Maohan Babu Anticipatory Bail Petition : సీనియర్ నటుడు మోహన్‌బాబు (భక్తవత్సలం నాయుడు) హైకోర్టులో దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ పూర్తయ్యింది. ఈ పిటిషన్ విషయంలో తీర్పును న్యాయస్థానం ఈనెల (డిసెంబరు) 23వ తేదీకి వాయిదా వేసింది. మంచు మనోజ్ వల్ల కుటుంబ వివాదం నేపథ్యంలో జల్‌పల్లిలోని తన నివాసం వద్దకు వెళ్లిన ఓ ఛానల్ రిపోర్టర్‌పై దాడి ఘటనలో ఆయనపై పహాడీ షరీఫ్ పోలీసులు హత్యాయత్నం (Attempt to Murder) కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మోహన్‌బాబును పోలీసులు అరెస్టు చేయకుండా హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.
మోహన్‌బాబు, మంచు మనోజ్ వివాదం : జల్‌పల్లిలోని తన నివాసంలో (డిసెంబరు) జరిగిన ఘటనపై మోహన్ బాబు స్పందించిన తీరు అందరికీ తెలిసిందే. కొన్ని కారణాల వల్ల తాను, తన చిన్న కుమారుడు మంచు మనోజ్ ఘర్షణ పడ్డామని ప్రతి ఫ్యామిలీలోనూ ఇలాంటివి ఉండడం సహజమైనవేనని మీడియాకు ఓ ఆడియో రూపంలో సందేశాన్ని పంపించారు.
మనోజ్‌పై సంచలన ఆరోపణలు : మోహన్‌బాబు తన చిన్న కుమారుడు మంచు మనోజ్ భార్య(భూమా మౌనిక) మాటలు విని తాగుడుకు అలవాటుపడ్డాడని సంచలనమైన ఆరోపణలు చేశారు. కొన్ని మీడియా సంస్థలు రేటింగ్ కోసం ఉన్నది, లేనిదీ అంతా ఊహాగానాలతో రాస్తున్నాయని విడుదల చేసిన ఆడియోలో మోహన్ బాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. హైదరాబాద్ పోలీసులను తనకు రక్షణ కల్పించాలని ఫిర్యాదు చేస్తే సమాధానం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తన ఇంట్లోకి ఎవరిని రాకుండా అడ్డుకోవాల్సింది పోయి వారందరినీ పోలీసులే వదిలిపెట్టారని తెలిపారు. ఫిర్యాదు చేసినా పోలీసులు మనోజ్‌ను తన నివాసంలోకి ప్రవేశించకుండా కట్టడి చేయలేకపోయారన్నారు.
మోహన్‌బాబు తన కష్టార్జితమైన నివాసంలోకి కుమారుడు మనోజ్‌కు ప్రవేశించే అధికారం లేదని స్పష్టం చేశారు. మనోజ్ తన కుమార్తెను ఎప్పుడైనా జల్పల్లి నివాసం నుంచి తీసుకెళ్లవచ్చని తెలిపారు. ఒకవేళ మనోజ్ రాకపోయినా తాను ఆ పాపను జాగ్రత్తగా పెంచుతానని వెల్లడించారు. మోహన్‌బాబు భార్య ఆసుపత్రి నుంచి వచ్చాక మనోజ్ కుమార్తెను అప్పగిస్తానని తెలిపారు. ఈ వివాదానికి ఇంతటితో ముగింపు పలుకలాని మోహన్‌బాబు ఆఖర్లో తన కుమారుడు మనోజ్‌కు సూచించారు.
లా అండ్ ఆర్డర్‌కు విఘాతం కలిగించరాదు - మంచు విష్ణుకు సూచించిన రాచకొండ సీపీ
'నా ముందస్తు బెయిల్‌ను హైకోర్టు తిరస్కరించలేదు' - మోహన్‌బాబు మరో ట్వీట్