ETV Bharat / state

రైతులకు అద్దిరిపోయే ప్రభుత్వ స్కీమ్​ - నెలకు రూ.3 వేల పెన్షన్ - అప్లై చేసుకోండిలా!​ - PM KISAN MAAN DHAN YOJANA

-వృద్ధాప్యంలో చిన్న, సన్నకారు రైతులకు అండగా కేంద్ర ప్రభుత్వం -ప్రతినెలా పెన్షన్​ అందించేందుకు ప్రత్యేక స్కీమ్​

How to Apply PM Kisan Maan Dhan Yojana
How to Apply PM Kisan Maan Dhan Yojana (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : 3 hours ago

How to Apply PM Kisan Maan Dhan Yojana : రైతుల సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలు అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే రైతులు వ్యవసాయం చేస్తున్నంత కాలం మాత్రమే ఈ స్కీమ్స్​ ఆర్థిక భరోసాను అందిస్తాయి. మరి రైతులు వృద్ధాప్యంలోకి అడుగుపెడితే? వ్యవసాయం చేయలేకపోతే ఎలా? అనే ప్రశ్నకు సమాధానంగా.. చిన్న, సన్నకారు రైతులకు 60 ఏళ్ల వయసు దాటిన తర్వాత అండగా నిలిచేందుకు కేంద్ర ప్రభుత్వం 'ప్రధానమంత్రి కిసాన్‌ మాన్‌ధన్‌ యోజన(PMKMY)' పథకాన్ని తీసుకొచ్చింది. ఇంతకీ పీఎం కిసాన్ మాన్ ధన్ యోజన అంటే ఏమిటి? ఎవరెవరు అర్హులు?అవసరమైన పత్రాలు ఏంటి? నెలకు రూ.3వేలు ఎలా పొందవచ్చు? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

పీఎం మాన్‌ధన్‌ యోజన అంటే ఏమిటి: ప్రధాన మంత్రి కిసాన్ మాన్‌ధన్‌ యోజన చిన్న, సన్నకారు రైతుల కోసం రూపొందించబడిన పథకం. 60 సంవత్సరాలు నిండిన రైతులకు ఈ పథకం ద్వారా ప్రతి నెలా రూ.3,000 చొప్పున పెన్షన్​​ అందుతుంది. ప్రభుత్వ అధికారులు, ఉద్యోగుల తరహాలో రైతులకు పింఛను ప్రయోజనాలను అందించడమే దీని ప్రధాన లక్ష్యం.

ఈ పథకానికి అర్హులెవరంటే:

  • 18 నుంచి 40 సంవత్సరాల మధ్య వయసు కలిగిన రైతులు అర్హులు.
  • దేశంలోని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల భూ రికార్డుల్లో పేర్లు ఉండి.. వారికి 2 హెక్టార్ల వరకు సాగు చేసేందుకు లేదా అంతకంటే తక్కువ భూమిని కలిగి ఉండాలి.

వీరికి అర్హత లేదు : నేషనల్‌ పెన్షన్‌ స్కీమ్‌ (ఎన్‌పీఎస్‌), ఈఎస్‌ఐ స్కీమ్‌, ఈపీఎఫ్‌వో పరిధిలో ఉన్నవారు, ఏవైనా ఇతర చట్టబద్ధమైన సామాజిక భద్రత పథకాల పరిధిలో ఉన్నవారు, ప్రభుత్వ ఉద్యోగులు, జాతీయ పెన్షన్‌ పథకాన్ని ఎంచుకున్న రైతులు, ఉన్నత ఆర్థిక స్థితి కలిగిన వర్గాల వారు ఈ పింఛన్‌ పొందడానికి అనర్హులు.

దరఖాస్తు సమయంలో ఈ పత్రాలు అవసరం :

  • రైతు పాస్​పోర్ట్ ఫొటో
  • నివాస ధ్రువీకరణ
  • ఆదాయ రుజువు
  • వయసు నిర్ధారణ
  • సాగు భూమి వివరాలు
  • బ్యాంక్ పాస్ బుక్
  • ఆధార్‌
  • రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్​

దరఖాస్తు విధానం: ఈ పథకం కోసం ఆన్​లైన్​ లేదా ఆఫ్​లైన్​లో అప్లై చేసుకోవచ్చు.

ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రాసెస్: ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవడానికి మొదట మీరు కామన్ సర్వీస్ సెంటర్ (CSC)ని సందర్శించాలి. అక్కడున్న ఆపరేటర్​ రిజిస్ట్రేషన్ ప్రక్రియను​ పూర్తి చేస్తాడు.

ఆఫ్​లైన్ అప్లికేషన్ ప్రాసెస్:

  • ఆఫ్​లైన్​లో దరఖాస్తు చేసుకోవడానికి కూడా సమీపంలోని CSC కేంద్రాన్ని సంప్రదించాల్సి ఉంటుంది.
  • ఆఫ్​లైన్​లో అప్లై చేసుకునేందుకు దరఖాస్తు ఫారమ్​ నింపాల్సి ఉంటుంది. ఈ ఫారమ్ CSC కేంద్రంలో అందుబాటులో ఉంటుంది.
  • ఆధార్ నెంబర్, బ్యాంక్ అకౌంట్, ల్యాండ్ వివరాలు సహా ఇతర వివరాలను అప్లికేషన్​ ఫారమ్​లో పూరించాలి.
  • పూర్తి చేసిన తర్వాత ఫారమ్​ సబ్మిట్ చేసి స్కీమ్ ఫీజును కూడా చెల్లించాలి.
  • ఆ తర్వాత CSC ఆపరేటర్ ఈ పథకంలో రిజిస్ట్రేషన్​ ప్రక్రియను పూర్తి చేస్తారు. దీనికి సంబంధించిన అన్ని వివరాలనూ కేంద్ర పీఎంకేఎం పోర్టర్‌లో నమోదు చేసిన తరువాత రైతుకు సమాచారం వస్తుంది.

ప్రీమియం ఎంత చెల్లించాలి: ఈ పథకంలో చేరిన రైతులు వారి వయసు ప్రకారం 60 సంవత్సరాలు పూర్తయ్యే వరకు ప్రతి నెలా ప్రీమియం కట్టాల్సి ఉంటుంది. దీనిలో చేరే వారికి వయసును బట్టి ప్రీమియం ఉండగా.. రైతు చెల్లించిన మేరకు కేంద్ర ప్రభుత్వం కూడా తనవంతుగా బీమా కంపెనీకి చెల్లిస్తుంది.

ఉదాహరణకు 18 ఏళ్లు ఉన్న రైతు తనవాటాగా నెలకు రూ.55 చెల్లిస్తే కేంద్రం తనవాటాగా రూ.55ను కలిపి బీమా కంపెనీకి రూ.110 చెల్లిస్తుంది. 18 సంవత్సరాల వారికి ప్రీమియం రూ.55 ఉండగా ఏటా వయసును బట్టి రూ.3 నుంచి రూ.10 వరకు పెరుగుతుంది. 40 ఏళ్లవారు నెలకు రూ.200 ప్రీమియం కట్టాల్సి ఉంటుంది.

స్కీమ్ ప్రయోజనాలు:

  • ఈ పథకానికి దరఖాస్తు చేసుకున్న రైతులు 60 ఏళ్లు పూర్తయిన తర్వాత ప్రతి నెలా రూ.3 వేలు పెన్షన్ పొందుతారు.
  • ఈ స్కీమ్​ కోసం నమోదు చేసుకున్న రైతు ఒకవేళ మరణిస్తే అతడి భార్యకు ప్రతి నెలా పెన్షన్ మొత్తంలో సగం అంటే రూ.1500 లభిస్తుంది.
  • ఈ పథకం పూర్తిగా స్వచ్ఛందమైనది. అంటే రైతులు ఎప్పుడైనా దీన్ని ఆపేసుకోవచ్చు.

మీకు ఈ కార్డు ఉందా? - లేకపోతే చాలా పథకాలు మిస్ అయినట్లే- ఎలా అప్లై చేయాలో తెలుసా?

వడ్డీ లేకుండానే మహిళలకు రూ.5 లక్షల రుణం - ఎలా అప్లై చేసుకోవాలో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.