ETV Bharat / state

కేటీఆర్​ వస్తాడా? రాడా? - ACB విచారణపై తీవ్ర సందిగ్దత - EX MINISTER KTR ACB INQUIRY

నేడు ఏసీబీ ముందు విచారణకు హాజరు కానున్న కేటీఆర్​ - ఉదయం 10 గంటలకు విచారణకు హాజరుకావాలని ఏసీబీ నోటీసులు - ఫార్ములా ఈ-కార్‌ రేసు కేసులో కేటీఆర్‌ను ప్రశ్నించనున్న ఏసీబీ

EX Minister KTR ACB Inquiry
EX Minister KTR ACB Inquiry (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 6, 2025, 8:19 AM IST

EX Minister KTR ACB Inquiry : ఫార్ములా ఈ కార్ రేస్ కేసుల్లో దర్యాప్తు సంస్థలు దూకుడు కొనసాగిస్తున్నాయి. ఈడీ, ఏసీబీ ఈ కేసులో విచారణ ముమ్మరం చేశాయి. సోమవారం నుంచి నిందితులను రెండు దర్యాప్తు సంస్థలు వరుసగా 5 రోజులు విచారణ చేయనుండటం ఆసక్తి రేపుతోంది. ఏసీబీ నమోదు చేసిన కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడిని విచారణకు హాజరు కావాలని ఈ నెల 3న నోటీసు జారీ చేసింది. మూడు రోజుల వ్యవధితోనే విచారణకు పిలవడంతో ఆయన హాజరవుతారా, సమయం కోరతారా అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. అయితే విచారణకు వచ్చేందుకే కేటీఆర్ నిర్ణయించుకున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.

ఫార్ములా ఈ కార్ కేసులో ఏసీబీ ముందు విచారణకు సోమవారం మాజీ మంత్రి కేటీఆర్ హాజరుకానున్నారు. ఆయనకు మూడు రోజుల కిందటే విచారణకు హాజరుకావాలని ఏసీబీ నోటీసులు అందజేసింది. ఈ కేసులో నిధుల బదలాయింపులో నిబంధనల ఉల్లంఘనపై ఏసీబీలోని సీఐయు విచారణ బృందం కేటీఆర్​ను ప్రశ్నించనుంది. మరోవైపు కేటీఆర్ ఈ నెల 7న విచారణకు హాజరు కావాలని ఈడీ అంతకుముందే కేటీఆర్​కు సమన్లు ఇచ్చింది.

ఈ కేసులో సీనియర్ ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్ 8న హెచ్ఎండీఏ విశ్రాంత చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డా 10న ఏసీబీ విచారణకు హాజరు కావాల్సి ఉంది. మరోవైపు బీఎల్ఎన్ రెడ్డిని ఇదే నెల 8న, అర్వింద్ కుమార్ 9న ఈడీ విచారించనుంది. ఇలా రెండు దర్యాప్తు సంస్థలు దూకుడుగా వ్యవహరిస్తుండటంతో ఏం జరుగుతుందోననే ఉత్కంఠ రేపుతోంది. ఆది నుంచే ఈ వ్యవహారంలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

ఫార్ములా ఈ రేస్​ కేసును న్యాయపరంగా ఎదుర్కొంటా - ఈ ఏడాది ఉప ఎన్నికలు రావచ్చు: కేటీఆర్

24 గంటల్లోనే రంగంలోని ఈడీ : గత నెల 19న తొలుత ఏసీబీ ఎఫ్ఎఐఆర్ నమోదు చేసిన వెంటనే ఈడీ రంగంలోకి దిగింది. ఈ ఎఫ్ఐఆర్ ఆధారంగా మరుసటి రోజే ఎన్​ఫోర్స్​మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ నమోదు చేయడంపై ఆసక్తికర చర్చ జరిగింది. సాధారణంగా ఏదైనా దర్యాప్తు సంస్థ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన అనంతరం ఆ కేసులో మనీలాండరింగ్, ఫారిన్ ఎక్చేంజ్ మేనేజ్ మెంట్ యాక్ట్ ఉల్లంఘనలు జరిగినట్లు ప్రాథమిక సమాచారం ఉంటేనే ఈడీ దర్యాప్తు చేపడుతుంది. కానీ పార్ములా ఈ రేస్ కేసులో మాత్రం ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన 24 గంటల్లోనే ఈడీ రంగంలోకి దిగింది. అంతేకాకుండా కేటీఆర్​ను ఈనెల 7న విచారణకు రావాలని గతనెల 28నే ఈడీ సమన్లు జారీ చేయగా అంతకు ఒకరోజు ముందే తమ ఎదుట విచారణకు హాజరు కావాలని ఏసీబీ ఈనెల 3న నోటీస్ ఇవ్వడంతో అసలు ఏం జరుగుతుందోననే ఆసక్తి నెలకొంది.

హైదరాబాద్​లో ఈ రేస్ సీజన్11, 12 నిర్వహణ నిమిత్తం యూకేకు చెందిన ఫార్ములా ఈ పరేషన్స్, తెలంగాణ మున్సిపల్ శాఖ, ఏస్ నెక్స్ట్జెన్ సంస్థల మధ్య 2022లోనే ఒప్పందం కుదిరింది. అయితే 9వ సీజన్ అయిపోయిన వెంటనే తమకు నష్టం వాటిల్లిందంటూ స్పాన్సర్ హోదా నుంచి ఏస్ నెక్స్ట్జెన్ సంస్థ తప్పుకోవడంతో ఎంఏయూడీ తరపున హెచ్ఎండీఏనే ఆ బాధ్యతను తీసుకుంది. ఈ క్రమంలో ఎఫ్ఈఓకు 45.71 కోట్లను చెల్లించింది. అయితే ఈ చెల్లింపుల్లో ఉల్లంఘనలు జరిగాయంటూ తాజాగా ఎంఏయూడీ ముఖ్యకార్యదర్శి దానకిశోర్ ఏసీబీకి ఫిర్యాదు చేశారు.

ఏమైనా మతలబులున్నాయా : ఆర్థిక శాఖ ఆమోదం పొందకుండానే హెచ్ఎండీఏ ఛైర్మన్ అయిన ముఖ్యమంత్రికి ఫైల్ పంపకుండానే, ఆర్బీఐ అనుమతి తీసుకోకుండానే ఈ చెల్లింపులు జరిగాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. లండన్లోని ఎఫ్ఈఓ ఖాతాకు గ్రేట్ బ్రిటన్ పౌండ్ల రూపంలోకి మార్చి సొమ్ము బదిలీ చేసిన క్రమంలో ఆదాయపన్ను మినహాయించలేదని అందువల్ల ఆదాయపన్ను శాఖకు రూ.8.06కోట్లను హెచ్ఎండీఏనే చెల్లించాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఈ ఉల్లంఘనల వెనక ఏమైనా మతలబులున్నాయా, తేల్చాలని కోరారు.

ఈ నేపథ్యంలోనే అప్పటి మంత్రి, ఎంఏయూడీ అప్పటి ప్రత్యేక ప్రధానకార్యదర్శి, హెచ్ఎండీఏ అప్పటి చీఫ్ ఇంజినీర్ పాత్ర ఉండటంతో అవినీతి కోణం పై ఏసీబీ దృష్టి సారించగా విదేశీ సంస్థకు నిధులు బదిలీ కావడం వెనక ఫెమా ఉల్లంఘనలతో పాటు నిధుల అంతిమ లబ్ధిదారులెవరనే కోణంలో ఈడీ దర్యాప్తు ఆరంభించింది. మొత్తంగా ఈడీ, ఏసీబీ దర్యాప్తుతో ఏం జరుగుతుందోనని రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.

ఈ నెల 6న విచారణకు రండి : కేటీఆర్‌కు ACB నోటీసులు

'రైతుబంధు పంపిణీలో అవినీతి జరిగితే విచారణ జరిపించండి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.