Commercial Taxes Department to Review GST Assessments once Again : రాష్ట్రంలో గత సర్కార్ హయాంలో జరిగిన జీఎస్టీ అసెస్‌మెంట్లల్లో భారీగా ప్రభుత్వ ఆదాయానికి గండిపడినట్లు వాణిజ్య పన్నుల శాఖ అనుమానిస్తోంది. కొందరు అధికారులు అసెస్‌మెంట్ల సమయంలో ప్రభుత్వ రాబడులకు గండికొట్టి జేబులు నింపుకున్నట్లు ఇటీవల నిర్వహించిన అనేక పరిశీలనల్లో ప్రాథమికంగా గుర్తించినట్లు తెలుస్తోంది. వందల కోట్లల్లో ఆదాయానికి గండిపడి ఉంటుందని అంచనా వేస్తున్న వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ శ్రీదేవి తిరిగి పునఃపరిశీలన చేసి పన్నును మదింపు చేసేందుకు నడుం బిగించారు.
Tax Department: పదోన్నతులు కల్పించారు.. పోస్టింగ్‌లు ఇవ్వడం మరిచారు
ఇందులో భాగంగా రాష్ట్రంలో రూ.5 కోట్లకు పైగా టర్నోవర్ కలిగిన అసెస్‌మెంట్లను పునఃపరిశీలన చేసేందుకు అంతర్గత ఉత్తర్వులు జారీ చేశారు. జీఎస్టీ చట్టంలోని సెక్షన్ 108 ప్రకారం కింది స్థాయి అధికారులు చేసిన అసెస్‌మెంట్లను పైస్థాయి అధికారులు పునఃపరిశీలన చేసేందుకు, లోటుపాట్లను సవరించి ఎక్కువ ట్యాక్స్ మదించేందుకు అవకాశం ఉంది. తెలంగాణలో 2021-22, 2022-23, 2023-24 ఈ మూడు ఆర్థిక సంవత్సరాల్లో 14 వాణిజ్య పన్నుల డివిజన్ల పరిధిలో రూ.16,172 కోట్ల విలువైన, 70,000లకు పైగా అసెస్‌మెంట్లు పూర్తి చేశారు. అయితే ఇందులో 13,000ల కోట్లకుపైగా విలువైన దాదాపు 15,000ల అసెస్‌మెంట్లు ఉన్నాయి. ఇవన్నీ ఐదు కోట్లకు పైగా టర్నోవర్ కలిగినవి ఉండడంతో వాటన్నింటినీ పునఃపరిశీలన చేయాలని నిర్ణయించారు.
పన్నుల వసూళ్లు పెంచేందుకు వాణిజ్య పన్నుల శాఖ పక్కాప్లాన్
అంతర్గత ఉత్తర్వులు జారీ చేసిన కమిషనర్ :ఇప్పటికే 13,000లకు పైగా అసెస్‌మెంట్ల పునఃపరిశీలనకు వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ శ్రీదేవి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు అంతర్గత ఉత్తర్వులు కూడా జారీ చేశారు. ఈ ఉత్తర్వులకు అనుగుణంగా ప్రతి సర్కిల్, ప్రతి డివిజన్ పరిధిలో చేసిన అసెస్‌మెంట్ల జాబితాను ఆయా డివిజన్ జాయింట్ కమిషనర్లకు, కమిషనర్ కార్యాలయంలో జాయింట్ కమిషనర్లకు ఇచ్చారు.