Rera Balakrishna Case Update : అక్రమాస్తుల కేసులో అరెస్ట్ అయిన హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్, రెరా ఇన్‌ఛార్జి, కార్యదర్శి శివ బాలకృష్ణను ఎనిమిది రోజుల పాటు కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతించింది. ప్రస్తుతం చంచల్ గూడా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయిన్ను రేపటి నుంచి ఎనిమిది రోజుల పాటు ఏసీబీ ప్రధాన కార్యాలయంలో ఆయన్ను అధికారులు విచారించనున్నారు. ఇటీవల సోదాల్లో సుమారు 100 కోట్ల మేర అక్రమాస్తులు కూడబెట్టినట్లు గుర్తించిన అధికారులు పలువురు బినామీలను కూడా గుర్తించారు.
దర్యాప్తులో బినామీలు సహా బ్యాంకు లాకర్లను తెరవనున్నారు. అయన అదేశాలతో పనిచేసిన కొందరు అధికారులను సైతం విచారించే అవకాశం ఉంది. మరోవైపు శివబాలకృష్ణ వల్ల తాము నష్టపోయామని, తమకు న్యాయం చేయాలంటూ బాధితులు ఏసీబీ కార్యాలయానికి వస్తున్నారు. కస్టడీ విచారణలో భాగంగా శివబాలకృష్ణకు సంబంధిచిన మరికొన్ని ఆస్తులు వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉందని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు.
HMDA Ex Director Shiva Balakrishna Case : ఈ నెల 24, 25 తేదీల్లో శివ బాలకృష్ణ ఇల్లు సహా బంధువులు, సన్నిహితులు ఇళ్లతో కలిపి మొత్తం 18 చోట్ల ఏసీబీ సోదాలు నిర్వహించింది. సోదాల్లో భాగంగా రెండు ఇన్‌ఫ్రా సంస్థలకు అవినీతి నిరోధక శాఖ బృందాలు వెళ్లగా ఒక సంస్థలో అందుబాటులో లేరని అధికారులు తెలిపారు. కొత్తపేటలోని క్విఆరిజన్ స్పేస్ సంస్థలో అధికారులు సోదాలు చేశారు. కానీ బంజారాహిల్స్‌లోని సాయి సందీప్ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్‌లో సోదాలు చేసేందుకు కుదరకపోవడంతో వారిని కార్యాలయానికి పిలిచి విచారించాలని ఏసీబీ భావిస్తోంది.
ఇప్పటికే నోటీలు జారీ చేసినట్లు సమాచారం. మరో వైపు సోదాల్లో గుర్తించిన 15 బ్యాంకు ఖాతాలు లావాదేవీలపై అధికారులు అరా తీయనున్నారు. శివ బాలకృష్ణ సహ అతని సోదరుడు అతని భార్యా, కుమార్తె, కుమారుడు పేర్లపై ఈ బ్యాంకు ఖాతాలు గుర్తించారు. వీటిలో కొన్ని బ్యాంకు ఖాతాలకు లాకర్లు ఉన్నట్లు తెలిపారు. వాటిని వారి సమక్షంలో తెరిచేందుకు సిద్ధమయ్యారు.