TDP Chief Chandrababu Naidu Return From Foreign Tour : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటన ముగించుకుని శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం అమెరికా వెళ్లిన చంద్రబాబు దాదాపు పది రోజుల పాటు అక్కడే గడిపారు. ఈ నేపథ్యంలో పార్టీ నేతలు పెద్ద ఎత్తున శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుని ఘనంగా స్వాగతం పలికారు. దాదాపు పది రోజులకు పైగా విదేశీ పర్యటనలో ఉన్న చంద్రబాబు తిరిగి రావడంతో ఆయనను కలిసేందుకు నేతలంతా ఉత్సాహంగా ఉన్నారు.
గత రెండు నెలలుగా రాజకీయ నాయకులు ఎన్నికల ప్రచారాలతో బిజీబిజీగా ఉన్నారు. ఈ వేసవి కాలంలో నేతల విమర్శలు, ప్రతి విమర్శలతో ఎన్నికల వేడి తారాస్థాయికి తీసుకెళ్లారు. క్షణం తీరికలేకుండా ప్రజలతో మమేకమయ్యారు. ఎట్టకేలకు ఈ నెల 13న ఆంధ్రప్రదేశ్లో 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాలకు పోలింగ్ ముగియడంతో కాస్త కుదుట పడ్డారు. అభ్యర్థులు భవిష్యత్తు జూన్ 4న తెలియనుంది. ప్రస్తుతానికి పోలింగ్ ముగియటంతో రాజకీయ విశ్రాంతి తీసుకుంటున్నారు. కౌటింగ్ వరకు సమయం ఉండటంతో వివిధ పార్టీల అగ్రనేతలు వారి కుటుంబ సభ్యులతో గడిపేందుకు నిర్ణయించుకున్నారు.