Power Bills Payment Process:ఒకప్పుడు ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం వంటి థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా ప్రజలు కరెంటు బిల్లులు చెల్లించేవారు. అయితే ఆర్బీఐ మార్గదర్శకాల మేరకు జులై 1 నుంచి ఆయా సంస్థలు విద్యుత్ బిల్లుల చెల్లింపులను నిలిపివేశాయి. డిస్కం వెబ్‌సైట్ లేదా టీజీఎస్పీడీసీఎల్ మొబైల్ యాప్‌లో మాత్రమే కరెంటు బిల్లులు చెల్లించాలని టీడీఎస్‌పీడీసీఎల్ వినియోగదారులకు సూచించింది. దీంతో వినియోగదారులు జులై 1 నుంచి తెలంగాణ డిస్కం అధికారిక వెబ్‌సైట్ లేదా యాప్ ద్వారా చెల్లింపులు చేస్తున్నారు. అయితే తాజా నిర్ణయం ప్రకారం.. కరెంటు బిల్లులు చెల్లించేందుకు చిక్కులు వీడాయి. విద్యుత్తు బిల్లులను గతంలో మాదిరిగా మొబైల్ యూపీఐ యాప్ ద్వారా చెల్లించవచ్చని అధికారులు చెబుతున్నారు.
కరెంటు బిల్లుల చెల్లింపుల్లో సమర్థత, భద్రతకు పెద్దపీట వేసే చర్యల్లో భాగంగా బిల్లు చెల్లింపులన్నీ భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్(Bharat Bill Payment System) ద్వారానే జరగాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) నిర్దేశించింది. చెల్లింపులన్నీ భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ ద్వారానే జరగాలని ఆదేశించి, దానికి సంబంధించిన కొత్త నిబంధనలను జులై 1వ తేదీ నుంచి తీసువచ్చింది. ఇందులో భాగంగా భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్‌ను బిల్లర్లు యాక్టివేట్ చేసుకోవాలని తెలిపింది.
కరెంటు బిల్లు ఎలా కట్టాలని టెన్షన్ పడుతున్నారా? - డోంట్ వర్రీ - ఇలా చేస్తే చిటికెలో పేమెంట్!