Political Leaders Road Accidents in Morning :ఉదయం పూట ప్రయాణం అంటే తొందరగా గమ్యస్థానాలకు చేరుకోవచ్చనే అభిప్రాయం చాలా మందిలో ఉంటుంది. ముఖ్యంగా ప్రజా జీవితంలో నిత్యం తీరిక లేకుండా గడిపే రాజకీయ నాయకులకు(Politicians) ఈ సమయమే శ్రీరామరక్ష. ఎందుకంటే చాలా తక్కువ వ్యవధిలోనే చాలా కార్యక్రమాలకు హాజరు కావాల్సి వస్తోంది. కానీ ఇదే సమయం వారికి శాపంగా మారి మృత్యు సమయంగా మారుతోంది. పలు సందర్భాల్లో ఉదయపు ప్రయాణాలు ప్రాణాంతకంగా మారి ఆ నాయకుల కుటుంబాలకు తీరని వ్యథను మిగుల్చుతుంది. ఇలాంటి సందర్భంలోనే కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత(MLA Lasya Nanditha) వేకువజామునే ఓ కార్యక్రమానికి వెళ్లి చివరకు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలను కోల్పోయారు. ఆమె మాత్రమే కాదు, ఇలా చాలా మంది రాజకీయ నాయకులు ఉదయపు ప్రయాణాలతో ప్రాణాలను కోల్పోయారు.
ఇలా ఉదయం ప్రమాదంలో మరణించిన రాజకీయ నాయకులు :
- 2012 నవంబరు 2వ తేదీ తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో తెలుగుదేశం నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి కింజరాపు ఎర్రన్నాయుడు విశాఖపట్నంలో ఓ వివాహానికి హాజరై తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగి తీవ్ర గాయాలై కన్నుమూశారు.
- తెలుగుదేశం నాయకుడు లాల్‌జాన్ పాషా 2013 ఆగస్టు 15న హైదరాబాద్ నుంచి గుంటూరు వెళుతుండగా నకిరేకల్ వద్ద ఉదయం 6 గంటల ప్రాంతంలో జరిగిన ప్రమాదంలో మరణించారు.
- మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు తనయుడు నందమూరి హరికృష్ణ నార్కట్‌పల్లి-అద్దంకి హైవేపై 2018 ఆగస్టు 29న ఉదయం 6 గంటల సమయంలో జరిగిన ప్రమాదంలో ప్రాణాలు విడిచారు.
- అలాగే 2002 మార్చి నెలలో లోక్‌సభ స్పీకర్‌గా ఉన్న జీఎంసీ బాలయోగి ఉదయాన్నే హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు.
Road Accidents on National Highway 44 : హైవేలపై ప్రమాదాలకు కారణాలు ఇవే.. ఇకనైనా పట్టించుకుంటారా..?