Heavy Rains in Nizamabad District : గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు నిజామాబాద్‌లోని చెరువులు, వాగులు వంకలు నిండు కుండలా మారాయి. భీమ్‌గల్ మండలంలోని కప్పలవాగు చెక్ డ్యామ్ పూర్తిగా నిండి వరద నీరు కిందికి ఉరకలెత్తుతోంది. దీంతో పలు పంటపొలాల్లోకి నీరు చేరి చెరువును తలపిస్తున్నాయి. కాగా తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లే రహదారి వర్షం ధాటికి కోతకు గురైంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. వాగులు, చెరువులవైపు వెళ్లొద్దని హెచ్చరించారు.
పనులు ప్రారంభించిన రైతులు :బోధన్ మండలంలోని లంగ్డాపూర్ పసుపు వాగులో చెక్ డ్యామ్ పొంగి పొర్లుతుంది. నవీపేట్ మండలంలోని జన్నెపల్లిలో పెద్ద చెరువు అలుగు పారుతుంది. స్థానికులు అక్కడికి వెళ్లి ఫొటోలు దిగుతున్నారు. వానాకాలం మొదలై వర్షాలు లేక రైతులు ఇబ్బందులు పడ్డారు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
మా రోడ్డెక్కడో పోయింది? - వర్షాలతో కొట్టుకుపోయిన రహదారులు - RAIN DAMAGE ROADS IN BHUPALPALLY
కోతకు గురైన రోడ్లు : మరోవైపు వర్షాలకు నిజామాబాద్ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు చోట్ల వర్షానికి రోడ్లు కోతకు గురయ్యాయి. దీంతో రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్నాయని స్థానికులు వాపోతున్నారు. శనివారం ఉదయం నుంచి మోస్తరుగా కురిసిన వర్షం సాయంత్రం ఒక్కసారిగా పెరగడంతో నగరంలోని కొన్ని ప్రాంతాల్లో రోడ్లపై చెట్టు విరిగి పడ్డాయి. ఎవరికీ ఎలాంటి హాని జరగలేదు. జోరు వానకు నగరంలోని వినాయక్ నగర్, నామ్‌దేవ్ వాడ, బోధన్ రోడ్, మాలపల్లి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. వరద నీటితో డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి.
కామారెడ్డి జిల్లా అంతటా ముసురు పెట్టింది. దీంతో వాతావరణం పూర్తిగా చల్లబడిపోయింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న జల్లులకు రోడ్లు చిత్తడిగా మారాయి. కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్ రోడ్లు జలమయమయ్యాయి. అత్యవసరమైతేనే కానీ బయటకు రావాలని అధికారులు ప్రజలకు సూచించారు. ఏదైనా సమస్యలు ఉంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. మరోవైపు రైతులు వ్యవసాయ పనుల్లో బీజీ అయ్యారు. అదను దాటుతుండడంతో వరి నాట్ల పనులు ముమ్మరం చేశారు.
'ముసురు' పట్టిన తెలంగాణ - మరో 5 రోజుల పాటు పొంచి ఉన్న వరుణుడి ముప్పు - heavy rain fall in telangana
నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు - అత్యవసరమైతే తప్ప బయటకు రాకండి - Heavy to very heavy rains today