NIA Raids in Hyderabad Today : హైదరాబాద్‌లోని పలుచోట్ల జాతీయ దర్యాప్తు సంస్థ సోదాలు నిర్వహించింది. మావోయిస్టు పార్టీతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలతో హిమాయత్‌నగర్‌లో విరసం నేత వరవరరావు అల్లుడు, వీక్షణం పత్రిక సంపాదకుడు ఎన్.వేణుగోపాల్ నివాసంలో ఈరోజు తెల్లవారుజామన 4 గంటల నుంచే ఎన్ఐఏ తనిఖీలు చేపట్టింది. సుమారు 5 గంటలపాటు ఆయన ఇంట్లో దాడులు కొనసాగాయి.
దేశంలో బాంబు పేలుళ్లకు ఐసిస్ కుట్ర- భగ్నం చేసిన ఎన్ఐఏ- 8 మంది ఉగ్ర ఏజెంట్లు అరెస్టు
NIA Raids Various Locations In Hyderabad : ఇటీవల మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడు సందీప్ దీపక్‌రావును పోలీసులు అరెస్ట్ చేశారు. దీపక్ దగ్గర దొరికిన సమాచారం మేరకు వేణుగోపాల్ నివాసంలో సోదాలు చేపట్టిన ఎన్‌ఐఏ అధికారులు, ఆయన సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. జాతీయ దర్యాప్తు సంస్థ తనిఖీలపై వేణుగోపాల్ స్పందించారు. ఎన్‌ఐఏ బృందం తన నివాసానికి సెర్చ్ వారెంట్‌తో వచ్చిందని ఆయన చెప్పారు.
NIA Searches Veekshanam Paper Editor Venugopal :సెప్టెంబరు 15న మలేషియా టౌన్‌షిప్‌లో మావోయిస్టు కేంద్ర కమిటీకి చెందిన సంజయ్ దీపక్‌రావును పోలీసులు అరెస్టు చేశారని వేణుగోపాల్ తెలిపారు. ఆ కేసులో తనకు కూడా సంబంధం ఉందని ఏ-22గా పేర్కొంటూ పోలీసులు కేసు నమోదు చేశారని పేర్కొన్నారు. దీని ఆధారంగా ఎన్‌ఐఏ కూడా కేసు నమోదు చేసిందని, ఇదే వ్యవహారంలో దాడులు చేశారని వివరించారు. తన సెల్‌ఫోన్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారని అన్నారు. ప్రస్తుతం తాను విరసం (విప్లవ రచయితల సంఘం)లో లేనని, అయినా ఎన్‌ఐఏ (NIA) అక్రమంగా తనపై కేసులు పెట్టిందని వేణుగోపాల్ ఆరోపించారు.