Mohan Babu Bail Petition in High court : నటుడు మోహన్‌బాబుకు హైకోర్టులో చుక్కెదురైంది. జర్నలిస్టుపై దాడి ఘటనలో మోహన్‌బాబు వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు న్యాయస్థానం తిరస్కరించింది. జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటి వద్ద జరిగిన ఘర్షణపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఈ కేసులో పోలీసులు తదుపరి దర్యాప్తు చేపట్టకుండా, తనను అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని ఆయన పిటిషన్ వేశారు. అయితే మోహన్‌బాబు అభ్యర్థనను ఉన్నత న్యాయస్థానం తిరస్కరించింది. పిటిషన్‌పై తదుపరి విచారణను న్యాయస్థానం గురువారానికి వాయిదా వేసింది.
మోహన్‌బాబుకు హైకోర్టులో చుక్కెదురు - ముందస్తు బెయిల్ పిటిషన్ వాయిదా - MOHAN BABU PETITION IN HIGH COURT
హైకోర్టులో మోహన్‌బాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌ను వాయిదా వేసిన హైకోర్టు - జర్నలిస్టుపై దాడి ఘటనలో హత్యాయత్నం కేసు నమోదు
ACTOR MOHAN BABU (ETV Bharat)
Published : Dec 13, 2024, 4:03 PM IST
|Updated : Dec 13, 2024, 4:16 PM IST
Last Updated : Dec 13, 2024, 4:16 PM IST