Dulqer Salmaan Lucky Bhaskar : ఇప్పటివరకూ థియేటర్లలో సందడి చేసిన 'లక్కీ భాస్కర్' ఇప్పుడు ఓటీటీలోనూ ప్రేక్షకులను అలరిస్తూ అనేక రికార్డులను తన ఖాతాలో వేసుకుంటోంది. ఇటీవలే నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్కు అందుబాటులోకి వచ్చిన ఈ చిత్రం విడుదలైన నాటినుంచి అక్కడ కూడా టాప్ వన్‌గా ట్రెండ్ అవుతోంది. దీంతో తాజాగా అభిమానులకు, ఆడియెన్స్‌కు నటుడు దుల్కర్ సల్మాన్ సోషల్ మీడియా వేదికగా థ్యాంక్స్ చెప్పారు.
"రిలీజైన అన్ని భాషల్లోనూ 'లక్కీ భాస్కర్' మంచి ప్రేక్షకాదరణను సొంతం చేసుకుంది. ఇప్పుడు అదే ప్రేమను నెట్‌ఫ్లిక్స్‌లోనూ మీరు చూపుతున్నారు. ఈ సినిమా 5 భాషల్లో విడుదలైంది. వాటిలో మూడు వెర్షన్లకు (మలయాళం, తమిళం, తెలుగు) నేనే డబ్బింగ్ చెప్పాను. కానీ సమయం లేనుందున కన్నడ, హిందీ భాషల్లో డబ్బింగ్ చెప్పలేకపోయాను. సారీ. కానీ ఈసారి చేసే సినిమాలకు 5 భాషల్లోనూ నేనే డబ్బింగ్ చెప్పడానికి ట్రై చేస్తాను. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన నాటినుంచి ఎన్నో నాకు మెసేజ్‌లు వస్తున్నాయి. అందరికీ ధన్యవాదాలు" అంటూ దుల్కర్ ఓ స్పెషల్ వీడియో మెసేజ్ షేర్ చేశారు.
ఆ రికార్డు కూడా
అయితే ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ అయ్యేంతవరకూ జూనియర్ ఎన్టీఆర్ 'దేవర'నే టాప్ ప్లేస్‌లో ఉంది. కానీ 'లక్కీ భాస్కర్' వచ్చిన తర్వాత 'దేవర' టాప్3లోకి చేరుకుంది. అంతేకాకుండా 15 దేశాల్లో టాప్ 10 సినిమాల్లో 'లక్కీ భాస్కర్' మొదటి స్థానంలో నిలిచిందని ఇటీవల నిర్మాణసంస్థ కూడా సినిమా సక్సెస్ గురించి ఓ పోస్ట్ పెట్టింది.
ఇక దుల్కర్ ప్రస్తుతం 'కాంత', 'ఆకాశంలో ఒక తార' అనే రెండు ప్రాజెక్టులు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇవి కాకుండా ఆయన తాజాగా మరో కొత్త సినిమాకు కూడా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. దీని ద్వారా రవి అనే కొత్త డైరెక్టర్ ఇండస్ట్రీకి పరిచయం కానున్నట్లు తెలుస్తోంది. హీరోయిన్గా పూజా హెగ్డే పేరు ఈ సినిమా కోసం పరిశీలనలో ఉన్నట్లు సినీ వర్గాల సమాచారం.
Baskhar continues his MEGA BLOCKBUSTER run on home screens too!💥#LuckyBaskhar 𝐓𝐑𝐄𝐍𝐃𝐈𝐍𝐆 #𝟏 on @netflix, also trending in TOP 10 across 15 Countries Worldwide! 🔥🤩#BlockbusterLuckyBaskhar streaming now in Telugu, Tamil, Malayalam, Kannada and Hindi Languages! 💰💵… pic.twitter.com/4KXZnyo6go
— Sithara Entertainments (@SitharaEnts) November 30, 2024
ఓవర్సీస్లో దుల్కర్ మేనియా - రిలీజైన కొద్ది రోజుల్లోనే అక్కడి బాక్సాఫీస్ వద్ద రేర్ రికార్డ్!
'మహానటి' కథ వినకముందే రిజెక్ట్ చేసిన దుల్కర్! మళ్లీ ఎందుకు నటించారు? నాగ్ అశ్విన్ రివీల్!