LIVE FEED
11:27 AM, 19 Dec 2024 (IST)
ఉత్తమ్
- అన్ని ప్రాజెక్టులు పద్ధతి ప్రకారం పూర్తి చేస్తున్నాం : ఉత్తమ్
- కాస్ట్ బెనిఫిట్ రేషియో చూసుకుని సాగునీటి ప్రాజెక్టులు పూర్తిచేస్తాం
- స్టేషన్‌ఘన్‌పూర్ కాల్వకు రూ.120 కోట్లు మంజూరు చేశాం.. త్వరలో టెండర్లు పిలుస్తాం
- ఇరిగేషన్ శాఖను బలపరుస్తున్నాం
- పదేళ్లుగా ఇరిగేషన్ శాఖలో నియామకాలు లేవు
- మేము అధికారంలోకి వచ్చాక 700 మందిని ఇరిగేషన్ శాఖలోకి తీసుకున్నాం
- బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు భూసేకరణకు రూ. 37 కోట్లు విడుదల చేశాం
- బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు భూసేకరణకు ఈ వారంలో రూ.22 కోట్లు విడుదల చేస్తాం
- ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ పనులు యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించాం
- రెండేళ్లలో ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ పనులు పూర్తి చేస్తాం
10:50 AM, 19 Dec 2024 (IST)
- ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ మాల కుల సంఘాల అసెంబ్లీ ముట్టడి
- ఆందోళనకారులను అడ్డుకొని వాహనాల్లో ఎక్కించిన పోలీసులు
- మాదిగలకు ప్రభుత్వ అనుకూల వైఖరిని నిరసిస్తూ అసెంబ్లీ ముట్టడించామని వెల్లడి
10:41 AM, 19 Dec 2024 (IST)
- స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాల్సిందే: కేటీఆర్
- కొత్త పురపాలక, జీహెచ్ఎంసీ, పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లుల్లో ఈ అంశం లేదు: కేటీఆర్
- 3 బిల్లులకు బీఆర్ఎస్ తరఫున సవరణలు ప్రతిపాదిస్తున్నాం: కేటీఆర్
- మా సవరణలు ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాల్సిందే: కేటీఆర్
- అవసరమైతే సభలో డివిజన్‌కు కూడా పట్టుబడతాం: కేటీఆర్
- బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది: కేటీఆర్
- నవంబర్‌లోగా కులగణన పూర్తి చేస్తామని కాంగ్రెస్ చెప్పింది: కేటీఆర్
- కులగణన తేల్చకుండా చట్ట సవరణకు అసెంబ్లీలో ప్రయత్నిస్తున్నారు: కేటీఆర్
- 50శాతం పైగాఉన్న బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు దక్కకుండా చేస్తున్నారు: కేటీఆర్
- 42 శాతం రిజర్వేషన్లు ప్రస్తావించకపోవడం బీసీలను మోసం చేయడమే: కేటీఆర్
10:23 AM, 19 Dec 2024 (IST)
- శాసనసభలో ప్రశ్నోత్తరాలు ప్రారంభం
- ప్రతిపక్షాలకు మరొకసారి విజ్ఞప్తి చేసిన స్పీకర్
- వెల్‌లోకి రావడం, ప్లకార్డుల ప్రదర్శన, నినాదాలు చెయ్యడం సరికాదు: స్పీకర్
- మనం పెట్టుకున్న నిబంధనలు మనమే ఉల్లంఘించడం సరికాదు: స్పీకర్
10:08 AM, 19 Dec 2024 (IST)
- ఎడ్లబండిపై అసెంబ్లీకి వచ్చిన బీజేపీ ఎమ్మెల్యేలు
- రైతు రుణమాఫీ నిధులు వెంటనే విడుదల చేయాలని ప్లకార్డులతో ప్రదర్శన
10:08 AM, 19 Dec 2024 (IST)
ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు
- ప్రారంభమైన శాసనసభ సమావేశాలు
- శాసనమండలి సమావేశాలు ప్రారంభం
9:52 AM, 19 Dec 2024 (IST)
కాసేపట్లో ప్రారంభంకానున్న శాసనసభ, మండలి సమావేశాలు
- కాసేపట్లో ప్రారంభంకానున్న శాసనసభ, మండలి సమావేశాలు
9:51 AM, 19 Dec 2024 (IST)
అసెంబ్లీకి వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి
- అసెంబ్లీకి వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి
- అందుబాటులో ఉన్న మంత్రులతో సమావేశమైన సీఎం
- ఇవాళ శాసనసభలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ