Vikarabad KGBV Students Illness : వికారాబాద్ జిల్లాలోని నస్కల్ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో 26 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురి కావడం కలకలం రేపింది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తీవ్ర కడుపు నొప్పి, వాంతుల వంటి లక్షణాలతో బాధపడ్డ విద్యార్థినులను హుటాహుటినా సమీప ఆసుపత్రికి తరలించారు. కాగా వారంతా ఐరన్ ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్లు వేసుకోవడం వల్ల అస్వస్థతకు గురైనట్టు డాక్టర్లు చెప్పారు.
కస్తూర్భా పాఠశాలలో 26 మంది విద్యార్థినులకు అస్వస్థత - ఆ ట్యాబ్లెట్లు వేసుకోవడమే కారణం! - KGBV Students Illness in Vikarabad - KGBV STUDENTS ILLNESS IN VIKARABAD
Illness of Girl Students in Kasturba School : వికారాబాద్ జిల్లా నస్కల్‌లోని కస్తూర్భా పాఠశాలలో 26 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, కడుపు నొప్పి, వాంతులతో విద్యార్థినులు ఇబ్బందులు పడుతుండటంతో ఆసుపత్రికి తరలించారు. కాగా వారంతా ఐరన్ ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్లు వేసుకోవడం వల్ల అస్వస్థతకు గురైనట్టు వైద్యులు నిర్ధారించారు.
Published : Jun 28, 2024, 10:36 AM IST
బాలికల్లో రక్తహీనత నిర్మూలనలో భాగంగా కలెక్టర్ ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. తొలుత నలుగురు బాలికలు అస్వస్థతకు గురి కావడంతో పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం వరుసగా మరో 22 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. వారందరికీ ప్రభుత్వ ఆసుపత్రిలోనే వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం నలుగురు విద్యార్థినుల పరిస్థితి మాత్రం బాగోలేదని డాక్టర్లు చెప్పారు.
ఆ నలుగురు బాలికలకు ముందుగానే ఆస్తమా ఉండడంతో శ్వాస తీసుకోవడంలో మరింత ఇబ్బంది పడుతున్నారని వివరించారు. ఈ విషయం తెలుసుకున్న వారి తల్లిదండ్రులు ఆసుపత్రికి పెద్దఎత్తున చేరుకున్నారు. విద్యార్థినుల పరిస్థితిపై జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ వైద్యులతో మాట్లాడారు.