తెలంగాణ

telangana

ETV Bharat / state

పుష్ప-2 సక్సెస్ మీట్​ - 'ఇన్ని రికార్డులకు కారణమైన ఏపీ డిప్యూటీ సీఎం పవన్​కు ప్రత్యేక కృతజ్ఞతలు' - PUSHPA 2 SUCCESS MEET

హైదరాబాద్​లో పుష్ప -2 సక్సెస్​ ప్రెస్​ మీట్​ - టికెట్​ ధరలు పెంచేందుకు అనుమతిచ్చిన రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలకు ధన్యవాదాలు తెలిపిన అల్లు అర్జున్ - సంధ్య థియేటర్ ఘటనపై స్పందించిన బన్నీ

Pushpa 2 Success Meet
Puspha 2 Success Meet (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Dec 7, 2024, 7:58 PM IST

Updated : Dec 7, 2024, 10:05 PM IST

Pushpa 2 Success Meet :టికెట్​ ధరలు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చి, ఇన్ని రికార్డులు సాధించడానికి కారణమైన ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్​ కల్యాణ్​కు హీరో అల్లు అర్జున్​ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. అలాగే తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు ధన్యవాదాలు తెలుపుతూ.. సీఎంలు రేవంత్​ రెడ్డి, చంద్రబాబులకు కృతజ్ఞతలు చెప్పారు. ప్రాంతీయ సినీ పరిశ్రమ అంచెలంచెలుగా ఎదిగి దేశంలో ఉన్నతస్థాయిలో ఉందని పేర్కొన్నారు. తొలిరోజు వచ్చిన నెంబర్లు తన సినిమాపై ఎంత మంది చూశారనడానికి నిదర్శనమన్నారు.

పుష్ప సినిమా విజయమంతా దర్శకుడు సుకుమార్​దే.. నన్ను ఎత్తుకొని ఎక్కడో పెట్టారని అల్లు అర్జున్​ హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్​లో జరిగిన పుష్ప -2 సక్సెస్​ ప్రెస్​మీట్​లో పుష్ప -2 మూవీ టీం పాల్గొంది. ప్రేక్షకులు ఎవరూ లేకుండానే పుష్ప -2 సక్సెస్​ మీట్​ జరిగింది. అతి కొద్ది మాత్రమే ఇందులో పాల్గొన్నారు. సంధ్య థియేటర్​ ఘటనపై మరోసారి అల్లు అర్జున్​ స్పందించారు.

నేను మూడేళ్ల తర్వాత సంధ్య థియేటర్​లో సినిమా చూడటానికి వెళ్లాను. థియేటర్​ బయట అభిమానుల ఒత్తిడి ఉండటం వల్ల నేను పూర్తి సినిమా చూడకుండానే వెళ్లిపోయాను. రేవతి చనిపోయారని తెలిశాక స్పందించడానికి నాకు సమయం పట్టింది. అందుకే కొంచెం ఆలస్యంగా స్పందించాల్సి వచ్చింది - అల్లు అర్జున్​

నేను మూడు రోజులు సంతోషంగా లేను : తాను మూడు రోజుల నుంచి సంతోషంగా లేనని.. మూడేళ్లు, ఆరేళ్లు సినిమా తీసినా ఒక ప్రాణాన్ని కాపాడుకోలేకపోయానని డైరెక్టర్ సుకుమార్ విచారం వ్యక్తం చేశారు. రేవతి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు. ఆ బాధ నుంచి బయటపడ్డాకే సినిమా రికార్డులు చూస్తున్నామని తెలిపారు.

టికెట్​ ధరలు సాధారణంగానే : పుష్ప -2 టికెట్​ ధరలపై మేం చర్చిస్తున్నామని ఆ సినిమా నిర్మాత రవిశంకర్​ తెలిపారు. టికెట్​ ధరలు అందుబాటులోనే ఉంటాయని, టికెట్​ ధర రూ.800 అనేది కేవలం ప్రీమియర్​ షోల వరకేనని నిర్మాత రవిశంకర్​ వెల్లడించారు. ఇప్పటికే పుష్ప - 2 సినిమా రూ.500 కోట్ల వసూలు సాధించిందని స్పష్టం చేశారు.

వరల్డ్​వైడ్​గా పుష్పరాజ్‌ రూలింగ్- 'వైల్డ్‌ ఫైర్‌' రికార్డులివే

'పుష్ప' తీసిన ప్రాణం : సంధ్య థియేటర్​కు అల్లుఅర్జున్ - తొక్కిసలాటలో మహిళ మృతి

Last Updated : Dec 7, 2024, 10:05 PM IST

ABOUT THE AUTHOR

...view details