తెలంగాణ

telangana

ETV Bharat / state

నమ్మకంగా ఉంటూనే దోచేశారు - షాద్​నగర్​ చోరీలో నేపాలీ దంపతుల అరెస్టు - Nepali woman Robbery in Hyd - NEPALI WOMAN ROBBERY IN HYD

Nepal Couple and Gang Robbery : ఇంట్లో పని కావాలంటూ వస్తారు, పని చేస్తున్నట్లు నటిస్తూ వారి మీద నమ్మకం వచ్చేలా చేస్తారు. కట్​ చేస్తే ఎవరూ లేని సమయంలో వాళ్ల గ్యాంగ్​ను దించుతారు. దొరికిందల్లా మొత్తం దోచుకుంటారు. ఇదే ప్రణాళికతో నగరంలోని దొంగతానికి పాల్పడిన నేపాల్​ దంపతులను షాద్​నగర్​ పోలీసులు అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మరో ముగ్గురి కోసం గాలిస్తున్నారు.

Nepal Couple Robbery Gang in Hyderabad
Nepal Couple and Gang Robbery (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jul 10, 2024, 10:52 PM IST

Updated : Jul 10, 2024, 11:01 PM IST

Nepal Couple Robbery Gang in Hyderabad :ఇతర దేశాల నుంచి భారత్​కు వలస వచ్చి వారికి తెలిసిన పని చేస్తూ గౌరవంగా జీవిస్తుంటారు. అందులో ఒకరు నేపాల్​ దేశస్థులు. కానీ ప్రస్తుతం సీన్​ రివర్స్​ అయింది. పని చేస్తున్నట్లు నటించి, ఎంతో నమ్మకంతో ఉంటూ నిలువునా ముంచేస్తున్నారు. సంపన్నుల ఇళ్లలో పనివాళ్లుగా చేరి ఎంతో నమ్మకస్తులుగా నటించి అదును చూసి గ్యాంగ్​ను రంగంలోకి దించి చోరీలకు పాల్పడుతున్నారు. ప్రస్తుతం ఈ ముఠాలోని మహిళను, ఆమె భర్తను షాద్​నగర్​ పోలీసులు అరెస్టు చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నేపాల్ దేశానికి చెందిన ప్రసన్న బుద్వాల్​, ప్రశాంత్​ బుద్వాల్ తమ దేశానికి చెందిన కొందరితో కలిసి చోరీల బాట పట్టారు. నగరంలోని పనిమనిషిగా చేరి అక్కడే నమ్మకంగా పని చేస్తూ అవకాశం కోసం ఎదురు చూస్తారు. ఇంట్లో ఎవరు లేని సమయం చూసుకుని తమ గ్యాంగ్​ను రంగంలోకి దించుతారు. దర్జాగా ఇంటిని లూటీ చేస్తారు. ఇదే ప్రణాళికతో నగరంలోని అయ్యప్ప కాలనీకి చెందిన గాదం రమేశ్ ఇంట్లో పని చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది.

Nepal Couple and Gang Robbery (ETV Bharat)

పక్కా ప్రణాళికతో పనిమనిషిగా : జూన్ 30న ఇంటి యజమాని తన కుటుంబ సభ్యులతో కలిసి బంధువుల దగ్గరకు వెళ్తున్నట్లు ప్రసన్న బుద్వాల్​కు తెలిసింది. దీంతో ముఠాలోని భర్త ప్రశాంత్​ బుద్వాల్​తో పాటు కృష్ణ పశుపతి, బీమ్ సాహి, ఆకాశ్​లకు సమచారం ఇచ్చింది. వెంటనే ముఠా సభ్యులు అక్కడి చేరుకుని ఇంటి తాళాలు పగలగొట్టి బీరువాలో ఉన్న 9 తులాల బంగారంతో పాటు రూ.2 లక్షల నగదును దోచుకెళ్లారు. అదే రోజు సాయంత్రం ఇంటికి వచ్చిన యాజమాని రమేశ్ దొంగతనం జరిగినట్లు గుర్తించి షాద్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

బాధితుడి ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా ఇంట్లో పనిచేసే ప్రసన్న బుద్వాల్​ను విచారించగా అసలు విషయం బయట పడింది. అంతకుముందు నగరంలోని సాంబశివ కాలనీలో దొంగతనానికి పాల్పడినట్లు చెప్పింది. ముఠాలోని మిగతా సభ్యులు దొంగతనం చేసిన వెంటనే నేపాల్ దేశానికి వెళ్లిపోతారని తర్వాత ఆ సొమ్మును సమానంగా పంచుకుంటామని తెలిపింది. ప్రసన్న బుద్వాల్​తో పాటు ఆమె భర్త ప్రశాంత్​ బుద్వాల్​ను పోలీసులు అరెస్టు చేసి వారి నుంచి 13.5 తులాల బంగారంతో పాటు రూ. 25 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. ముఠాలోని మిగతా సభ్యులను త్వరలోనే అరెస్టు చేయనునట్లు పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న ముగ్గురు నేపాలీలను పట్టుకొని సొమ్మును రికవరీ చేస్తామని వెల్లడించారు.

విశ్రాంతి ఐఏఎస్​ అధికారి ఇంట్లో భారీ చోరీ - 100 తులాల బంగారం అపహరణ

'ఈ దొంగ స్టైలే వేరప్పా - డబ్బు ముట్టడు - బంగారం తాకడు - మొబైల్ ఫోన్లు మాత్రం వదలడు' - Mobile thief In Yellandu

Last Updated : Jul 10, 2024, 11:01 PM IST

ABOUT THE AUTHOR

...view details