంటుందని తెలిపారు. దాదాపు అన్ని జిల్లాలో సాధారణం కంటే ఒకటి రెండు డిగ్రీల ఉష్ణోగ్రత పెరుగుతుందని వివరించారు.

ఫిబ్రవరి 15 తర్వాత ఎండలు మండిపోతాయి : వాతావరణ శాఖ

వాతావరణం మారుతోంది, చలి - ఎండ మధ్య తట్టుకునేందుకు ఈ చిట్కాలు పాటించండి!

ABOUT THE AUTHOR

...view details