తెలంగాణ

telangana

ETV Bharat / state

సూపర్ టూర్ : బొగత అందాలు చూడాలంటే ఇటు.. నాగార్జున సాగర్​ చూడాలంటే అటు.. తెలంగాణ టూరిజం ఒక్కరోజు ప్యాకేజీలు! - Bogatha Waterfalls Tour Package - BOGATHA WATERFALLS TOUR PACKAGE

Telangana Tourism: నైరుతి రుతుపవనాల కారణాంగా రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి. ఈ క్రమంలోనే చాలా మంది వాటర్​ ఫాల్స్​, డ్యామ్​లు చూడాలని అనుకుంటుంటారు. మరి మీరు కూడా ఆ లిస్ట్​లో ఉన్నారా? అయితే మీకు తెలంగాణ టూరిజం గుడ్​న్యూస్​ చెబుతోంది. బొగత వాటర్​ఫాల్స్​, నాగార్జున సాగర్​ చూసేందుకు విడివిడిగా ఒక్కరోజు ప్యాకేజీలను ప్రకటించింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..

Telangana Tourism
Telangana Tourism (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jun 13, 2024, 5:29 PM IST

Hyderabad - Bogatha Waterfalls Tour Package: ప్రముఖ పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రదేశాలు సహా ఇతర ప్రాంతాలను చూసేందుకు తెలంగాణ టూరిజం అనేక రకాల టూర్ ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకొస్తోంది. ప్రకృతి పర్యాటకానికి పేరొందిన పలు ప్రాంతాలకు ఇప్పటికే ప్యాకేజీలను ఆపరేట్ చేస్తుండగా.. తాజాగా ములుగు జిల్లాలో ఉన్న బొగత జలపాతం చూసేందుకు, నల్లగొండ జిల్లాలోని నాగార్జున సాగర్​ను చూసేందుకు వేర్వేరుగా ఒక్కరోజు ప్యాకేజీలను తీసుకొచ్చింది. మరి, ఈ టూర్లు​ ఎప్పుడు స్టార్ట్​ అవుతాయి? ధర ఎంత? వంటి వివరాలు ఇప్పుడు చూద్దాం..

బొగత వాటర్​ఫాల్స్​: ములుగు జిల్లాలో ఉన్న బొగత జలపాతం చూసేందుకు తెలంగాణ టూరిజం Bogatha Waterfalls- Telangana Toursim పేరుతో ప్యాకేజీని తీసుకొచ్చింది. హైదరాబాద్ నుంచి ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది. ఒక్క రోజులోనే ఈ ట్రిప్ ముగుస్తుంది. ప్రతి శనివారం, ఆదివారం ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది.

ప్రయాణ వివరాలు:

  • ఉదయం 6 గంటలకు హైదరాబాద్​ నుంచి నాన్​ ఏసీ బస్సులో జర్నీ ప్రారంభం అవుతుంది.
  • బొగత వాటర్​ఫాల్స్​ చేరుకొని అక్కడ ఫుల్​గా ఎంజాయ్​ చేయవచ్చు.
  • రాత్రి 11.30 గంటలకు తిరిగి హైదరాబాద్​కు చేరుకోవడంతో ట్రిప్​ ముగుస్తుంది.
  • టికెట్ ధరలు పెద్దలకు రూ. 1600, చిన్నారులు రూ. 1280గా నిర్ణయించారు.
  • ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలు, బుకింగ్​ కోసం ఈ లింక్​పై క్లిక్​చేయండి.

తెలంగాణ టూరిజం స్పెషల్​ ప్యాకేజీ - ఫ్లైట్​లో జర్నీ - షిరిడీ సాయినాథుడి దర్శనంతో పాటు మరెన్నో ప్రదేశాలు! - Telangana Tourism Shiridi Package

నాగార్జున సాగర్​: నాగార్జున సాగర్​ను చూసేందుకు వీలుగా Nagarjuna Sagar Tour పేరుతో తెలంగాణ టూరిజం ప్యాకేజీ ప్రకటించింది. హైదరాబాద్ నుంచి ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. ఇది కూడా ఒక్క రోజులోనే టూర్​ ముగుస్తుంది. ప్రతి శనివారం, ఆదివారం ఈ ప్యాకేజీని బుక్‌ చేసుకోవచ్చు.

ప్రయాణ వివరాలు:

  • ప్రతి శనివారం, ఆదివారం ఉదయం 7.30 గంటలకు హైద‌రాబాద్ పర్యాటక భవన్ నుంచి, 8 గంటలకు బషీర్​బాగ్​ చేరుకుని అక్కడి నుంచి సాగర్​కు జర్నీ స్టార్ట్​ అవుతుంది. ఉదయం 11:30 గంటలకి నాగార్జున సాగర్‌కు చేరుకుంటారు.
  • ఉదయం 11:40 గంట‌ల‌కు అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసిన బుద్ధవనం ప్రాజెక్ట్​ను సందర్శిస్తారు. . త‌ర్వాత‌ లంచ్ బ్రేక్ ఉంటుంది.
  • ఆ తర్వాత నాగార్జునకొండకు లాంచీలో ప్రయాణం ఉంటుంది. అక్క‌డ నాగార్జున సాగర్ మ్యూజియం, నాగార్జునకొండ సందర్శిస్తారు.
  • సాయంత్రం 4 గంటలకు నాగార్జున సాగర్ డ్యామ్​ను సంద‌ర్శ‌ిస్తారు.
  • 5 గంట‌ల‌కు నాగార్జున సాగర్ నుంచి తిరుగు ప్రయాణం మొదలవుతుంది. రాత్రి 9 గంటలకు హైదరాబాద్ చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.
  • ఈ ప్యాకేజీ ధరలు చూస్తే పెద్దలకు రూ. 800, పిల్లలకు 640గా నిర్ణయించారు.
  • ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలు, బుకింగ్​ కోసం ఈ లింక్​పై క్లిక్​ చేయండి.

ఊటీ సూపర్ టూర్ - బడ్జెట్​ ధరలోనే తెలంగాణ టూరిజం కొత్త ప్యాకేజీ! - మరికొన్ని ప్రదేశాలు కూడా! - Telangana Tourism Mysore Tour

తెలంగాణ టూరిజం స్పెషల్​ ప్యాకేజీ - యాదాద్రితో పాటు మరో 2 ప్రదేశాలు - టూర్‌ పూర్తి వివరాలివే! - Hyderabad to Yadagirigutta Tour

ABOUT THE AUTHOR

...view details