DSC Counselling Postponed :తెలంగాణ డీఎస్సీ ఉఫాధ్యాయ పోస్టింగ్ కౌన్సెలింగ్ వాయిదా పడింది. రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయ కౌన్సెలింగ్ వాయిదా వేస్తునట్లు విద్యాశాఖ ప్రకటించింది. సాంకేతిక కారణాలతో వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది. త్వరలో కొత్త పోస్టింగ్ కౌన్సెలింగ్ తేదీలు ప్రకటిస్తామని తెలిపింది. కాగా ఉద్యోగ నియామక పత్రాలు అందుకున్న 10,600మంది కొత్త టీచర్లకు మంగళవారం కౌన్సెలింగ్ ఏర్పాటు చేశారు.
డీఎస్సీ-2024 ద్వారా ఉపాధ్యాయ నియామక పత్రాలు అందుకున్న కొత్త టీచర్లకు నేడే(మంగళవారం) పోస్టింగులు ఇవ్వనున్నట్లు విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. మొత్తం 10,006 మందికి విద్యాశాఖ అధికారులు ఈ పోస్టింగులు ఇవ్వనున్నట్లు తెలిపారు. కొత్త ఉపాధ్యాయులు ఆయా డీఈఓలు సూచించిన కార్యాలయాల్లో జరిగే కౌన్సెలింగ్‌కు హాజరు కావాలన్నారు. ఎక్కువగా కలెక్టరేట్లలోనే కౌన్సెలింగ్ ప్రక్రియను జరపనున్నట్లు తెలిపారు. కానీ ఇంతలోనే సాంకేతిక కారణాల వల్ల పోస్టింగ్‌లు వాయిదా వేశారు.
ఆ ఊరి నుంచి 8 మంది ఒకేసారి డీఎస్సీకి ఎంపికయ్యారు
ఈ ఏడాది మెగా డీఎస్సీ ప్రకటించిన ప్రభుత్వం ఫిబ్రవరి 29న 11062 పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చింది. జులై 15 నుంచి ఆగస్టు 5 వరకు డీఎస్సీ పరీక్షను నిర్వహించి ఇటీవలే ఫలితాలను విడుదల చేసింది. డీఎస్సీలో అర్హత సాధించిన వారిని 1:3 నిష్పత్తిలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించి 10,006మందికి ఇటీవలే నియామక పత్రాలను అందజేసింది. వారికి నేడు రాష్ట్రవ్యాప్తంగా పోస్టింగ్ కౌన్సిలింగ్ నిర్వహించి మెరిట్ ఆధారంగా జిల్లాల్లోని ఖాళీను భర్తీ చేయాల్సి ఉంది. అయితే సాంకేతిక కారణాల ఈ ప్రక్రియను తాత్కాలింగ్ వాయిదా వేస్తున్నట్టు విద్యాశాఖ ప్రకటించింది. దీంతో ఇప్పటికే కౌన్సిలింగ్ కేంద్రాలకు చేరుకున్న వారి అటెండెన్స్ తీసుకుని వారికి తదుపరి తేదీలను వ్యక్తిగతంగా ఫోన్‌కి సమాచారం అందిస్తామని స్ఫష్టం చేసింది. ఇప్పటికే కొత్తగా ఎంపికైనా టీచర్లకు నియామక పత్రాలను ముఖ్యమంత్రి చేతులు మీదగా అందించారు. ఈ కార్యక్రమం ఎల్బీ స్టేడియంలో జరిగింది. కార్యక్రమానికి కొత్తగా ఎంపికైన అభ్యర్థులు హాజరయ్యారు. మరో డీఎస్సీ నోటిఫికేషన్‌కు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధపడుతోంది. ఇందుకు సంబంధించిన సమాచారం సీఎం, డిప్యూటీ సీఎం ఎప్పుడో ఇచ్చారు. వచ్చే ఏడాది ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది.
ఈ ఫ్యామిలీలో అక్కాచెల్లెళ్లు - ఆ ఫ్యామిలీలో అన్నదమ్ములు - ఒకే ఇంట్లో ఇద్దరు చొప్పున టీచర్లు
బాల్యం ఇటుక బట్టీలో - భవిష్యత్తు అంతా బంగారు 'బడి'లో