Telangana Regional Ring Road Tripartite Agreement: ప్రాంతీయ రింగు రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్) వ్యవహారం క్రమంగా కొలిక్కి వస్తోంది. తెలంగాణ అభివృద్ధికి ఈ మార్గం అత్యంత కీలకమని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్న విషయం తెలిసిందే. మొత్తం 351 కిలోమీటర్ల పొడవున రెండు భాగాలుగా ఈ రహదారిని నిర్మించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొన్నేళ్లుగా కసరత్తు చేస్తున్నాయి. దీని నిర్మాణంలో జాతీయ రహదారుల సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) భాగస్వామిగా ఉంది. ఈమేరకు ఈ మూడింటి మధ్య త్రైపాక్షిక ఒప్పందం జరగాల్సి ఉంది. ఇందుకు సంబంధించిన కసరత్తు మూడేళ్ల నుంచి జరుగుతున్నప్పటికీ తుదిరూపం దాల్చలేదు. తాజాగా ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు ప్రయత్నాలు ప్రారంభించినట్లు సమాచారం.
Regional Ring Road Issue in Telangana: ఆర్‌ఆర్‌ఆర్ నిర్మాణానికి అవసరమైన భూసేకరణకు అయ్యే వ్యయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరి సమానంగా భరించాలని గతంలోనే నిర్ణయించాయి. నిర్మాణ వ్యయాన్ని మాత్రం కేంద్రమే పూర్తిగా భరిస్తుంది. ఈ మేరకు రెండు ప్రభుత్వాలూ అప్పట్లోనే అవగాహనకు వచ్చాయి. అయితే, ప్రతిపాదిత రోడ్డు మార్గంలో ఉన్న వివిధ రకాల తీగలు, పైపులైన్లు, విద్యుత్తు స్తంభాలు తదితరాలను తరలించేందుకయ్యే వ్యయం విషయంలో కేంద్రం, మునుపటి రాష్ట్ర ప్రభుత్వాల మధ్య లేఖల యుద్ధం జరిగింది. ఈ ఖర్చులను రాష్ట్రమే భరించాలని కేంద్రం, సాధ్యం కాదని రాష్ట్రం పట్టుదలతో వ్యవహరించాయి. ఫలితంగా ప్రాంతీయ రింగు రోడ్డు నిర్మాణమే ప్రశ్నార్థకంగా మారింది.
Telangana Regional Ring Road : తెలంగాణ ఆర్‌ఆర్‌ఆర్ భూసేకరణకు కసరత్తు షురూ