తెలంగాణ

telangana

ETV Bharat / state

100 రోజుల్లో గ్యారంటీలు అమలు చేస్తామని భరోసానిస్తూ - జిల్లాల్లో మంత్రుల పర్యటనలు - Telangana Ministers District Tour

Telangana Ministers District Tour : రాష్ట్రవ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్న మంత్రులు అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నారు. జిల్లాల వారీగా సమీక్షలు చేస్తున్నారు. కాంగ్రెస్‌ సర్కార్‌ ప్రజాపాలన అందిస్తోందని అభయహస్తం గ్యారంటీలను తప్పకుండా 100 రోజుల్లో అమలు చేస్తామని భరోసానిస్తున్నారు.

Ministers Review On Development
Telangana Ministers Visiting Districts

By ETV Bharat Telangana Team

Published : Jan 25, 2024, 10:35 AM IST

అభివృద్ధిపై జిల్లాలవారీగా మంత్రుల సమీక్షలు - అభయహస్తం గ్యారంటీలను 100 రోజుల్లో అమలుచేస్తామని వెల్లడి

Telangana Ministers District Tour : రాష్ట్రవ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్న మంత్రులు అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నారు. జిల్లాల వారీగా సమీక్షలు చేస్తున్నారు. కాంగ్రెస్‌ సర్కార్‌ ప్రజాపాలన అందిస్తోందని అభయహస్తం గ్యారంటీలను తప్పకుండా 100 రోజుల్లో అమలు చేస్తామని భరోసానిస్తున్నారు.

District wise Ministers Review On Development : జగిత్యాల జిల్లా కలెక్టరేట్‌లో జరిగిన సమీక్ష సమావేశంలో ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు పాల్గొన్నారు. సమావేశంలో ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌, ఎమ్మెల్సీ (MLC Jeevan Reddy) జీవన్‌రెడ్డి పాల్గొన్నారు. అనంతరం ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో జరుగుతున్న వేద పరిపాలన పూర్ణహుతి కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారిని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దర్శించుకున్నారు. గతంలో యాదాద్రి అభివృద్ది పనుల్లో జరిగిన అవకతవకలతో పాటు జిల్లా అభివృద్ధి పనులపై మంత్రి సమీక్ష నిర్వహించారు.

మరో ఏక్​నాథ్​ షిండేగా రేవంత్​ మారినా ఆశ్చర్యం లేదు : కేటీఆర్

Congress Ministers Districts Tour :దుబ్బాక నియోజకవర్గంలో మంత్రి కొండా సురేఖ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మిరుదొడ్డి మండలం అల్వాలలో నూతన గ్రామపంచాయతీ కార్యాలయం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. అనంతరం రంగనాయక సాగర్ జలాశయం నుంచి యాసంగి పంటకు సాగునీటిని విడుదల చేశారు.

" రంగనాయక సాగర్ జలాశయం నుంచి యాసంగి పంటకు సాగునీటిని విడుదల చేశాము. రంగనాయక సాగర్ జలాశయంలో దాదాపు ఒక లక్ష పదివేల ఎకరాలకు నీరు అందించేటువంటి కార్యక్రమం ఉంది. దీనిలో ఎడమ కాలువ విడుదల చేయడం జరిగింది. ఎడమ కాలువ నుంచి 70 వేల ఎకరాలకు, కుడి కాలువకు 40 వేల ఎకరాలకు నీరు అందించే ప్రక్రియ ఉంది." -మంత్రి, కొండా సురేఖ

Minister damodar Inaugurated Anemia Mukt Telangana Program: సంగారెడ్డిలో 'అనీమియా ముక్త్ తెలంగాణ' కార్యక్రమాన్ని మంత్రి దామోదర రాజనర్సింహ ప్రారంభించారు. విద్యార్థుల్లో అనీమియా నివారణే ప్రధాన ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన స్పష్టంచేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పిల్లలకు రక్తహీనత ఉండకూడదన్న ఉద్దేశంతో రాష్ట్రస్థాయిలో అనీమియా ముక్త్ తెలంగాణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

రాష్ట్ర వ్యాప్తంగా రోజుకి 100 నుంచి 300 మంది విద్యార్థులకు టెస్టులు చేసి రక్తహీనతతో బాధపడే వారికి మందులు ఇవ్వడం జరుగుతుందన్నారు. నిర్ణీత శాతం కన్న హిమోగ్లోబిన్ తక్కువగా ఉన్న విద్యార్థులకు ఐరన్ టాబ్లెట్స్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి గాయత్రీ దేవి, డాక్టర్లు, ఆందోల్ ఆర్డిఓ, పోలీస్ అధికారులు, ఎంపీడీవో, తహసిల్దార్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

నామినేటెడ్ పదవుల భర్తీకి కాంగ్రెస్ కసరత్తు - టికెట్‌ త్యాగం చేసిన వారికే ప్రాధాన్యం

12 లోక్​సభ స్థానాలపై కాంగ్రెస్ గురి - బూత్‌ స్థాయిలో బలోపేతంపై దృష్టి

ABOUT THE AUTHOR

...view details