తెలంగాణ

telangana

ETV Bharat / state

బడ్జెట్‌పై సర్కార్ కసరత్తు - కేంద్రం నుంచి వచ్చే నిధుల ఆధారంగా కేటాయింపులు - Telangana Budget 2024 to 25

Telangana Budget 2024-25 : రాష్ట్ర వార్షిక బడ్జెట్ కసరత్తు కొనసాగుతోంది. శాఖలవారీగా ప్రతిపాదనలు సమీక్షిస్తున్న ఆర్థికశాఖ పద్దులకు త్వరలో తుదిరూపు ఇవ్వనుంది. తెలంగాణకు కేంద్రం నుంచి వచ్చే నిధుల విషయమై రేపటి కేంద్ర బడ్జెట్‌లో స్పష్టత రానుంది. ఆ వివరాలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర వార్షిక పద్దును ఖరారు చేయనున్నారు.

Telangana Budget 2024
Telangana Budget 2024

By ETV Bharat Telangana Team

Published : Jan 31, 2024, 6:57 AM IST

Updated : Jan 31, 2024, 10:47 AM IST

కొనసాగుతున్న రాష్ట్ర వార్షిక బడ్జెట్ కసరత్తు

Telangana Budget 2024-25 :వచ్చే ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర వార్షిక ప్రణాళిక తయారీ కసరత్తు జోరందుకుంది. 2024-25 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ కోసం (Telangana Budget 2024) అన్ని శాఖల నుంచి వచ్చిన ప్రతిపాదనలపై ఆర్థికశాఖ సమీక్షిస్తోంది. ఆయా శాఖల వారీగా మంత్రులు, కార్యదర్శులు, శాఖాధిపతులతో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. శాఖల వారీగా ఇచ్చిన ప్రతిపాదనలు వచ్చే ఏడాది అవసరాలు, ప్రభుత్వ ప్రాధాన్యాలు, తదితర అంశాలపై పూర్తిస్థాయిలో సమీక్షిస్తున్నారు.

Telangana Govt Exercise on Budget 2024 :ప్రభుత్వ ప్రాధాన్యతలకి అనుగుణంగా ప్రతిపాదనలు రూపొందించిన శాఖలు ఎన్నికల ముందు హామీ ఇచ్చిన గ్యారెంటీల అమలుకి ప్రత్యేకంగా ప్రాధాన్యమిచ్చినట్లు తెలిసింది. వంద రోజుల్లోనే హామీలను అమలు చేస్తామని ఇప్పటికే రేవంత్‌ సర్కార్ ప్రకటించింది. అందులో రెండింటిని ప్రారంభించింది. ఫిబ్రవరిలో మరో రెండు గ్యారెంటీలను అమలు చేసే యోచనలో ప్రభుత్వం ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా హామీలన్ని అమలు చేస్తామని చెబుతోంది. అందుకు అనుగుణంగా కొత్త బడ్జెట్‌లో నిధుల కేటాయింపుపై దృష్టి సారించింది.

ఆశల పల్లకిలో కొత్త బడ్జెట్​ - ఆర్థిక అవరోధాలను అధిగమించడం ఎలా?

ఏడాదిలోగా రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ సహా, మెగా డీఎస్సీ నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అందుకు అనుగుణంగా ప్రతిపాదనలు ఉండనున్నాయి. ఉద్యోగ నియామకాలను దృష్టిలో ఉంచుకొని అనుమతివ్వాలని ఇప్పటికే ఆర్థికశాఖను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. కేంద్రం అమలు చేసే పథకాలతోపాటు రాష్ట్రప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్‌రూపంలో కొంతమేర నిధులిస్తే కేంద్రం నుంచి ఎక్కువ మొత్తంలో నిధులు పొందడంపై దృష్టి సారించాలని ముఖ్యమంత్రి ఇప్పటికే అధికారులకు ఆదేశాలిచ్చారు. అందుకు అనుగుణంగా అధికారులు కసరత్తు చేశారు.

Telangana Budget Sessions2024-25 : లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కేంద్రం ఈ ఏడాది ఓట్‌ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను (Union Budget 2024) ప్రవేశ పెడుతోంది. రాష్ట్రానికి వివిధ రూపాల్లో ఏ పథకాల కింద ఏ మేరకు నిధులు వస్తాయో కేంద్ర పద్దులో స్పష్టత రానుంది. ఆ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతిపాదనలు ఖరారు చేయనున్నారు. అడ్డగోలు ఖర్చులు, అనవసరవ్యయం, దుబారా లేకుండా చూడాలని సీఎం సూచనతో తప్పనిసరి అవసరాలని దృష్టిలో పెట్టుకొని ప్రతిపాదనలు రూపొందిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.

రుణాల చెల్లింపులకే రూ.16 వేల కోట్లు - నీటి పారుదల ప్రాజెక్టులకు మరిన్ని నిధులు అవసరం

Vote on Account Budget in Telangana 2024 :బడ్జెట్ ప్రతిపాదనలు వాస్తవికంగా ఉండాలని గొప్పలకు పోవద్దని సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అందుకు అనుగుణంగానే 2024-25 వార్షిక పద్దు రానుంది. అప్పులు, ప్రత్యేకించి కార్పోరేషన్ల ద్వారా తీసుకునే రుణాలపై సర్కార్‌ విముఖతతో ఉండటంతో రుణాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం ఈ ప్రతిపాదనల్లో కీలకం కానుంది. బడ్జెట్‌ ప్రతిపాదనలపై శాఖల వారీ సమీక్షలు తుది దశకు చేరుకున్నాయి. కేంద్ర బడ్జెట్ తర్వాత తెలంగాణ పద్దు ప్రతిపాదనలకు తుదిరూపు ఇవ్వనున్నారు. రాష్ట్రంలోనూ ఓట్‌ ఆన్‌ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

2024-2025 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ కసరత్తు షురూ చేసిన ప్రభుత్వం

నీటి పారుదల శాఖకు భారీ బడ్జెట్ - రూ.40 వేల కోట్లతో ప్రతిపాదనలు!

Last Updated : Jan 31, 2024, 10:47 AM IST

ABOUT THE AUTHOR

...view details