CM Revanth Reddy ON ORR SIT : ఓఆర్ఆర్ టోల్ టెండర్లపై సిట్‌ను ఏర్పాటు చేస్తామని అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సభలో ఔటర్‌రింగ్ రోడ్డు టోల్ కాంట్రాక్ట్‌పై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఔటర్‌రింగ్ రోడ్డును ఆయాచితంగా, అప్పనంగా ఎవరికో అప్పగించారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. లీజ్ మీద విచారణ జరపాలని హరీశ్‌రావు కోరటం అభినందనీయమన్నారు. టెండర్లపై విచారణ జరిపేందుకు సిట్‌ను ఏర్పాటు చేస్తామని సీఎం వెల్లడించారు. మంత్రివర్గంలో చర్చించి విధివిధానాలు రూపొందిస్తామని తెలిపారు.
"చాలా రోజుల నుంచి ఓఆర్ఆర్పై చర్చ జరుగుతోంది. ఎన్నికల కంటే ముందు హడావుడిగా సరైన విధివిధానాలు అవలంబించకుండా టెండర్ ప్రాసెస్‌ను డీవియేట్ చేసి కొద్ది మంది వ్యక్తులకు ఆయాచిత లబ్ధి చేకూర్చడానికి ఔటర్ రింగ్‌రోడ్డును అప్పజెప్పారని సమాజమంతా, రాష్ట్రమంతా దీనిపై తీవ్ర చర్చ జరిగింది. ఔటర్‌రింగ్ రోడ్డు లీజ్ మీద విచారణ జరపాలని హరీశ్‌రావు కోరటం అభినందనీయం. ప్రధాన ప్రతిపక్షం కోరిక మేరకు ఓఆర్ఆర్ టెండర్‌కు సంబంధించి ఈ సభ సభ్యులందరి ఆమోదంతో విచారణకు ఆదేశిస్తున్నా" - రేవంత్ రెడ్డి, సీఎం
హైదరాబాద్ విశ్వనగరంగా ఎదగడానికి కారణం కాంగ్రెస్ : హైదరాబాద్ అంతర్జాతీయ నగరంగా రాణించడానికి కారణం కృష్ణా - గోదావరి నదీ జలాలు, ఓఆర్ఆర్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, హైదరాబాద్ మెట్రో రైలు, ఫార్మా, ఐటీ కంపెనీలు, శాంతి భద్రతలు కాపాడటం, మత సామరస్యం పెంపొందించడమేనని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. భాగ్యనగరం విశ్వనగరంగా ఎదుగుతుందంటే అందుకు కారణం కాంగ్రెస్ పార్టీయేనని వివరించారు. ఔటర్ రింగ్ రోడ్డు, శంషాబాద్ ఎయిర్పోర్ట్ వల్ల రాష్ట్ర ఆదాయం పెరిగిందన్నారు.
వైఎస్ఆర్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వలన రాష్ట్ర ముఖచిత్రమే మారిపోయిందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. హస్తం పార్టీ తీసుకున్న విధానపరమైన నిర్ణయాల వల్ల రాష్ట్ర ఆదాయం పెరిగిందన్నారు. ఎన్నికల ముంగిట ఔటర్ రింగ్ రోడ్డును 30 సంవత్సరాల పాటు లీజుకు ఇవ్వటంపై రాష్ట్రంలో తీవ్ర చర్చ జరిగిందని తెలిపారు. ఔటర్ రింగ్‌రోడ్డు లీజు టెండర్లపై విచారణ జరిపించేందుకు సిట్(స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్)ను ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
ప్రస్తుత రాజకీయాల్లో అలాంటి నాయకులు ఎవరూ లేరు : సీఎం రేవంత్ రెడ్డి
రైతుల కోసం ఎంతైనా ఖర్చు చేసేందుకు సిద్ధం : సీఎం రేవంత్ రెడ్డి