Precautions Against Thieves in Summer: వేసవి వచ్చిందంటే ఎక్కువ మంది వేరే ఊరు వెళ్లేందుకు మక్కువ చూపుతారు. ఇదే అదునుగా చూసుకోని చోరులు రెచ్చిపోతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దొంగతనాలు ఎక్కువనే చెప్పాలి. ముఖ్యంగా రాత్రిపూట దుండగులు సొత్తు క్షణాల్లో మాయం చేస్తున్నారు. 2022లో మొత్తం 474 దొంగతనాలు చోటు చేసుకున్నాయి. వీటిల్లో ఒక్క వేసవి (మార్చి, ఏప్రిల్, మే)లోనే 255 (54%) ఘటనలు(Theft Cases in Summer) చోటుచేసుకోవడం గమనార్హం. అందునా రాత్రిపూట జరిగిన చోరీలు 127. 2023లోనూ ఇదే రిపీట్ అయింది. ఒక్క వేసవి సీజన్‌లో ఏకంగా 148 (39%) దొంగతనాలు జరగగా, వాటిల్లో రాత్రిపూట చోటుచేసుకున్నవి 137.
దొంగలున్నారు జాగ్రత్త - భాగ్యనగర వాసులను కలవరపెడుతున్న వరుస చోరీలు - Robbery Incidents in Hyderabad
Suggestions to Protect from Thieves Summer : పగలంతా రెక్కీ రాత్రయితే చోరీ షరామామూలైంది. ముఖ్యంగా తాళం వేసి ఉన్న నివాసాలే దుండగుల లక్ష్యాలుగా మారుతున్నాయి. పగలు, రాత్రీ అనే తేడా లేకుండా పోలీసు పెట్రోలింగ్ కొనసాగుతోందని పోలీస్ శాఖ అధికారులు చెబుతున్నారు. కానీ, కొంతమంది చేసే చిన్నచిన్న తప్పిదాలే దొంగలకు అవకాశాలుగా మారుతున్నాయన్నది నమ్మలేని నిజం. ఎవరైనా ఊరెళ్తే పొరుగువారిని అప్రమత్తం చేయటం, స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వడం మరిచిపోతున్నారు. ముఖ్యంగా ఇంట్లో నగదు, నగలు దాచిపెడుతున్నారు. సొత్తు రికవరీ శాతం తగ్గుతున్న తరుణంలో, ఈ వేసవిలో ముందస్తు జాగ్రత్తలే శ్రీరామరక్ష.
పట్టపగలే దొంగల బీభత్సం- రూ.7లక్షలు లూటీ- సినీ ఫక్కీలో ఫ్యామిలీ కిడ్నాప్ - Robbery In Dehradun