ETV Bharat / entertainment

కీర్తి సురేశ్ పెళ్లిలో ఆమె డ్రీమ్ ఐకాన్- స్పెషల్ పోస్ట్ చూశారా? - KEERTHY SURESH WEDDING

కీర్తి సురేశ్ పెళ్లిలో ముఖ్య అతిథి- డ్రీమ్ ఐకాన్ అంటూ పోస్ట్ చేసిన నటి

Keerthy Suresh Wedding
Keerthy Suresh Wedding (Source : ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : 3 hours ago

Keerthy Suresh Wedding : కోలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేశ్ తన ప్రియుడు ఆంటోనీని ఈనెల 12న వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లి వేడుక గోవాలో గ్రాండ్​గా జరిగింది. ఈ ఈవెంట్​కు కోలీవుడ్​ సినీ ప్రముఖులు హాజరై సందడి చేశారు. ఈ పెళ్లికి తన డ్రీమ్‌ ఐకాన్‌ వచ్చి ఆశీర్వదించారంటూ కీర్తి తాజాగా పోస్ట్ షేర్ చేశారు. దీనికి సంబంధించి ఫొటోలు కూడా అప్లోడ్ చేశారు. మరి ఆ ముఖ్య అతిథి ఎవరంటే?

కోలీవుడ్ స్టార్ హీరో తలపతి విజయ్ కీర్తి పెళ్లికి హాజరై సందడి చేశారు. తమిళ సంప్రదాయం ప్రకారం తెల్లు చొక్కా, లుంగీ ధరించి వేడుకకు వచ్చిన ఆయన కొత్త జంటను ఆశీర్వదించి ఫొటో దిగారు. ఈ ఫొటోలను కీర్తి తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 'మా డ్రీమ్ ఐకాన్ మా పెళ్లికి వచ్చి ఆశీర్వదించిన క్షణాలు' అంటూ కీర్తి ఆనందం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్​గా మారాయి.

కాగా, కీర్తి సురేశ్‌- ఆంటోనీ దాదాపు 15 ఏళ్ల నుంచి స్నేహితులు. ఇదే విషయాన్ని ఇటీవల ఆమె అధికారికంగా చెప్పారు. దీపావళి వేడుకల్లో భాగంగా ఆయనతో కలిసి దిగిన ఫొటోని షేర్‌ చేశారు. దాదాపు 15 ఏళ్ల తమ స్నేహబంధం ఇకపై జీవితాంతం కొనసాగనుందని కీర్తి తెలిపారు. ఆంటోనీది వ్యాపార కుటుంబం. కొచ్చి, చెన్నైలలో వ్యాపారాలున్నాయి. స్కూల్‌ రోజుల నుంచే కీర్తితో ఆయనకు పరిచయం ఉంది. కాలేజీ రోజుల్లో ఆ పరిచయం ప్రేమగా మారింది. ఇప్పుడు ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో డిసెంబర్ 12న వివాహ బంధంతో ఒక్కటయ్యారు.

ఇక సినిమాల విషయానికొస్తే, ఆమె నటించిన 'బేబి జాన్' చిత్రం డిసెంబర్ 25న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో రీసెంట్​గానే పెళ్లి జరిగినప్పటికీ సినిమా ప్రమోషన్స్‌లో యాక్టివ్‌గా పాల్గొంటుంది. స్టార్ డైరెక్టర్ అట్లీ ఈ సినిమాను తెరకెక్కించారు. వరుణ్ ధావన్ కథానాయకుడు. కాగా, ఈ సినిమాతోనే కీర్తి బాలీవుడ్​లో అరంగేట్రం చేయనుంది.

క్రిస్టియన్ పద్ధతిలో కీర్తి పెళ్లి- క్యూట్ కపుల్ ఫొటోలు చూశారా?

కీర్తి సురేశ్ వెడ్స్​ ఆంటోనీ - గోవాలో గ్రాండ్​గా పెళ్లి - ఫొటోలు చూశారా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.