తెలంగాణ

telangana

ETV Bharat / state

LIVE UPDATES : భూభారతి బిల్లు- 2024కు అసెంబ్లీ ఆమోదం - శాసనసభ రేపటికి వాయిదా - TS ASSEMBLY SESSION LIVE UPDATES

Telangana Assembly Session Live Updates
Telangana Assembly Session Live Updates (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : 11 hours ago

Updated : 5 hours ago

ఆరోరోజు కొనసాగుతున్న రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు. భూ భారతి బిల్లుపై అసెంబ్లీలో ప్రారంభమైన చర్చ. శాసనమండలి ముందుకు జీహెచ్​ఎంసీ సవరణ బిల్లు

LIVE FEED

3:05 PM, 20 Dec 2024 (IST)

  • విపక్ష పార్టీ అహంభావంతో వ్యవహరిస్తోంది: సీఎం
  • స్పీకర్‌ పట్ల కూడా దారుణంగా వ్యవహరించారు
  • తెలంగాణలో ప్రతి సమస్య భూమితోనే ముడిపడి ఉంది
  • రావి నారాయణ, బద్దం ఎల్లారెడ్డి, మల్లు స్వరాజ్యం వంటి వారు భూపోరాటాలు చేశారు
  • తెలంగాణలో ప్రజల ఆత్మగౌరవం నిలబెట్టేది భూమి: సీఎం
  • భూమిని కాపాడుకునే ప్రయత్నంలో దొడ్డి కొమురయ్య వంటి వారు ప్రాణాలు కోల్పోయారు
  • సర్వం ఒడ్డి పోరాటాలు చేసి భూములు కాపాడుకున్నారు
  • పేదల భూములు రక్షించేందుకే పటేల్‌, పట్వారీ వ్యవస్థ రద్దు చేశారు
  • భూమిలేని పేదలకు ఇందిరాగాంధీ ప్రభుత్వం భూమి ఇచ్చి ఆత్మగౌరవం నిలబెట్టింది

2:28 PM, 20 Dec 2024 (IST)

శాసనసభలో కొనసాగుతున్న బీఆర్‌ఎస్‌ సభ్యుల ఆందోళన

2:27 PM, 20 Dec 2024 (IST)

ఆందోళన చేస్తున్న వారిని సస్పెండ్‌ చేయాలి: అక్బరుద్దీన్

  • సభను ఆర్డర్‌లో పెట్టాలని అక్బరుద్దీన్‌ విజ్ఞప్తి
  • ఆందోళన చేసే సభ్యులను సస్పెండ్ చేయాలని కోరిన అక్బరుద్దీన్
  • ఆందోళన చేస్తున్న వారిని సస్పెండ్‌ చేయాలి: అక్బరుద్దీన్
  • ధరణి వల్ల వేల ఎకరాలు ఆక్రమణకు గురయ్యాయి: అక్బరుద్దీన్
  • ధరణిలో ఉన్న లోపాలను సరిచేసి రైతులు న్యాయం చేయాలి: అక్బరుద్దీన్
  • కోదండరామ్‌ కమిటీ రిపోర్టును ప్రభుత్వం బయటపెట్టాలి: అక్బరుద్దీన్
  • భూ భారతి బిల్లుకు పలు సవరణలు ప్రతిపాదించిన అక్బరుద్దీన్
  • రాష్ట్రావ్యాప్తంగా భూ సర్వే చేయాలని కోరుతున్నా: అక్బరుద్దీన్

2:27 PM, 20 Dec 2024 (IST)

ధరణిలో అక్రమాలు బయటకు రావాలంటే సీబీఐ విచారణ చేయించాలి : మంత్రి పొంగులేటి

  • ధరణిపై ఫోరెన్సిక్‌ ఆడిట్ వల్ల ఏం ప్రయోజనం ఉండదు
  • ధరణిలో అక్రమాలు బయటకు రావాలంటే సీబీఐ విచారణ చేయించాలి

2:27 PM, 20 Dec 2024 (IST)

  • శాసనసభలో బీఆర్‌ఎస్‌ సభ్యుల పెద్ద ఎత్తున నినాదాలు
  • బీఆర్‌ఎస్‌ సభ్యుల నినాదాల మధ్యే భూభారతి చట్టంపై చర్చ

2:26 PM, 20 Dec 2024 (IST)

భూ భారతి చట్టం ప్రజల చట్టం: మంత్రి పొంగులేటి

  • పేదోడికి చెందాల్సిన ఆస్తులు పేదోడికే అప్పగిస్తాం: మంత్రి పొంగులేటి
  • ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు ధరణిని బంగాళాఖాతంలో కలిపాం: పొంగులేటి
  • లోపభూయిష్టమైన ధరణి చట్టాన్ని ప్రక్షాళన చేశాం: మంత్రి పొంగులేటి
  • భూ భారతి చట్టం వల్ల ప్రజలు, పేదలు, రైతులకు న్యాయం: మంత్రి పొంగులేటి
  • భూ భారతి చట్టం ప్రజల చట్టం: మంత్రి పొంగులేటి
  • ధరణిపై ఫోరెన్సిక్‌ ఆడిట్‌ను ఏర్పాటు చేస్తాం: మంత్రి పొంగులేటి
  • ధరణిలో జరిగిన అవకతవకలపై పరిశీలిస్తాం: మంత్రి పొంగులేటి
  • ధరణిలో అక్రమాలు చేసి లాక్కొన్న ఆస్తులను స్వాధీనం చేసుకుంటాం: పొంగులేటి
  • సభను తప్పుదోవ పట్టించేలా బీఆర్‌ఎస్‌ సభ్యులు ప్రయత్నిస్తున్నారు: పొంగులేటి
  • అబద్ధాలతో కాలం గడపాలని బీఆర్‌ఎస్‌ యత్నిస్తుంది: పొంగులేటి: పొంగులేటి
  • ప్రతిపక్ష నేత సభకు రారు.. ప్రతిపక్ష నేత పాత్ర పోషించరు: పొంగులేటి
  • అబద్ధాలతో ప్రజలను మభ్యపెట్టాలని బీఆర్‌ఎస్‌ చూస్తుంది: పొంగులేటి
  • రౌడీలు, గూండాల్లా బీఆర్‌ఎస్ సభ్యులు ప్రయత్నిస్తున్నారు: పొంగులేటి
  • బీఆర్‌ఎస్‌ నేతలు రోజుకో డ్రామా చేస్తున్నారు: మంత్రి పొంగులేటి
  • బీఆర్‌ఎస్ దౌర్జన్యాలను ప్రజలు గమనిస్తున్నారు: మంత్రి పొంగులేటి

1:33 PM, 20 Dec 2024 (IST)

నిరసనల మధ్యే కొనసాగుతున్న ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ప్రసంగం

  • నిరసనల మధ్యే కొనసాగుతున్న ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ప్రసంగం
  • భూభారతి చట్టం ద్వారా రెవెన్యూ ట్రిబ్యూనల్‌ను ఎప్పటిలోపు తెస్తారు?
  • ధరణి సభ్యులపై ఐదుగురితో కమిటీ వేసి ఏడాది అయ్యింది

1:33 PM, 20 Dec 2024 (IST)

  • బీఆర్‌ఎస్ నేతల నిరసనల మధ్య కొనసాగుతున్న అసెంబ్లీ
  • నిరసనల మధ్యే భూభారతిపై కొనసాగుతున్న చర్చ
  • నిరసనలు ఉంటే బయట తెలపాలి: మంత్రి శ్రీధర్‌బాబు
  • భూభారతి బిల్లుపై రాష్ట్ర ప్రజలు

12:31 PM, 20 Dec 2024 (IST)

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో ముగిసిన సభాపతి సమావేశం

  • బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో ముగిసిన సభాపతి సమావేశం
  • సభ జరిగేందుకు సహకరించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కోరిన స్పీకర్
  • సభ జరిగేందుకు సహకరిస్తాం: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు
  • ఫార్ములా-ఈపై చర్చకు సభలో అనుమతివ్వాలని కోరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
  • సభానాయకుడైన సీఎంతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానన్న సభాపతి

11:12 AM, 20 Dec 2024 (IST)

ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ ఇచ్చే మంచి సూచనలు చట్టంలో పెట్టాలని అనుకున్నాం : శ్రీధర్‌ బాబు

  • కేసీఆర్ 80 వేల పుస్తకాలు చదివారు
  • పుస్తకాలను క్షుణ్ణంగా పరిశీలించి ధరణిని తయారుచేశారని అనుకునేవాళ్లం
  • ధరణి చట్టానికి మూడేళ్లకే వందేళ్లు నిండాయి: మంత్రి పొంగులేటి
  • ఇందిరమ్మ రాజ్యంలో 1971లో చేసిన చట్టం 49 సంవత్సరాలు ప్రజల్లో ఉంది
  • భూ భారతి బిల్లుకు సంబంధించి హరీశ్‌రావు కూడా అనేక సూచనలు ఇచ్చారు
  • భూ భారతి బిల్లు సభలో ప్రవేశపెట్టినప్పుడు ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ సూచనలు ఇస్తారని ఆశించాం
  • ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ ఇచ్చే మంచి సూచనలు చట్టంలో పెట్టాలని అనుకున్నాం
  • బడ్జెట్‌ ప్రవేశపెట్టిన సమయంలో కేసీఆర్ కొన్ని నిమిషాలే సభలో ఉన్నారు

11:12 AM, 20 Dec 2024 (IST)

  • సభలో జరిగిన అంశం బాధాకరం.. దురదృష్టకరం: మంత్రి పొంగులేటి
  • భూ భారతి బిల్లును ఆమోదించకుండా ప్రయత్నం చేస్తున్నారు: పొంగులేటి
  • సభ్య సమాజం సిగ్గుపడేలా బీఆర్‌ఎస్ సభ్యుల తీరు ఉంది: మంత్రి పొంగులేటి
  • సభలో గూండాగిరి, దౌర్జన్యం, రౌడీయిజం జరగకుండా చర్యలు చేపట్టాలని స్పీకర్‌ను కోరుతున్నా
  • ధరణిలో తప్పులతడకలు నాటి సీఎం కేసీఆర్‌కు తెలుసు: మంత్రి పొంగులేటి
  • ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడం సభ, తెలంగాణ ప్రజలను అవమానించడమే

11:05 AM, 20 Dec 2024 (IST)

సభలో జరిగిన అంశం బాధాకరం - దురదృష్టకరం: మంత్రి పొంగులేటి

  • హరీశ్‌రావు తీరు రాష్ట్ర ప్రజలకు తీరని అన్యాయం చేసే విధంగా ఉంది: స్పీకర్
  • సభను తప్పుదోవ పట్టించడం సరికాదు: స్పీకర్
  • భూ భారతి ముఖ్యమైన బిల్లు: స్పీకర్
  • ప్రజలకు సంబంధించిన బిల్లులపై చర్చల వేళ ఇలా ప్రవర్తించడం సరికాదు: స్పీకర్
  • భూ భారతి బిల్లు ఆమోదం పొందాక బీఆర్‌ఎస్‌ సభ్యులను నా ఛాంబర్‌కు పిలుస్తా

11:05 AM, 20 Dec 2024 (IST)

  • బిల్లు తర్వాత అయినా అవకాశం ఇవ్వాలని అడిగాం
  • ఒకే ఒక మంత్రి శాసనసభలో ఉన్నారు
  • ప్రధానమైన ఈ రేసింగ్‌ అంశంపై చర్చ పెట్టాలని స్పీకర్‌ను కోరాం

10:47 AM, 20 Dec 2024 (IST)

స్పీకర్‌ను అవమానించిన బీఆర్‌ఎస్‌ సభ్యుల సభ్యత్వం రద్దు చేయాలి : కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు

  • స్పీకర్‌ను అవమానించిన బీఆర్‌ఎస్‌ సభ్యుల సభ్యత్వం రద్దుకు డిమాండ్ చేస్తున్నాం
  • దళితుడు స్పీకర్ అయినందునే పేపర్లు చించి విసిరాలు: కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
  • దళితుడిని కించపరచడం తెలిసిన దుర అహంకారానికి నిదర్శనమే బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల ప్రవర్తన
  • దళితుడైన స్పీకర్‌ను పరుషపదాలతో మాట్లాడారు.. పేపర్లు అతనివైపు విసిరారు
  • గతంలో సంపత్‌కుమార్‌ పేపర్ విసిరేస్తే అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారు
  • బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలనూ సస్పెండ్ చేయాలని స్పీకర్, సీఎంను కోరుతున్నా
  • కబ్జా చేసిన భూముల బండారం బయటపడుతుందనే గందరగోళం సృష్టించారు
  • హరీశ్‌రావు స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారు: కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
  • కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు, కవిత, ఆనాటి ప్రభుత్వ పెద్దలు ధరణిని అడ్డుపెట్టుకొని పేదల భూములు లాక్కొన్నారు
  • లాక్కొన్న పేద ప్రజల భూముల వ్యవహారం బయటపడుతుందనే సభను అడ్డుకున్నారు
  • స్పీకర్ ఛైర్‌ను బీఆర్‌ఎస్‌ సభ్యులు అవమానపరిచారు
  • స్పీకర్‌ను అవమానించిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలపై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టాలి

10:37 AM, 20 Dec 2024 (IST)

బీఆర్‌ఎస్‌ సభ్యులు సభను తప్పుదోవ పట్టిస్తున్నారు : కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు

  • బీఆర్‌ఎస్‌ సభ్యులు సభను తప్పుదోవ పట్టిస్తున్నారు: కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
  • కాంగ్రెస్‌ 6 గ్యారంటీల అమలుతో ప్రజల్లో తిరగలేమని సభను తప్పుదోవ పట్టిస్తున్నారు
  • తప్పులు బయటపడతాయని డ్రామా ఆడుతున్నారు: కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
  • ఫార్ములా- ఈ కార్ రేస్ వ్యవహారంలో కేసు నమోదైంది: కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
  • ఏసీబీ దర్యాప్తు చేస్తున్న కేసును శాసనసభలో చర్చించకూడదన్న ఇంగితం లేకుండా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ప్రవర్తించారు
  • రాష్ట్రంలోని లక్షలాది ఎకరాల భూములను ఒక సామాజికవర్గం కొల్లగొట్టింది
  • కొల్లగొట్టిన భూముల వ్యవహారం బయటపడుతుందనే బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు సభను జరగనివ్వట్లేదు

10:34 AM, 20 Dec 2024 (IST)

సనసభలో అధికార, విపక్షాల మధ్య వాగ్వాదం

  • శాసనసభలో అధికార, విపక్షాల మధ్య వాగ్వాదం
  • ఫార్ములా- ఈ రేస్‌పై చర్చించాలని పట్టుబట్టిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
  • ఫార్ములా- ఈ రేస్‌ ఒక వ్యక్తికి సంబంధించిన అంశమన్న స్పీకర్‌
  • బిల్లు అనేది రాష్ట్ర ప్రజలకు సంబంధించిన అంశం: స్పీకర్
  • రాష్ట్ర ప్రజల శ్రేయస్సు గురించి బిల్లు చేశాం.. దానిపై చర్చించాక మీతో మాట్లాడతాను: స్పీకర్
  • ఒక సభ్యుడి గురించి రాష్ట్ర శ్రేయస్సును, సభా సమయాన్ని వృధా చేయడం పొరపాటు: స్పీకర్

10:23 AM, 20 Dec 2024 (IST)

కేటీఆర్‌పై అక్రమ కేసును ఎత్తివేయాలి : బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు

  • శాసన మండలిలో బీఆర్ఎస్ సభ్యుల ఆందోళన
  • ఫార్ములా-ఈ అంశంపై చర్చ జరగాలని బీఆర్ఎస్ సభ్యుల డిమాండ్
  • ఆందోళన విరమించాలని కోరినప్పటికీ పట్టు వీడని సభ్యులు
  • శాసన మండలి 15 నిమిషాలు వాయిదా వేసిన మండలి ఛైర్మన్
  • కేటీఆర్‌పై అక్రమ కేసులు ఎత్తివేయాలని ఎమ్మెల్సీల డిమాండ్

10:23 AM, 20 Dec 2024 (IST)

శాసనసభలో బీఆర్ఎస్ సభ్యుల ఆందోళన

  • శాసనసభలో బీఆర్ఎస్ సభ్యుల ఆందోళన
  • ఫార్ములా-ఈ అంశంపై చర్చ జరగాలని బీఆర్ఎస్ పట్టు

10:22 AM, 20 Dec 2024 (IST)

అసెంబ్లీ నడిచేటప్పుడు ఎమ్మెల్యేపై ఫార్ములా ఈ- కార్ కేసు పెట్టారు: హరీశ్‌రావు

  • బిల్లు అంశం తర్వాత ఏదైనా ఒక నిర్ణయం తీసుకుందాం: స్పీకర్
  • అసెంబ్లీ నడిచే సమయంలో ఒక ఎమ్మెల్యేపై అక్రమ కేసు పెట్టారు: హరీశ్‌రావు
  • ఫార్ములా-ఈ కార్ రేస్‌ అంశంలో స్పీకర్‌ను ఛాంబర్‌లో కలిసి విజ్ఞప్తి చేశాం: హరీశ్‌రావు
  • ఫార్ములా-ఈ కార్ రేస్‌ అంశంలో రకరకాల లీకులు ఇస్తున్నారు: హరీశ్‌రావు
  • కేటీఆర్‌ను అప్రతిష్టపాలు చేసి బీఆర్‌ఎస్‌ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు: హరీశ్‌రావు
  • మేం ఎలాంటి తప్పు చేయలేదు..: హరీశ్‌రావు
  • రాష్ట్ర ఆదాయాన్ని పెంచేందుకు ఫార్ములా- ఈ రేస్‌ నిర్ణయం తీసుకున్నాం: హరీశ్‌రావు
  • మేం తప్పు చేశామంటున్నారు.. సభలో చర్చించి అదేదో చెప్పాలి: హరీశ్‌రావు
  • మేం తప్పు చేయలేదు.. రాష్ట్రం కోసం చేశామని కేటీఆర్ చెప్పారు: హరీశ్‌రావు
  • ఫార్ములా-ఈ రేస్‌ విషయంలో స్పష్టమైన హామీ ఇస్తే సహకరిస్తాం: హరీశ్‌రావు
  • అసెంబ్లీ నడిచేటప్పుడు ఎమ్మెల్యేపై ఫార్ములా ఈ- కార్ కేసు పెట్టారు: హరీశ్‌రావు
  • పెట్టింది అక్రమ కేసు కాకుంటే.. వెంటనే సభలో చర్చించాలి: హరీశ్‌రావు

10:21 AM, 20 Dec 2024 (IST)

ది ఒక వ్యక్తికి సంబంధించిన అంశం : స్పీకర్

  • ఫార్ములా ఈ-రేస్‌పై చర్చకు బీఆర్‌ఎస్‌ పట్టు
  • ఇది ఒక వ్యక్తికి సంబంధించిన అంశమన్న స్పీకర్‌
  • మీరు అడిగేది వ్యక్తికి సంబంధించింది: స్పీకర్‌
  • బిల్లు అనేది రాష్ట్ర ప్రజలకు సంబంధించిన అంశం: స్పీకర్

10:21 AM, 20 Dec 2024 (IST)

ఫార్మలా- ఈ రేసుపై అసెంబ్లీలో చర్చించాలి.. లేకుంటే సభ జరగనివ్వం: జగదీశ్‌రెడ్డి

  • ఫార్మలా- ఈ రేసుపై అసెంబ్లీలో చర్చించాలి.. లేకుంటే సభ జరగనివ్వం: జగదీశ్‌రెడ్డి
  • ఫార్మలా- ఈపై సభలో సమాధానం చెప్పేందుకు కేటీఆర్ సిద్ధం: జగదీశ్‌రెడ్డి
  • స్పీకర్ పార్టీ నేతగా వ్యవహరించొద్దు: మాజీమంత్రి జగదీశ్‌రెడ్డి.
  • ఫార్మలా- ఈ అసెంబ్లీలో చర్చించాటనికి ప్రభుత్వానికి భయమెందుకు?: జగదీశ్‌రెడ్డి

10:20 AM, 20 Dec 2024 (IST)

నల్ల బ్యాడ్జీలతో అసెంబ్లీకి హాజరైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

  • నల్ల బ్యాడ్జీలతో అసెంబ్లీకి హాజరైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
  • శాసనసభకు చేరుకున్న కేటీఆర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
  • గ్యారెంటీలపై ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారని నినాదాలు
Last Updated : 5 hours ago

ABOUT THE AUTHOR

...view details