Technogeon-2024 Celebrations At NIT Warangal : విద్యార్థులే నిర్వాహకులై జరిపే టెక్నోజియాన్ వేడుక ఉత్సాహభరితంగా సాగింది. ప్రతి ఏటా సరికొత్త థీమ్‌తో జరిగే ఈ సాంకేతిక సంబురాలు ఈసారి ఇంజీనియస్ పేరుతో నూతన ఆవిష్కరణలు, సాంకేతిక స్ఫూర్తి అనే అర్థంతో జరుగుతున్నాయి. దేశం నలుమూలల నుంచి వచ్చిన 3 వేల మంది ఇంజినీరింగ్ విద్యార్థులు 40 కి పైగా ఈవెంట్లలో పాల్గొని ఔరా అనిపించారు. రెండో రోజు టెక్నోజియాన్ ఈవెంట్లలో భాగంగా విద్యార్థులు చేసిన పలు రోబోటిక్ ప్రదర్శనలు అందరినీ అలరించాయి.
Warangal National Institute of Technology: రోబోటిక్ విభాగంలో హైదరాబాద్‌కి చెందిన విద్యార్థులు రిమోట్ కంట్రోల్‌తో పనిచేసే కార్ల రేసులో ఒక ఆకారంలో పేర్చిన రాళ్ల మధ్యలో నిర్ణీత సమయంలో దూసుకు పోయేలా ప్రదర్శనలు చేశారు. ఈ వేడుకల్లో పలు కళాశాలల విద్యార్థులు పాల్గొని అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం నేపథ్యంలో బ్లూటూత్ కనెక్టివిటీ కంట్రోల్ ద్వారా దేశం మొత్తం చుట్టేస్తున్న వాహనాన్ని తయారుచేసి అందరీ దృష్టిని ఆకర్షించారు. ఎలక్ట్రిక్ వెహికల్ మోడలింగ్‌పై వర్క్‌షాప్‌లను నిర్వహించారు. సిమ్యులేషన్ ద్వారా ఎలక్ట్రిక్ వెహికల్ ఎలా తయారు చేయాలో ఈ వర్క్‌షాప్‌లో నేర్పిస్తున్నారు.
" ఈ రిమోట్ కార్స్ మేము స్వయంగా తయారు చేశాం. చాలా వాటికి ప్రిక్వెన్సిస్ సింక్ అవుతుంటాయి. మేము నేర్చుకున్న నాలెడ్జ్ ఉపయోగించి సింక్ కాకుండా బ్యాటరీలు రీఛార్జ్ కు సరిపడే విధంగా మల్టిపుల్‌గా బ్యాటరీలు అందుబాటులో ఉంచుకొని ఒ సారి రేస్ అయిపోగానే మళ్లీ ఇంకోసారి ప్రయోగించడానికి తయారు చేసుకుంటాం."-విద్యార్థులు