ETV Bharat / state

ఊళ్లోనే సొంత బిజినెస్ - మీరు ఆధార్ సెంటర్ నడిపిస్తారా? - పర్మిషన్ ఇలా తెచ్చుకోండి! - NEW AADHAAR CENTER APPLY PROCESS

కొత్తగా ఆధార్ సెంటర్ స్టార్ట్ చేయాలనుకుంటే - ఏవిధంగా అప్లై చేసుకోవాలో తెలుసా?

How to Apply for Aadhaar Franchise
Aadhaar Card Franchise (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 19, 2024, 5:08 PM IST

How to Apply for Aadhaar Card Franchise : దేశంలో ఆధార్ కార్డు ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సంక్షేమ పథకాలు పొందాలన్నా, ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు.. ఇలా ఎక్కడ ఏ పని జరగాలన్నా ప్రతి ఒక్కరికీ ఆధార్ కార్డు ఉండాల్సిందే. కాబట్టి, అంతటి ప్రాధాన్యమున్న ఆధార్​లో ఏమైనా తప్పులు ఉన్నా లేదా చిన్నారులు, లేనివారు కొత్తగా ఆధార్ కార్డు పొందాలన్నా ఆధార్ సెంటర్​కి వెళ్లాల్సిందే.

దీనిని బట్టి చూస్తే ఆధార్ సెంటర్లకు ఏ విధమైన డిమాండ్ ఉంటుందో మీరు అర్థం చేసుకోవచ్చు. ఆదాయం కూడా బాగానే ఉంటుందని చెప్పుకోవచ్చు! అయితే, నేటికి చాలా చాలా ప్రాంతాలలో ఆధార్ సెంటర్లు లేక చాలా మంది దూరప్రాంతాలకు వెళ్తున్నారు. కాబట్టి, ఈ నేపథ్యంలో మీరే కొత్తగా ఒక ఆధార్ సెంటర్ ఓపెన్ చేస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నారా? మరి, ఇంకెందుకు ఆలస్యం కొత్తగా ఆధార్ ఫ్రాంఛైజీని పొందాలంటే ఏం చేయాలి? అందుకు సంబంధించిన ప్రాసెస్ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

మీరు కొత్తగా ఆధార్ సెంటర్ ఓపెన్ చేయాలనుకుంటే.. మొదట దాని కోసం UIDAI నిర్వహించే పరీక్షలో పాస్ అవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాతనే మీకు ఈ సేవా కేంద్రాన్ని స్టార్ట్ చేయడానికి లైసెన్స్ మంజూరు చేస్తారు. అప్పుడు మీరు ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ నంబర్, బయోమెట్రిక్ వెరిఫికేషన్ చేయాలి. ఆ తర్వాత.. కామన్ సర్వీస్ సెంటర్ నుంచి రిజిస్ట్రర్ చేసుకోవాలి. ఇక కొత్త ఆధార్ ఫ్రాంఛైజీ పొందడానికి ఎలా అప్లై చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

మీ ఇంటి నుంచి ఆధార్ కేంద్రం ఎంత దూరంలో ఉంది? - ఒక్క క్లిక్​తో లొకేషన్ తెలుసుకోండిలా!

ఆధార్ ఫ్రాంఛైజీ లైసెన్స్ కోసం ఎలా అప్లై చేసుకోవాలంటే?

  • మీరు ముందుగా NSEIT అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
  • అక్కడ 'Create New User' అనే ఆప్షన్​ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి.
  • అనంతరం మీకు ఒక న్యూ ఫైల్ ఓపెన్ అవుతుంది. అందులో షేర్ కోడ్‌ను ఎంటర్ చేయమని అడుగుతారు.
  • ఆ షేర్ కోడ్ కోసం.. మీరు ఆఫ్‌లైన్ ఈ-ఆధార్‌కి వెళ్లి అక్కడ డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
  • ఇలా మీరు షేర్ కోడ్, xml ఫైల్ రెండింటిని కూడా డౌన్‌లోడ్ చేస్తారు. ఆపై ప్రక్రియ ఈవిధంగా ఉంటుంది.
  • అప్లై చేసుకునేటప్పుడు స్క్రీన్‌పై ఒక ఫారమ్ ఓపెన్ అవుతుంది. అప్పుడు అందులో పేర్కొన్న మొత్తం సమాచారాన్ని కరెక్ట్​గా ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి.
  • దాంతో మీ యూజర్ ఐడీ, పాస్​వర్డ్ మీ మొబైల్, ఈ-మెయిల్​కు వస్తాయి.
  • ఆ తర్వాత వాటిని యూజ్ చేసి ఆధార్ టెస్టింగ్ అండ్ సర్టిఫికేషన్ పోర్టల్‌కి ఈజీగా లాగిన్ అవ్వొచ్చు.
  • అనంతరం మీకు కంటిన్యూ ఆప్షన్ కనిపిస్తుంది.. దానిపై ప్రెస్ చేయాలి. అప్పుడు మరో ఫారమ్ ఓపెన్ అవుతుంది. అప్పుడు అందులో అడిగిన సమాచారాన్ని అందించాలి.
  • ఆ తర్వాత మీ వివరాలు కరెక్ట్​గా ఉన్నాయో లేదో సరి చూసుకొని ప్రొసీడ్ అనే ఆప్షన్​పై క్లిక్ చేస్తే ప్రక్రియ కంప్లీట్ అవుతుంది.
  • అనంతరం మీరు వినియోగదారులకు సేవలను అందించటం స్టార్ట్ చేయవచ్చు!

మీ ఇంట్లో అద్దెకుండేవారి ఆధార్​ అడిగారా? ఒరిజినలో కాదో ఎలా చెక్ చేయాలో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.