People Lined Up for Fish in Khammam : ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం తూతక లింగన్నపేటలో చేపల కోసం జనం తొక్కిసలాడారు. ఆ గ్రామంలోని చెరువు వద్ద కిలో అతి తక్కువ ధరకే విక్రయించడంతో వివిధ మండలాల నుంచి జనం పెద్ద ఎత్తున పోటెత్తారు. రద్దీ పెరిగి ఉద్రిక్తతంగా మారడంతో పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది. వారి కాపలా మధ్య చేపల విక్రయం జరిగింది.
ఒక్క చేప రూ. 2 లక్షలు - పులస కూడా కాదండీ.. ఆయ్! - 2 KACHIDI FISH COST 4 LAKH RUPEES
ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం తూతక లింగన్నపేటకు చెందిన ఒక వ్యక్తికి చేపల చెరువు ఉంది. అందులో ఉన్న చేపలను విక్రయానికి పెట్టాడు. అది కూడా కిలో కేవలం రూ. 100కే. అతను చెరువు దగ్గరే చేపలను అమ్మడం మొదలు పెట్టాడు. కిలో చేపలు కేవలం రూ.100కే అన్న విషయం ఊరూరా పాకింది. ఎలాగో వాతావరణం చల్లబడుతుంది అలాగే మాంచి చేపల పులుసు, ఫ్రై చేసుకోవచ్చు అనుకున్నారో ఏమో అంతే వివిధ మండలాల నుంచి పెద్దఎత్తున ప్రజలు పోటెత్తారు.