తెలంగాణ

telangana

ETV Bharat / state

ఏలూరులో ఘోర రోడ్డు ప్రమాదం - ముగ్గురు మృతి - Road Accident in Eluru - ROAD ACCIDENT IN ELURU

Road Accident in Eluru : ఏలూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ద్వారకాతిరుమల మండలం లక్ష్మీనగర్ వద్ద ఆగివున్న కంటైనర్‌ను కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందారు. ప్రమాదానికి కారణమైన కారు, నల్లజర్ల వైపు నుంచి రాజమహేంద్రవరం వైపు వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు పోలీసులు గుర్తించారు.

Road Accident in Eluru
Road Accident in Eluru (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jul 8, 2024, 8:58 AM IST

Updated : Jul 8, 2024, 11:23 AM IST

Dwaraka Tirumala Road Accident Today :ఏలూరు జిల్లాలో ఇవాళ ఉదయం (జులై 8వ తేదీన) రోడ్డు ప్రమాదం జరిగింది. ద్వారకా తిరుమల మండలం లక్ష్మీనగర్ వద్ద ఆగివున్న కంటైనర్‌ను కారు ఢీ కొనడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మరణించగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. దీనిపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.

Road Accident in Eluru District : పోలీసులు, స్థానికులు తీవ్రంగా శ్రమించి మృతదేహాలను బయటికి తీసుకొచ్చారు. తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరిని ఏలూరు ఆశ్రం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి కారణమైన కారు, నల్లజర్ల వైపు నుంచి రాజమహేంద్రవరం వైపు వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు.

తూర్పుగోదావరి జిల్లా రాజవోలుకు చెందిన భాగ్యశ్రీ అనే మహిళ తన తల్లి, ఇద్దరు పిల్లలతో కలిసి, ఈనెల 6వ తేదీనన సాఫ్ట్​వేర్ జాబ్ ఇంటర్వ్యూ కోసం హైదరాబాద్​కు కారులో వెళ్లిందని పోలీసులు వివరించారు. తిరిగి స్వగ్రామానికి వస్తుండగా మార్గమధ్యలో, ద్వారకా తిరుమల మండలం లక్ష్మీనగర్ వద్ద ఆగి ఉన్న కంటైనర్​ను కారు ఢీ కొట్టిందని వెల్లడించారు.

ఈ ప్రమాదంలో భాగ్యశ్రీ, ఆమె తల్లి కమలాదేవి, పెద్ద కుమారుడు నాగ నితిన్ కుమార్ అక్కడిక్కడే మృతి చెందారని పోలీసులు చెప్పారు. డ్రైవర్ దుర్గావంశీ, భాగ్యశ్రీ చిన్న కుమారుడు నాగ షణ్ముక్ తీవ్రంగా గాయపడ్డారని పేర్కొన్నారు. బాధితులను ఏలూరు ఆశ్రం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. మరోవైపు ఘటనా స్థలాన్ని ఏలూరు జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి పరిశీలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అనంతరం మృతదేహాలను పోస్ట్​మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ద్వారకా తిరుమల మండలంలో రోడ్డు ప్రమాదం జరిగినట్లు మాకు సమాచారం అందింది. వెంటనే అంబులెన్స్​తో మేం అక్కడికి చేరుకున్నాం. మేం వెళ్లే వరకు కారు,కంటైనర్ ఢీ కొని కనిపించాయి. కారులో ప్రయాణిస్తున్న వారిలో నలుగురు మరణించారు. రెండు వాహనాల మధ్య మృతదేహాలు ఇరుక్కోవడంతో వాటిని బయటకు తీయడం కాస్త కష్టమైంది. ఇద్దరు ప్రాణాలతో తీవ్రంగా గాయపడి కనిపించారు. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించాం. ఈ ఘటనకు గల కారణాలపై ఆరా తీస్తున్నాం. - స్థానిక పోలీసులు

ఆర్టీసీ బస్సు బీభత్సం - నలుగురికి తీవ్ర గాయాలు - నిలిచిపోయిన ట్రాఫిక్ - Bus Accident in Suraram

సిమెంట్‌ ఫ్యాక్టరీలో బాయిలర్‌ పేలుడు - ఒకరు మృతి, 14 మందికి తీవ్రగాయాలు - Boiler Exploded AP Cement Factory

Last Updated : Jul 8, 2024, 11:23 AM IST

ABOUT THE AUTHOR

...view details